Serial TRP: తెలుగు టీవీ సీరియల్స్ లో కార్తీక దీపం 2 సీరియల్ కు ఓ ప్రత్యేక స్థానం ఉంది. కార్తీక దీపం సీరియల్ కు వచ్చిన విపరీతమైన సక్సెస్ కారణంగా ఇప్పుడు సీక్వెల్ కూడా కొనసాగుతోంది. ఈ కార్తీక దీపం 2 సీరియల్ కూడా తెలుగు ప్రజల అభిమానాన్ని సొంతం చేసుకుంటోంది. సీరియల్ టీవీ టీర్పీ రేటింగ్ లో కార్తీక దీపం 2 దూసుకెళ్లడమే ఇందుకు నిదర్శనం.
టాప్ లేపిన కార్తీక దీపం 2

కార్తీక దీపం 2 సీరియల్ ఇప్పటికే 700 ఎపిసోడ్లు దాటింది. ఈ సీరియల్ మెజారిటీ వారాలు టీఆర్పీ రేటింగ్ లో టాప్ లోనే కొనసాగుతోంది. మధ్యలో కాస్త తడబడ్డా ఈ మెగా సీరియల్ ఎప్పటికప్పుడూ పుంజుకుంటోంది. తాజాగా 24వ వారం బార్క్ రేటింగ్ లో కార్తీక దీపం 2 సీరియల్ మళ్లీ టాప్ లోకి వచ్చింది.
నంబర్ వన్ సీరియల్
జూన్ 12 నుంచి జూన్ 19 వరకు బార్క్ రిలీజ్ చేసిన టీవీ సీరియల్స్ టీఆర్పీ రేటింగ్ లో కార్తీక దీపం నంబర్ వన్ ప్లేస్ లో నిలిచింది. అర్బన్ ప్లస్ రూరల్ కలిపి ఈ సీరియల్ కు 11.38 రేటింగ్ వచ్చింది. జస్ట్ 0.01 రేటింగ్ తేడాతో గుండె నిండా గుడి గంటలు సెకండ్ ప్లేస్ లో నిలిచింది. అదే కేవలం అర్బన్ మాత్రమే తీసుకుంటే గుండె నిండా గుడి గంటలు సీరియల్ 11.08 రేటింగ్ తో టాప్ లో ఉంది. కార్తీక దీపం 9.32తో ఉంది.
స్టార్ మా సీరియల్స్ రేటింగ్
- కార్తీక దీపం 2- 11.38 (U+R)
- గుండె నిండా గుడి గంటలు- 11.37 (U+R)
- ఇంటింటి రామాయణం- 10.27 (U+R)
- ఇల్లు ఇల్లాలు పిల్లలు- 10.05 (U+R)
- పొదరిల్లు- 9.27 (U+R)
దీప సీఈఓ
గత వారం కార్తీక దీపం 2 సీరియల్స్ లో అదిరిపోయే ట్విస్ట్స్ అండ్ టర్న్స్ నెలకొన్నాయి. సీఈఓ పోస్టు కోసం జ్యోత్స్న ఎన్ని కుట్రలు వేసినా చివరకు దీపే గెలిచింది. అన్ని పరీక్షలు దాటుకుని రెస్టారెంట్ బ్రాంచ్ ను లాభాల్లోకి తీసుకొచ్చిన దీపను శివ నారాయణ సీఈఓగా నియమించాడు. దీంతో జ్యో పరిస్థితి కుడిదిలో పడ్డ ఎలుకలా మారింది.
ఈ సీరియల్స్ కూడా
{{/usCountry}}గత వారం కార్తీక దీపం 2 సీరియల్స్ లో అదిరిపోయే ట్విస్ట్స్ అండ్ టర్న్స్ నెలకొన్నాయి. సీఈఓ పోస్టు కోసం జ్యోత్స్న ఎన్ని కుట్రలు వేసినా చివరకు దీపే గెలిచింది. అన్ని పరీక్షలు దాటుకుని రెస్టారెంట్ బ్రాంచ్ ను లాభాల్లోకి తీసుకొచ్చిన దీపను శివ నారాయణ సీఈఓగా నియమించాడు. దీంతో జ్యో పరిస్థితి కుడిదిలో పడ్డ ఎలుకలా మారింది.
ఈ సీరియల్స్ కూడా
{{/usCountry}}కార్తీక దీపం 2, గుండె నిండా గుడి గంటలతో పాటు ఇల్లు ఇల్లాలు పిల్లలు, ఇంటింటి రామాయణం, పొదరిల్లు సీరియల్స్ కూడా మంచి రేటింగ్ తో సాగిపోతున్నాయి. ఓవరాల్ గా టీవీ ఛానెల్స్ సీరియల్స్ రేటింగ్ లో తిరుగులేని ఆధిపత్యంతో స్టార్ మా దూసుకెళ్తోంది.