...
...
Next Story

Sharwanand: నువ్వు హీరో ఏంట్రా అన్నారు.. 36వ సినిమా చేస్తున్నా.. గర్వంతో చెప్పడం లేదు.. ఆ ముగ్గురినీ మరవద్దు: శర్వానంద్

Sharwanand: శర్వానంద్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. నువ్వు హీరో ఏంట్రా అని ఒకప్పుడు అన్నారని, కానీ ఇప్పుడు హీరోగా 36వ సినిమా చేస్తున్నా అని అతడు అన్నాడు. తన బైకర్ మూవీ ప్రమోషన్లలో భాగంగా ఒక కాలేజీలో స్టూడెంట్స్ తో అతడు మాట్లాడాడు.

Published on: Mar 28, 2026, 08:29:09 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Sharwanand: మన సక్సెస్‌తోనే విమర్శకులకు సమాధానం చెప్పాలి అని శర్వానంద్ తన సక్సెస్‌ఫుల్ సినిమా కెరీర్ ద్వారా నిరూపించాడు. తన 36వ సినిమా 'బైకర్' ప్రమోషన్స్‌లో భాగంగా రీసెంట్‌గా మదనపల్లిలోని మిట్స్ కాలేజ్ స్టూడెంట్స్‌తో ఇంటరాక్ట్ అయినప్పుడు శర్వానంద్ ఎమోషనల్ కామెంట్స్ చేశాడు. ఇండస్ట్రీలో 23 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా తన జర్నీలో ఎదురైన కష్టాలను, అవమానాలను అతను చాలా ఓపెన్‌గా అందరితో పంచుకున్నాడు.

ఆరోజు అలా అవమానించారు..

Sharwanand: నువ్వు హీరో ఏంట్రా అన్నారు.. 36వ సినిమా చేస్తున్నా.. గర్వంతో చెప్పడం లేదు.. ఆ ముగ్గురినీ మరవద్దు: శర్వానంద్
Sharwanand: నువ్వు హీరో ఏంట్రా అన్నారు.. 36వ సినిమా చేస్తున్నా.. గర్వంతో చెప్పడం లేదు.. ఆ ముగ్గురినీ మరవద్దు: శర్వానంద్

శర్వానంద్ తన స్పీచ్‌లో మాట్లాడుతూ.. "నేను చదువులో బిలో యావరేజ్ స్టూడెంట్‌ని. నన్ను చూసి అందరూ నువ్వొక వేస్ట్ ఫెలో, దేనికీ పనికిరావు అని తిట్టేవాళ్లు. సరిగ్గా 17 ఏళ్ల వయసులో నేను హీరో అవుతాను అని చెప్పినప్పుడు ఎవరూ నమ్మలేదు. నువ్వు హీరో ఏంట్రా.. ఇండస్ట్రీలో అస్సలు నిలదొక్కుకోలేవు.. నీకు అంత సీన్ లేదు అని మొహం మీదే చాలా దారుణంగా అవమానించారు" అని తన గతాన్ని గుర్తుచేసుకున్నాడు.

కానీ ఆ మాటలు తనను డిప్రెషన్‌లోకి నెట్టలేదని, తనలో కసిని పెంచాయని శర్వా చెప్పాడు. ఎవరెన్ని అన్నా సరే, తనపై తను నమ్మకం పెట్టుకుని, కష్టపడి ఈరోజు టాలీవుడ్‌లో తనకంటూ ఒక స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు.

లైఫ్ అనేది సినిమాలాంటిది కాదు..

స్టూడెంట్స్‌కు మోటివేషన్ ఇస్తూ శర్వానంద్ కొన్ని అదిరిపోయే మాటలు చెప్పాడు. "లైఫ్ అనేది ఒక సినిమా లాంటిది అస్సలు కాదు. మన జీవితంలో మనం సక్సెస్ అవుతున్నప్పుడు వెనకాల ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ రాదు.. కానీ కష్టాలు వచ్చినప్పుడు మాత్రం ఫుల్ సౌండ్‌తో వస్తాయి" అని అనడం విశేషం.

ఇక ఎవరైనా సరే తమ జీవితంలో ముగ్గురు వ్యక్తులను మరవొద్దని శర్వానంద్ చెప్పాడు. ఒకరు మనం కష్టాల్లో ఉన్నప్పుడు అండగా నిలబడిన వాళ్లని, మరొకరు మనల్ని కష్టాల్లో వదిలేసి వెళ్లిన వారని, ఇంకొకరు మనల్ని కష్టాల్లోకి నెట్టిన వాళ్లని.. ఈ ముగ్గురినీ ఎప్పుడూ మరచిపోవద్దని ఈ సందర్భంగా శర్వా స్పష్టం చేశాడు.

'బైకర్'తో వస్తున్న శర్వా..

ఈ ఏడాది సంక్రాంతికి నారీ నారీ నడుమ మురారి మూవీతో చాలా కాలం తర్వాత ఓ పెద్ద హిట్ కొట్టాడు శర్వానంద్. ఇక ఇప్పుడు బైకర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇదో స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా. ఇది ఇండియాలోనే ఫస్ట్ మోటోక్రాస్ ఫిల్మ్ కావడం విశేషం. ఈ సినిమాలో అతను 18 ఏళ్ల కుర్రాడిగా, 30 ఏళ్ల మెచ్యూర్డ్ పర్సన్‌గా రెండు డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్న క్యారెక్టర్స్ చేశాడు.

ఏప్రిల్ 3న థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమా కోసం శర్వా ఏకంగా 22 కిలోల బరువు తగ్గి, ఎన్నో ప్రమాదాలు ఎదురైనా వెనక్కి తగ్గకుండా ప్రాణాలు పణంగా పెట్టి యాక్షన్ సీక్వెన్స్ చేశాడు. అభిలాష్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో రాజశేఖర్, మాళవిక నాయర్ లాంటి టాలెంటెడ్ యాక్టర్స్ కూడా నటిస్తున్నారు. తన కెరీర్‌కు ఇదొక టర్నింగ్ పాయింట్ లాంటి సినిమా అని అతను ఫుల్ కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe