Serials: సీరియల్స్‌కి గుడ్ బై చెప్పి సినిమాల్లో సెటిల్ అయిన హీరో హీరోయిన్లు- వారిలో తల్లికొడుకు కూడా! వారు ఎవరెవరంటే?

Serial Actors Who Settled In Movies: బుల్లితెర సీరియల్స్‌లో మంచి క్రేజ్ సంపాదించుకుని ఆ తర్వాత సినిమాల్లో సెటిల్ అయిన హీరో హీరోయిన్లు చాలామంది ఉన్నారు. వారిలో పాపులర్ స్టార్స్ సైతం ఉన్నారు. అయితే, ఇటీవల కాలంలో సీరియల్స్‌కు గుడ్ బై చెప్పి సినిమాల్లో సెటిల్ అయిన హీరో హీరోయిన్లు ఎవరో లుక్కేద్దాం.

Published on: Mar 14, 2026, 13:24:26 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బుల్లితెర సీరియల్స్ అంటే తెలుగు రాష్ట్రాల్లో ఎంతో క్రేజ్ ఉంది. అయితే, సీరియల్స్ ద్వారా అలరించిన ఎంతోమంది నటీనటులు ఇప్పుడు సినిమాల్లో హీరో, హీరోయిన్సుగా అలరిస్తున్నారు. వారు ఎవరెవరో ఇక్కడ తెలుసుకుందాం.

సీరియల్స్‌కి గుడ్ బై చెప్పి సినిమాల్లో సెటిల్ అయిన హీరో హీరోయిన్లు- వారిలో తల్లికొడుకు కూడా! వారు ఎవరెవరంటే?
సీరియల్స్‌కి గుడ్ బై చెప్పి సినిమాల్లో సెటిల్ అయిన హీరో హీరోయిన్లు- వారిలో తల్లికొడుకు కూడా! వారు ఎవరెవరంటే?

జగతిగా జ్యోతి పూర్వజ్

స్టార్ మా ఛానెల్ గుప్పెడంత మనసు సీరియల్‌లో జగతిగా అశేష అభిమానులను ఆకట్టుకున్న నటి జ్యోతి రాయ్ అలియాస్ జ్యోతి పూర్వజ్. కన్నడ సీరియల్ ఇండస్ట్రీకి చెందిన జ్యోతి రాయ్ శాండల్ వుడ్‌తోపాటు తెలుగు బుల్లితెరపై మంచి నటిగా మార్కులు సంపాదించుకుంది.

ఇటీవలే తెలుగు సినిమాల్లో నటిస్తూ మంచి క్రేజ్ తెచ్చుకుంటోంది. జ్యోతి రాయ్ హీరోయిన్‌గా నటించిన లేటెస్ట్ మూవీ కిల్లర్. ఈ మూవీలో ఐదు విభిన్న పాత్రలు పోషించిన జ్యోతి పూర్వజ్ ప్రస్తుతం సీరియల్స్‌కు గుడ్ బై చెప్పేసి సినీ ఇండస్ట్రీలోనే సెటిల్ అయిపోయింది.

రవికృష్ణ

బుల్లితెర అతిపెద్ద సూపర్ హిట్ సీరియల్ మొగలి రేకులుతో పాపులారిటీ సంపాదించుకున్న నటుడు రవికృష్ణ. మొగలి రేకులో సైడ్ క్యారెక్టర్ చేసిన రవికృష్ణ వరూధిని పరిణయం, ఆమె కథ, బావా మరదళ్లు సీరియల్స్‌లో హీరోగా మెప్పించాడు. కట్ చేస్తే విరూపాక్ష సినిమాలో విలన్‌గా అద్భుతమైన నటనతో టాలీవుడ్ ఇండస్ట్రీని ఆశ్చర్యపరిచాడు.

విరూపాక్ష తర్వాత ది బర్త్ డే బాయ్ సినిమాలో కనిపించిన రవికృష్ణ రీసెంట్‌గా దండోరా మూవీలో కీలక పాత్ర పోషించాడు. పలు కారణాల వల్ల పుష్ప సినిమాలో అల్లు అర్జున్ ఫ్రెండ్ క్యారెక్టర్ కోల్పోయిన రవికృష్ణ ప్రస్తుతం సీరియల్స్‌కు గుడ్ బై చెప్పి సినిమాల్లోనే సెటిల్ అయిపోయాడు.

రిషిగా ముఖేష్ కుమార్ గౌడ

గుప్పెడంత మనసు సీరియల్‌తో తెగ పాపులర్ అయిన మరో సీరియల్ నటుడు ముఖేష్ కుమార్ గౌడ. ఈ సీరియల్‌లో రిషిగా యూత్‌లో మంచి క్రేజ్ తెచ్చుకున్న ముఖేష్ కుమార్ గౌడ కన్నడ ఇండస్ట్రీలో నాగ కన్నికే, నాగమందాల వంటి సీరియల్స్ చేశాడు.

అనంతరం ప్రేమ నగరు సీరియల్‌తో తెలుగు బుల్లితెరకు పరిచయం అయిన ముఖేష్ కుమార్ గౌడ గుప్పెడంత మనసు సీరియల్‌తో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇటీవలే తీర్థరూప తండేయవరిగే అనే కన్నడ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.

తల్లి కొడుకు పాత్రలు

ఇదే కాకుండా తెలుగులో గీత శంకరం అనే సినిమాతో హీరోగా లాంచ్ కానున్నాడు ముఖేష్ కుమార్ గౌడ. కాగా, గుప్పెడంత మనసు సీరియల్‌లో తల్లికొడుకులుగా నటించిన జ్యోతి పూర్వజ్, ముఖేష్ కుమార్ గౌడ వివిధ సినిమాల్లో హీరో హీరోయిన్లుగా చేయడం ఆసక్తికరంగా మారింది.

ఇంకా ఎవరెవరంటే?

ఇలా జగతి నుంచి రిషి వరకు పాత్రలు వేసిన జ్యోతి పూర్వజ్, ముఖేష్ గౌడతోపాటు అనసూయ భరద్వాజ్, బిగ్ బాస్ దివి, బిగ్ బాస్ సోహైల్, హీరోయిన్ అంజలి తదితరులు కూడా సీరియల్స్‌కు గుడ్ బై చెప్పి సినిమాల్లో సెటిల్ అయిన తారలే.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More