...
...
Next Story

TV Actress: స్కూల్ డేస్‌లో వేధింపులు, ఇంటి ఎదురు గోడపైనే రాతలు- నిద్రలేని రాత్రులు గడిపిన తల్లిదండ్రులు: బుల్లితెర నటి

Serial Actress Shubhangi Atre On Harassment: పాపులర్ టీవీ సీరియల్ హీరోయిన్ శుభాంగి ఆత్రే తన టీనేజ్‌లో ఎదుర్కొన్న భయాందోళనకర సంఘటనను పంచుకున్నారు. స్కూల్‌ డేస్‌లో ఒక వ్యక్తి తనను వెంటాడుతూ ఇంటి ఎదురు గోడలపైనే పేర్లు రాస్తూ వేధించిన తీరును, ఆ సమయంలో ఎదురైన భయాలను ఓ ఇంటర్వ్యూలో వివరించారు.

Published on: Aug 1, 2026, 10:45:27 IST
Advertisement

Serial Actress Shubhangi Atre On Harassment: హిందీ బుల్లితెరపై 'అంగూరీ భాబీ'గా కోట్లాది మంది ప్రేక్షకులను అలరించిన సీరియల్ హీరోయిన్ శుభాంగి ఆత్రే తెరపై ఎంతో నవ్వుతూ, సరదాగా కనిపిస్తారు. కానీ, ఆమె వ్యక్తిగత జీవితంలో ఒక చేదు జ్ఞాపకం, ఇప్పటికీ గగుర్పాటుకు గురిచేసే భయంకరమైన అనుభవం ఉంది.

గోడలపైనా, రోడ్లపైనా పేర్లు రాస్తూ భయాందోళనలు

స్కూల్ డేస్‌లో వేధింపులు, ఇంటి ఎదురు గోడపైనే రాతలు- నిద్రలేని రాత్రులు గడిపిన తల్లిదండ్రులు: బుల్లితెర నటి
స్కూల్ డేస్‌లో వేధింపులు, ఇంటి ఎదురు గోడపైనే రాతలు- నిద్రలేని రాత్రులు గడిపిన తల్లిదండ్రులు: బుల్లితెర నటి

'హాటర్ ఫ్లై' నిర్వహించిన 'ది మేల్ ఫెమినిస్ట్' కార్యక్రమంలో పాల్గొన్న శుభాంగి ఆత్రే తన స్కూల్ డేస్‌లో ఎదురైన ఒక వేధింపుల సంఘటనను బయటపెట్టారు. పదో తరగతి, ఇంటర్మీడియట్ చదువుతున్న రోజుల్లో మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఈ ఘటన జరిగిందని శుభాంగి చెప్పారు. ఒక వ్యక్తి తనను నిరంతరం వెంటాడుతూ, మానసికంగా వేధించేవాడని ఆవేదన వ్యక్తం చేశారు.

భయానకమైన ఘట్టం

"నా జీవితంలో అత్యంత భయానకమైన ఘట్టం అది. ఆ సమయంలో ఒక వ్యక్తి రోడ్లపైనా, పరిసరాల్లోని భవనాలపైనా నా పేరు, తన పేరు కలిపి రాసేవాడు. ఎంతలా అంటే.. మేము ఇంటి తలుపు తెరవగానే ఎదురుగా ఉండే గోడపై ఆ పేర్లే కనిపిచేవి. నిత్యం బైక్‌పై నన్ను అనుసరిస్తూ చుట్టూ తిరిగేవాడు" అని ఆనాటి సంఘటనను శుభాంగి గుర్తుచేసుకున్నారు.

రక్షణ లేని వాతావరణం.. కుటుంబంలో ఆందోళన

ఆ ఆకతాయి ఆగడాలు మితిమీరడంతో శుభాంగి కుటుంబం తీవ్ర భయాందోళనలకు గురైంది. ఆడపిల్లలపై జరుగుతున్న దాడుల వార్తలు వింటున్న రోజుల్లో, దారికాచే ఆకతాయిల వల్ల తల్లిదండ్రులు నిద్రలేని రాత్రులు గడిపేవారు. అయితే ఒకరోజు ఆమె సోదరి ధైర్యంచేసి ఆ వేధింపులకి అడ్డుకట్ట వేసింది.

బుద్ధి చెప్పిన అక్క

ఇలాంటి సంఘటనల వల్ల ఎంతోమంది ప్రతిభావంతులైన యువతులు బయటకు రావడానికి భయపడి, ఇళ్లకే పరిమితమైపోయే ప్రమాదం ఉందన్న ఆందోళనను ఆమె వ్యక్తం చేశారు. వేధింపులపై మహిళలు, యువతులు మౌనంగా ఉండకుండా గొంతు విప్పాలని, నేటి తరం అమ్మాయిలు తమ రక్షణ విషయంలో మరింత జాగ్రత్తతో వ్యవహరించడం మంచి పరిణామమని శుభాంగి అభిప్రాయపడ్డారు.

కస్తూరి నుంచి అంగూరీ భాబీ వరకు.. ప్రతిభతో గుర్తింపు

'కసౌటీ జిందగీ కే' సీరియల్‌తో నటనను ప్రారంభించిన శుభాంగి, ఏక్తా కపూర్ నిర్మించిన 'కస్తూరి' ధారావాహికతో నటిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 2007 నుంచి 2009 వరకు సాగిన ఈ సీరియల్ ఆమె కెరీర్‌ను మలుపు తిప్పింది. ఆ తర్వాత 2016లో 'భాబీజీ ఘర్ పర్ హై' సీరియల్‌లోకి ప్రవేశించి, అంగూరీ భాబీ పాత్రతో తనదైన అమాయకత్వంతో, ప్రత్యేకమైన సంభాషణ శైలితో ప్రతి ఇంటా పరిచయమై ఫుల్ క్రేజ్ తెచ్చుకున్నారు.

శుభాంగి ఆత్రే ఇతర సీరియల్స్

'చిడియా ఘర్', 'అధూరీ కహానీ హమారీ', 'హవన్' వంటి అనేక ఇతర ప్రముఖ సీరియళ్లలోనూ శుభాంగి ఆత్రే తనదైన ముద్ర వేశారు. సమాజంలో ఎదురయ్యే సవాళ్లను దాటుకుని, స్వశక్తితో బుల్లితెరపై చెరగని స్థానాన్ని సంపాదించుకున్న శుభాంగి ప్రయాణం ఎంతోమందికి స్ఫూర్తిదాయకం.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe