Serial Actress Deepika Kakar Emotional Post On Husband Birthday: బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితమైన నటి, బిగ్ బాస్ సీజన్ 12 విజేత దీపికా కాకర్ జీవితం ఇప్పుడు ఒక అగ్నిపరీక్షను ఎదుర్కొంటోంది. గతేడాది మే నెల నుంచి ఆమె స్టేజ్ 2 లివర్ క్యాన్సర్‌తో (కాలేయ క్యాన్సర్) పోరాడుతున్నారు.
కీమోథెరపీ చికిత్సలతో నరకం

వరుస సర్జరీలు, కీమోథెరపీ చికిత్సలతో ఎంతో నరకం చూస్తున్నప్పటికీ, దీపికా గుండె నిబ్బరంతో ముందడుగు వేస్తున్నారు. ఈ సుదీర్ఘ పోరాటంలో ఆమె వెన్నంటి నిలిచిన భర్త, నటుడు షోయబ్ ఇబ్రహీం పుట్టినరోజు సందర్భంగా శనివారం (జూన్ 20) దీపికా పెట్టిన ఒక పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
సూపర్ హిట్ హిందీ సీరియల్ 'ససురాల్ సిమర్ కా' ద్వారా దేశవ్యాప్తంగా విపరీతమైన ఆదరణ సంపాదించుకున్న హీరోయిన్ దీపికా కాకర్ టెలివిజన్ రంగంలో టాప్ స్టార్‌గా వెలిగింది. అలాంటి సీరియల్ హీరోయిన్ ఇప్పుడు క్యాన్సర్ బారిన పడటం అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ప్రస్తుతం ఆమె కోలుకునే క్రమంలో భాగంగా వైద్యుల సలహా మేరకు ఇమ్యునోథెరపీ చికిత్స తీసుకుంటున్నారు.
"నా ప్రతి ప్రార్థనలో నీ నామమే ఉంటుంది.."
షోయబ్ ఇబ్రహీం తన 39వ పుట్టినరోజును జరుపుకుంటున్న వేళ, దీపికా తన ఇన్‌స్టాగ్రామ్‌లో భర్తతో కలిసి ఉన్న ఒక ఫోటోను పంచుకున్నారు. "నువ్వు నా పక్కన ఉండటమే నా జీవితం చేసుకున్న అతిపెద్ద పుణ్యం. పరిస్థితి ఏదైనా సరే, నువ్వు నాతో ఉంటే నేను దేన్నైనా ఎదుర్కొంటాననే నమ్మకం నాకుంది. నువ్వే నా అతిపెద్ద బలం, నా సపోర్ట్, నా ప్రశాంతత. ఈ రోజు నీకు ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేదు, నా జేబు ఖాళీగా ఉంది. కానీ నా ప్రతి ప్రార్థనలో నీ నామమే ఉంటుంది" అని దీపికా రాసుకొచ్చారు.
భయపెట్టిన కణితి.. వ్లాగ్‌లో కన్నీళ్లు
భార్య ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు ఒక భర్త ఎలా నిలబడాలనే దానికి షోయబ్ ఒక నిదర్శనంగా నిలిచారంటూ నెటిజన్లు ఈ జంటపై ప్రశంసలు కురిపిస్తున్నారు. క్యాన్సర్ నిర్ధారణ అయినప్పటి నుంచి దీపికా తన యూట్యూబ్ వ్లాగ్స్ ద్వారా చికిత్సకు సంబంధించిన అప్డేట్స్ను క్రమం తప్పకుండా అభిమానులతో పంచుకుంటున్నారు.
{{/usCountry}}భార్య ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు ఒక భర్త ఎలా నిలబడాలనే దానికి షోయబ్ ఒక నిదర్శనంగా నిలిచారంటూ నెటిజన్లు ఈ జంటపై ప్రశంసలు కురిపిస్తున్నారు. క్యాన్సర్ నిర్ధారణ అయినప్పటి నుంచి దీపికా తన యూట్యూబ్ వ్లాగ్స్ ద్వారా చికిత్సకు సంబంధించిన అప్డేట్స్ను క్రమం తప్పకుండా అభిమానులతో పంచుకుంటున్నారు.
{{/usCountry}}ఇటీవల ఆమెకు కాలేయంలో 1.3 సెంటీమీటర్ల పరిమాణంలో ఒక చిన్న కణితి (సిస్ట్) మళ్లీ తిరగబెట్టింది. దీంతో ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆమెకు మరోసారి శస్త్రచికిత్స చేశారు.
"ఈ కణితి మళ్లీ రావడం నన్ను లోపల తీవ్రంగా కలచివేసింది. ఇప్పుడు నాకు చాలా భయంగా, ఆందోళనగా ఉంది. కానీ ఒక విషయం మాత్రం నాకు అర్థమైంది, మహిళలు మనం అనుకునేదానికంటే చాలా బలవంతులు. మన శరీరం చాలా సంక్లిష్టమైనది, ప్రతిరోజూ దీనిని తట్టుకుని నిలబడటం నిజంగా సెల్యూట్ చేయదగ్గ విషయం" అని దీపికా తన తాజా వ్లాగ్‌లో ఆవేదన వ్యక్తం చేశారు.
హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూ..
భార్య ఆరోగ్యం క్షీణించడంతో షోయబ్ ఇబ్రహీం సైతం తీవ్ర మానసిక ఆందోళనకు గురవుతున్నారు. "గత పది పన్నెండు రోజులుగా నేను వ్లాగ్స్ చేయడం తగ్గించాను. ప్రతిరోజూ హాస్పిటల్స్ చుట్టూ తిరగడం, డాక్టర్లను కలవడమే మా దినచర్యగా మారింది. రోజూ అదే విషయాన్ని చూపిస్తూ మిమ్మల్ని బోర్ కొట్టించడం నాకు ఇష్టం లేదు. అంతా సద్దుమణిగాక పూర్తి వివరాలు ఒకేసారి పంచుకుంటాను" అని షోయబ్ తన అభిమానులకు తెలిపారు.
ప్రస్తుతం దీపికా కాకర్ కోలుకునే దశలో ఉన్నారు. కీమోథెరపీ తర్వాత వచ్చే శారీరక మార్పులను తట్టుకుంటూ ఇమ్యునోథెరపీని ఆశ్రయించారు.
ప్రాణాంతక వ్యాధి బారిన పడినా ధైర్యం కోల్పోకుండా, భర్త అందించిన ప్రేమే తనను బతికిస్తోందని ప్రపంచానికి చాటిచెప్పిన దీపికా త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని బుల్లితెర పరిశ్రమతో పాటు కోట్లాది మంది అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.