...
...
Next Story

అమ్మాయిల నుంచి మేసెజ్‌లు? పిల్లల తల్లికి తెలిసిపోతుంది.. కామెడీ షోలో భార్యపై స్టార్ హీరో షాహిద్ కపూర్ కామెంట్స్

బాలీవుడ్ చాక్లెట్ బాయ్ షాహిద్ కపూర్ తన రాబోయే చిత్రం ‘ఓ రోమియో’ ప్రమోషన్లలో భాగంగా కపిల్ శర్మ షోలో సందడి చేశారు. పెళ్లయ్యాక కూడా అమ్మాయిల నుంచి మెసేజ్‌లు వస్తున్నాయా? అన్న కపిల్ ప్రశ్నకు షాహిద్ కపూర్ ఇచ్చిన సమాధానం ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. భార్య మీరాపై చేసిన కామెంట్స్ వైరలు అవుతున్నాయి.

Published on: Feb 12, 2026, 10:05:36 IST
Advertisement

బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్, న్యూ నేషనల్ క్రష్ తృప్తి దిమ్రి జంటగా నటించిన రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ డ్రామా చిత్రం ‘ఓ రోమియో’ (O Romeo). ప్రముఖ దర్శకుడు విశాల్ భరద్వాజ్ తెరకెక్కించిన ఈ యాక్షన్ డ్రామా ఫిబ్రవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.

అమ్మాయిల నుంచి మేసెజ్‌లు? పిల్లల తల్లికి తెలిసిపోతుంది.. కామెడీ షోలో భార్యపై స్టార్ హీరో షాహిద్ కపూర్ కామెంట్స్
అమ్మాయిల నుంచి మేసెజ్‌లు? పిల్లల తల్లికి తెలిసిపోతుంది.. కామెడీ షోలో భార్యపై స్టార్ హీరో షాహిద్ కపూర్ కామెంట్స్

ఈ సందర్భంగా చిత్ర యూనిట్ కమెడియిన్ కపిల్ హోస్ట్‌గా చేస్తున్న ‘ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో’లో పాల్గొని సందడి చేశారు. దీనికి సంబంధించిన టీజర్‌ను నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ ఇండియా విడుదల చేయగా, అందులో షాహిద్ తనదైన శైలిలో వేసిన పంచ్‌లు హైలైట్‌గా నిలిచాయి.

“మెసేజ్‌ల సంగతి పిల్లల మమ్మీకి తెలిసిపోతుంది!”

షో మధ్యలో హోస్ట్ కపిల్ శర్మ తనదైన శైలిలో షాహిద్‌ను ఆటపట్టించారు. “పెళ్లయి ఇద్దరు పిల్లలు ఉన్నా కూడా.. వాలెంటైన్స్ డే సందర్భంగా మీకు ఇప్పటికీ అమ్మాయిల నుంచి డిఎమ్ (Direct Messages)లు వస్తుంటాయా?” అని అడిగారు.

దీనికి షాహిద్ కపూర్ ఏమాత్రం తడుముకోకుండా.. “అయ్యా కపిల్.. ఇందాకే కదా బ్యాక్‌స్టేజీలో మన పిల్లల వయస్సు గురించి చర్చించుకున్నాం” అంటూ టాపిక్ డైవర్ట్ చేసే ప్రయత్నం చేశారు.

కానీ, కపిల్ వదలకుండా.. “అయ్యో, ఆ చిన్న పిల్లలకు ఏం తెలుస్తుందిలేండి” అనగా.. వెంటనే షాహిద్ స్పందిస్తూ, “పిల్లలకు తెలియకపోవచ్చు కానీ, ఆ పిల్లల మమ్మీకి (భార్య మీరా రాజ్‌పుత్) మాత్రం అన్నీ ఇట్టే తెలిసిపోతాయి” అంటూ షాహిద్ కపూర్ నవ్వేశారు. ఈ సమాధానంతో షోలో ఒక్కసారిగా నవ్వులు విరిశాయి. తన భార్య మీరా రాజ్‌పుత్ తన గురించి ఎంత జాగ్రత్తగా ఉంటుందో షాహిద్ సరదాగా చెప్పిన తీరు అందరినీ ఆకట్టుకుంది.

ఒకరికొకరు తోడుగా.. షాహిద్-మీరా జంట

2015లో వివాహం చేసుకున్న ఈ జంటకు మిషా (2016), జైన్ (2018) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. సోషల్ మీడియాలో తరచూ తమ ఫ్యామిలీ ఫోటోలను పంచుకుంటూ అభిమానులకు ‘కపుల్ గోల్స్’ ఇస్తుంటారు షాహిద్, మీరా.

ప్రేమ, పగ నేపథ్యంలో ‘ఓ రోమియో’

షాహిద్ కపూర్ - విశాల్ భరద్వాజ్ కాంబినేషన్‌లో వస్తున్న నాలుగో చిత్రం ‘ఓ రోమియో’. షేక్‌స్పియర్ రాసిన ‘రోమియో అండ్ జూలియట్’ కథకు ఇది ఆధునిక, డార్క్ వెర్షన్ అని సమాచారం.

ముంబై అండర్ వరల్డ్ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో షాహిద్ పవర్ ఫుల్ గ్యాంగ్‌స్టర్‌గా కనిపించబోతున్నారు. నానా పటేకర్, విక్రాంత్ మాస్సే, అవినాష్ తివారీ, దిశా పటానీ, మిల్కీ బ్యూటీ తమన్నా వంటి భారీ తారాగణం ఓ రోమియో సినిమాలో ఉంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks