...
...
Next Story

Cocktail 2: ఇది అందరూ చూడగలిగే సినిమా.. ఎందుకు ‘ఎ’ సర్టిఫికెట్ ఇచ్చారో అర్థం కావడం లేదు: కాక్‌టెయిల్ 2 హీరో షాహిద్

Cocktail 2: షాహిద్ కపూర్, రష్మిక మందన్న, కృతి సనన్ లీడ్ రోల్స్ లో నటించిన కాక్‌టెయిల్ 2 మూవీ సీబీఎఫ్‌సీ ‘ఎ’ సర్టిఫికెట్ ఇవ్వడంపై వివాదం రేగుతోంది. ఇది అందరూ చూడగలిగే ముగ్గురి స్టోరీ అని షాహిద్ అన్నాడు.

Published on: Jun 19, 2026, 20:53:11 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Cocktail 2: బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్, టాలీవుడ్ నేషనల్ క్రష్ రష్మిక మందన్న, గ్లామరస్ బ్యూటీ కృతి సనన్ లీడ్ రోల్స్ పోషించిన మోస్ట్ అవేటెడ్ మోడరన్ రిలేషన్‌షిప్ డ్రామా 'కాక్‌టెయిల్ 2' (Cocktail 2). ఈ శుక్రవారం (జూన్ 19) థియేటర్లలోకి వచ్చిందీ మూవీ. 2012లో దీపికా పదుకోన్, సైఫ్ అలీ ఖాన్ కాంబినేషన్‌లో వచ్చి బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన 'కాక్‌టెయిల్' సినిమాకు ఇదొక స్పిరిచువల్ సీక్వెల్.

Cocktail 2: ఇది అందరూ చూడగలిగే సినిమా.. ఎందుకు ‘ఎ’ సర్టిఫికెట్ ఇచ్చారో అర్థం కావడం లేదు: కాక్‌టెయిల్ 2 హీరో షాహిద్
Cocktail 2: ఇది అందరూ చూడగలిగే సినిమా.. ఎందుకు ‘ఎ’ సర్టిఫికెట్ ఇచ్చారో అర్థం కావడం లేదు: కాక్‌టెయిల్ 2 హీరో షాహిద్

అయితే రిలీజ్ ముందే ఈ సినిమా ఒక ఊహించని వివాదంలో చిక్కుకుంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) ఈ చిత్రానికి 'A' (అడల్ట్) సర్టిఫికెట్ కేటాయించడం బాలీవుడ్ సర్కిల్స్‌లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సినిమాలో అంతలా అడల్ట్ కంటెంట్ ఏముందనే ప్రశ్నలపై హీరో షాహిద్ కపూర్ స్పందిస్తూ సెన్సార్ బోర్డ్ నిర్ణయాన్ని ఓపెన్‌గా తప్పుబట్టారు.

సెన్సార్ బోర్డుపై షాహిద్ కపూర్ ఆగ్రహం

కాక్‌టెయిల్ 2 సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సోషల్ మీడియాలో తన అభిమానులతో ముచ్చటించిన షాహిద్ కపూర్.. ఈ మూవీకి అడల్ట్ సర్టిఫికేట్ ఇవ్వడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

"ఈ సినిమాలో ఎలాంటి అభ్యంతరకరమైన సీన్లు లేవు. ఎవరైనా సరే తమ కుటుంబ సభ్యులతో కలిసి హాయిగా థియేటర్లలో చూడదగ్గ చిత్రమిది. మాకు అడల్ట్ సర్టిఫికేట్ ఎందుకు ఇచ్చారో నేనే తెలుసుకునే పనిలో ఉన్నాను. నాకైతే అస్సలు అర్థం కాలేదు. ఇది ముగ్గురు వ్యక్తుల మధ్య సాగే ఒక బ్యూటిఫుల్ ఎమోషనల్ జర్నీ. థియేటర్లలో సినిమా చూసి బయటకు వచ్చే ప్రతి ఒక్కరి ముఖంలో ఒక పెద్ద నవ్వు ఉంటుంది" అని షాహిద్ హిందీలో క్లారిటీ ఇచ్చారు.

లెస్బియన్ లవ్ స్టోరీ.. త్రీసమ్ రూమర్లపై కృతి, రష్మిక ఘాటు కౌంటర్

ఈ రూమర్లను మూవీ యూనిట్ తీవ్రంగా ఖండించింది. హీరోయిన్ కృతి సనన్ మాట్లాడుతూ.. "సినిమాలో ఎలాంటి లెస్బియన్ స్టోరీ లేదు" అని క్లియర్ చేయగా, రష్మిక స్పందిస్తూ.. "అవును, మా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ అంత బాగా కుదిరింది, అంతే తప్ప అక్కడ వేరే ఏమీ లేదు" అని నవ్వేసింది. కృతి సనన్ మరోసారి స్పందిస్తూ.. "మేము ముగ్గురం నార్మల్ వ్యక్తులం గైస్. మా ముగ్గురి మధ్య సాగేది కేవలం ఒక ఎమోషనల్ త్రీసమ్ మాత్రమే, శారీరకమైనది అస్సలు కాదు" అని రూమర్లకు గట్టి కౌంటర్ ఇచ్చింది.

కాక్‌టెయిల్ 2 మూవీ కథేంటి?

దర్శకుడు హోమి అదజానియా గతంలో ట్రైలర్ లాంచ్ సమయంలో మాట్లాడుతూ.. సినిమాలో కృతి, రష్మిక ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ లాగా చాలా క్లోజ్‌గా ఉంటారని, ఒకవేళ వాళ్లిద్దరి మధ్య మన హీరో షాహిద్ కపూర్ మూడో వ్యక్తిలాగా ఎంటర్ అయితే ఎలా ఉంటుంది అనే ఒక క్రేజీ ఊహాజనితమైన ఆలోచనతో ఈ కథను రాసుకున్నట్లు చెప్పారు.

లవ్ రంజన్, తరుణ్ జైన్ అందించిన ఈ కథలో కునాల్ (షాహిద్), దియా (రష్మిక) లాంగ్ టర్మ్ రిలేషన్‌షిప్‌లో ఉండే కపుల్. అయితే వారి జీవితంలోకి అల్లీ (కృతి సనన్) అనే థర్డ్ పర్సన్ ఎంటర్ అయినప్పుడు ఆ బంధం ఎలాంటి ఒడిదుడుకులను ఎదుర్కొంది.. నేటితరం యువత ప్రేమలో ఎలాంటి కన్ఫ్యూజన్‌కు లోనవుతున్నారు అనే పాయింట్‌ను వినోదాత్మకంగా చూపించారు. ఈ శుక్రవారం విడుదలైన ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ రివ్యూలు వస్తున్నాయి. మరి ఈ సెన్సార్ వివాదాలు, రూమర్లను దాటుకుని రష్మిక మందన్న బాలీవుడ్‌లో మరో భారీ హిట్ కొడుతుందో లేదో చూడాలి.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks