Shah Rukh Khan: బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ ఆస్తి ఒకే సంవత్సరంలో ఏకంగా రూ. 2,490 కోట్లు పడిపోయినా, ఇండియాలోనే అత్యంత సంపన్న నటుడిగా తన నంబర్ వన్ స్థానాన్ని పదిలం చేసుకున్నారు. హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2026 ప్రకారం ఆయన మొత్తం నెట్ వర్త్ రూ. 10,000 కోట్లుగా నమోదైంది. అమితాబ్ బచ్చన్, సల్మాన్ ఖాన్, హృతిక్ రోషన్ కంటే షారుఖ్ చాలా ముందంజలో నిలిచారు.
షారుఖ్ ఆస్తి రూ. 2,490 కోట్లు ఎందుకు తగ్గింది?

2025 హురున్ రిచ్ లిస్ట్‌లో షారుఖ్ నెట్ వర్త్ రూ. 12,490 కోట్లుగా ప్రకటించారు. కానీ ఈ ఏడాది వెలువడిన 2026 జాబితాలో అది రూ. 10,000 కోట్లకు పడిపోవడం ట్రేడ్ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది.
సినిమాల ద్వారా వచ్చే రెమ్యూనరేషన్‌తో పాటు ఆయన వ్యాపారాలు, ముఖ్యంగా 'రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్మెంట్', ఐపీఎల్ టీమ్ 'కోల్‌కతా నైట్ రైడర్స్' (KKR) షేర్ మార్కెట్ వ్యాల్యుయేషన్లలో మార్పుల వల్లే ఈ హెచ్చుతగ్గులు వచ్చినట్లు తెలుస్తోంది. ఇక అంతకుముందు వచ్చిన హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్‌లో షారుఖ్ ఆస్తి రూ. 10,800 కోట్లుగా అంచనా వేశారు.
హురున్ ఇండియా రిచెస్ట్ యాక్టర్స్
- షారుఖ్ ఖాన్ (రూ.10,000 కోట్లకుపైనే)
- నెట్ వర్త్ మార్పు: రూ. 2,490 కోట్లు తగ్గిన సంపద
- ప్రధాన ఆస్తులు: రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్, కోల్‌కతా నైట్ రైడర్స్ టీమ్
- అమితాబ్ బచ్చన్ (రూ.4,000 కోట్లు - గతేడాది కంటే రూ. 2370 కోట్లు పెరిగిన సంపద)
- సల్మాన్ ఖాన్ (రూ. 3 వేల కోట్లు)
- హృతిక్ రోషన్ (రూ.2500 కోట్లు)
అమితాబ్ బచ్చన్ మైండ్ బ్లోయింగ్ జంప్.. సల్మాన్, హృతిక్ నెట్ వర్త్ ఇవే
{{/usCountry}}- హృతిక్ రోషన్ (రూ.2500 కోట్లు)
అమితాబ్ బచ్చన్ మైండ్ బ్లోయింగ్ జంప్.. సల్మాన్, హృతిక్ నెట్ వర్త్ ఇవే
{{/usCountry}}ఈ రిచ్ లిస్ట్‌లో బిగ్ బీ అమితాబ్ బచ్చన్ రెండో స్థానాన్ని దక్కించుకున్నారు. ఆయన ఆస్తి రూ. 4,000 కోట్లుగా నమోదైంది. 2025లో అమితాబ్ నెట్ వర్త్ రూ. 1,630 కోట్లుగా ఉండగా, ఈ ఏడాది అనూహ్యంగా భారీ జంప్ సాధించడం విశేషం. దశాబ్దాలుగా చేస్తున్న సినిమాలు, భారీ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్స్, ఫ్యామిలీ ఆఫీస్ అసెట్స్ బిగ్ బీ ఆస్తి పెరగడానికి కారణమయ్యాయి.
బాలీవుడ్ సుల్తాన్ సల్మాన్ ఖాన్ రూ. 3,000 కోట్ల ఆస్తితో ఈ జాబితాలోకి కొత్తగా ఎంట్రీ ఇచ్చారు. మరోవైపు హ్యాండ్సమ్ హంక్ హృతిక్ రోషన్ ఆస్తి 2025లో ఉన్న రూ. 2,160 కోట్ల నుంచి రూ. 2,500 కోట్లకు పెరిగింది. అతని సొంత ఫిట్‌నెస్ బ్రాండ్ 'HRX' బిజినెస్ సక్సెస్ కూడా దీనికి ప్రధాన కారణం.
జూహీ చావ్లా, కరణ్ జోహార్ అవుట్.. ప్రొడ్యూసర్లలో అగ్రస్థానం ఎవరిది?
2025 హురున్ ఇండియా రిచ్ లిస్ట్‌లో మెరిసిన జూహీ చావ్లా, ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ ఈసారి 2026 లిస్ట్‌లో చోటు దక్కించుకోలేకపోయారు. గత ఏడాది జూహీ చావ్లా ఆస్తి రూ. 7,790 కోట్లుగా, కరణ్ జోహార్ ఆస్తి రూ. 1,880 కోట్లుగా ఉంది.
సినిమా ప్రొడక్షన్ బిజినెస్ సైడ్ చూస్తే.. 'రామాయణం' మూవీ ప్రొడ్యూసర్ నమిత్ మల్హోత్రా తండ్రి నరేష్ మల్హోత్రా ఏకంగా రూ. 16,000 కోట్ల ఆస్తితో టాప్‌లో నిలిచారు. వీరితో పాటు ప్రొడ్యూసర్లు భూషణ్ కుమార్, రోనీ స్క్రూవాలా, కళానిధి మారన్ కూడా ఈ ధనవంతుల జాబితాలో స్థానం సాధించారు.
కింగ్ తో వస్తున్న షారుఖ్ ఖాన్
ప్రస్తుతం షారుఖ్ ఖాన్ తన తదుపరి చిత్రం 'కింగ్' రిలీజ్ కోసం సిద్ధమవుతున్నారు. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో దీపికా పదుకోన్, రాణీ ముఖర్జీ, అభిషేక్ బచ్చన్, సుహానా ఖాన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఈ సినిమాను డిసెంబర్ 24, 2026న థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నారు. హాలీవుడ్ బిగ్గెస్ట్ మూవీస్ 'అవెంజర్స్: డూమ్స్‌డే', 'డ్యూన్ పార్ట్ 3' రిలీజ్ డేట్ల మధ్యలో షారుఖ్ 'కింగ్' రాబోతుండటంతో గ్లోబల్ బాక్సాఫీస్ దగ్గర గట్టి పోటీ నెలకొనడం ఖాయంగా కనిపిస్తోంది.