Bigg Boss Buzz Shalini: బిగ్ బాస్ తెలుగు 10వ సీజన్ లో శాలిని జర్నీనే డిఫరెంట్ గా సాగింది. అగ్ని పరీక్ష నుంచి బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన శాలిని ఏడో వారంలో ఎలిమినేట్ అయింది. ఆరో వారం వీకెండ్ లోనే ఎవిక్ట్ అయి, సీక్రెట్ రూమ్ లోకి వెళ్లింది శాలిని. తిరిగి హౌస్ లోకి అడుగుపెట్టింది.
బిగ్ బాస్ శాలిని ఎలిమినేట్

బిగ్ బాస్ తెలుగు 10 నుంచి శాలిని ఎలిమినేట్ అయింది. సీక్రెట్ రూమ్ నుంచి తిరిగి హౌస్ లోకి వచ్చినా శాలిని గేమ్ మాత్రం మారలేదు. ఎంతసేపు రోహిత్ చుట్టూ తిరగడం, ఇతర కంటెస్టెంట్లపై అరవడం తప్పా శాలిని చేసిందేమీ లేదనే ట్రోల్స్ వస్తున్నాయి. దీంతో శాలిని బిగ్ బాస్ హౌస్ నుంచి ఎగ్జిట్ అవక తప్పలేదు.
బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూ
బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన శాలినిని బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూలో హోస్ట్ శివాజీ సంచలన ప్రశ్నలతో ఆటాడుకున్నాడు. డెవిల్ శాలిని అంటూ పిలిచిన శివాజీ.. ఆమెను దిమ్మతిరిగే ప్రశ్నలు అడిగాడు. ఎదుటివాళ్లు మాట్లాడేటప్పుడు శాలిని ఎలా అరుస్తుందో అలాగే శివాజీ గట్టిగా అరిచాడు. హౌస్ లో ఎఫ్, ఎమ్, డీ వర్డ్స్ వాడటంపైనా శాలినిని ప్రశ్నించాడు.
సీక్రెట్ రూమ్
బిగ్ బాస్ హౌస్ లోకి సీక్రెట్ రూమ్ నుంచి వచ్చిన తర్వాత శాలిని ఎలిమినేట్ అయింది. అయితే బిగ్ బాస్ హిస్టరీ చూస్తే సీక్రెట్ రూమ్ నుంచి వచ్చిన కంటెస్టెంట్లలో ఒకరు విన్నర్ అయ్యారు, మరొకరు రన్నరప్ అయ్యారు అని రాహుల్ సిప్లిగంజ్, అఖిల్ గురించి శివాజీ చెప్పాడు. హౌస్ లో నిద్రపోయే టైమ్ మినహా మిగతా సమయమంతా రోహిత్ తోనే ఉన్నావని శాలినితో శివాజీ అన్నాడు.
ఏడ్చేసిన శాలిని
బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూలో భాగంగా శివాజీతో మాట్లాడుతూ శాలిని ఏడ్చేసింది. ‘‘గేమ్ ముందే మార్చాల్సిందే. ఇక్కడిదాకా తెచ్చుకున్నా’’ అని చెప్తూ శాలిని కన్నీళ్లు పెట్టుకుంది. ఆ సమయంలో శాలినిని చూసి శివాజీ షాక్ అయ్యాడు.
{{/usCountry}}బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూలో భాగంగా శివాజీతో మాట్లాడుతూ శాలిని ఏడ్చేసింది. ‘‘గేమ్ ముందే మార్చాల్సిందే. ఇక్కడిదాకా తెచ్చుకున్నా’’ అని చెప్తూ శాలిని కన్నీళ్లు పెట్టుకుంది. ఆ సమయంలో శాలినిని చూసి శివాజీ షాక్ అయ్యాడు.
{{/usCountry}}బిగ్ బాస్ తెలుగు 10వ సీజన్ నుంచి ఏడో వారంలో ఇద్దరు కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయ్యారు. దక్షి, శాలిని హౌస్ నుంచి ఎగ్జిట్ అయ్యారు. వైల్డ్ కార్డు ఎంట్రీగా వచ్చిన దక్షి రెండు వారాల్లోనే ఎలిమినేట్ అయింది. శాలిని ఏమో ఏడు వారాలు ఉంది. ఇక బిగ్ బాస్ హౌస్ లో మరోసారి 8వ వారంలో నామినేషన్ హీట్ మొదలు కానుంది.