...
...
Next Story

ఐపీఎల్ కు డేంజరస్ బ్యాటర్ రసెల్ గుడ్ బై.. కేకేఆర్ ఓనర్ షారుక్ ఖాన్ ఎమోషనల్ పోస్ట్.. ఏమన్నారంటే?

విండీస్ డేంజరస్ బ్యాటర్ ఆండ్రీ రస్సెల్ ఐపీఎల్ కు గుడ్ బై చెప్పాడు. ఈ నేపథ్యంలో కోల్‌కతా నైట్ రైడర్స్ యజమాని షారుఖ్ ఖాన్ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. సోషల్ మీడియాలో ఇది వైరల్ గా మారింది.

Published on: Nov 30, 2025, 21:47:06 IST
Advertisement

2026 ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మినీ-వేలం జరగడానికి రెండు వారాల ముందు, వెస్టిండీస్ క్రికెటర్ ఆండ్రీ రసెల్ టోర్నమెంట్ కు రిటైర్మెంట్ ను ప్రకటించాడు. ఈ నేపథ్యంలో కోల్‌కతా నైట్ రైడర్స్ యజమాని, బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ ఎమోషనల్ పోస్ట్ వైరల్ గా మారింది. మెరిసే కవచంలో యోధుడు అంటూ రసెల్ ను పొగడ్తల్లో ముంచెత్తాడు షారుఖ్.

రసెల్ రిటైర్మెంట్

రసెల్, షారుక్ ఖాన్
రసెల్, షారుక్ ఖాన్

ఐపీఎల్ లో మోస్ట్ డేంజరస్ ప్లేయర్లలో ఒకడిగా మారాడు ఆండ్రీ రసెల్. విధ్వంసక బ్యాటింగ్ తో, భారీ సిక్సర్లతో ఫ్యాన్స్ ను ఎంటర్ టైన్ చేశాడు. ఇప్పుడు ఐపీఎల్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ నేపథ్యంలో కేకేఆర్ ఓనర్ షారుక్ ఖాన్ ఎమోషనల్ పోస్టు పెట్టాడు. ఆదివారం (నవంబర్ 30) నాడు ఐపీఎల్ ఆటగాడిగా రిటైర్మెంట్ అనౌన్స్ చేస్తూ సోషల్ మీడియాలో ఆండ్రీ వీడియో పోస్ట్ కు షారుక్ స్పందించాడు.

థ్యాంక్ యూ ఆండ్రీ

"అద్భుతమైన జ్ఞాపకాలకు ధన్యవాదాలు ఆండ్రీ. మా మెరిసే కవచంలో వీరుడు. కేకేఆర్ కు మీ సహకారం పుస్తకాల్లో ఒకటిగా నిలుస్తుంది" అని షారుక్ ఖాన్ రాశారు. ఈ క్రికెటర్ ఇప్పుడు జట్టులో పవర్ కోచ్ పాత్రలోకి మారుతున్నారని వివరించాడు షారుక్. "క్రీడాకారుడిగా మీ అద్భుతమైన ప్రయాణంలో మరో అధ్యాయానికి ఇదే స్వాగతం!

పవర్ కోచ్ - మా పర్పుల్ అండ్ గోల్డ్ అబ్బాయిలకు జ్ఞానాన్ని, బలాన్ని, ఖచ్చితంగా శక్తిని అందించడం? అవును. మీపై ఏ ఇతర జెర్సీ అయినా విచిత్రంగా కనిపిస్తుంది నా మిత్రమా. మజిల్ రస్సెల్ ఫర్ లైఫ్! జట్టు తరపున, క్రీడలను ప్రేమించే ప్రతి ఒక్కరి తరపు నుంచి నీపై ప్రేమ ఉంటుంది!" అని షారుక్ ముగించారు.

ఆండ్రీ వీడియో

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe