...
...
Next Story

Sharwanand: నర్సన్న నన్ను కూడా సీఎంను చేస్తారా? విజ‌య్‌లాగా అయిపోతానేమో.. నల్గొండ గద్దర్‌తో శ‌ర్వానంద్‌

Sharwanand: ఈ ఏడాది మంచి ఫామ్ లో ఉన్న శర్వానంద్ ‘భోగి’ మూవీతో ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు రాబోతున్నాడు. 2026లో రిలీజ్ అవుతున్న శర్వానంద్ మూడో సినిమా ఇదే. జోష్ లో ఉన్న అతను.. తాజాగా భోగి ప్రమోషనల్ ఈవెంట్లో నల్గొండ గద్దర్ నర్సన్నతో చెప్పిన మాటలు వైరల్ గా మారాాయి.

Published on: Nov 25, 2026, 11:42:13 IST
Advertisement

Sharwanand: 2026లో టాలీవుడ్ హీరో శర్వానంద్ మాములు ఫామ్ లో లేడు. నారీ నారీ నడుమ మురారి సినిమాతో సంక్రాంతికి హిట్ కొట్టి సక్సెస్ బాట పట్టాడు. ఆ తర్వాత బైకర్ అంటూ బాక్సాఫీస్ దగ్గర మరోసారి సత్తాచాటాడు. ఇప్పుడు భోగి సినిమాతో థియేటర్లలో ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేయడానికి రాబోతున్నాడు.

భోగి మ్యూజికల్ నైట్

నర్సన్న నన్ను కూడా సీఎంను చేస్తారా? విజ‌య్‌లాగా అయిపోతానేమో.. నల్గొండ గద్దర్‌తో శ‌ర్వానంద్‌
నర్సన్న నన్ను కూడా సీఎంను చేస్తారా? విజ‌య్‌లాగా అయిపోతానేమో.. నల్గొండ గద్దర్‌తో శ‌ర్వానంద్‌

శర్వానంద్ హీరోగా వస్తున్న అప్ కమింగ్ మూవీ ‘భోగి’ రిలీజ్ టైమ్ దగ్గర పడుతోంది. నవంబర్ 27న ఈ రా అండ్ రస్టిక్ డ్రామా థియేటర్లకు రాబోతుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ స్పీడ్ పెంచింది మూవీ టీమ్. తాజాగా భోగి మ్యూజికల్ నైట్ నిర్వహించారు. ‘గంగా’ అనే సాంగ్ ను రిలీజ్ చేశారు. ఈ ఈవెంట్లో శర్వానంద్ ఫుల్ ఎనర్జీతో కనిపించాడు.

సీఎంను చేస్తారా?

మ్యూజికల్ నైట్ ఈవెంట్లో సింగర్ నల్గొండ గద్దర్ నర్సన్నతో శర్వానంద్ ఫన్ మూమెంట్ వైరల్ గా మారింది. ఈ సినిమాలో పాటల గురించి చెప్తూ.. ‘‘నర్సన్న మీరు చాలా మందిని సీఎంలను చేశారంటా. నన్ను కూడా చేస్తారా ఏంటీ? ఇప్పుడు నా సినిమాకు పాట పాడారు. ఏమో విజయ్ లాగా సీఎం అయిపోతానేమో’’ అని నర్సన్నతో శర్వానంద్ అనడం వైరల్ గా మారింది. ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

దేవుడు అనుకుంటే

శర్వానంద్ కామెంట్లకు నర్సన్న వెంటనే సమాధానమిచ్చాడు. ‘‘ఏమో అన్న దేవుడు అనుకుంటే రాబోయే రోజుల్లో అయిపోతారేమో’’ అని నర్సన్న వెంటనే అన్నాడు. నటుడిగా ఎంటర్ టైన్ చేయడం చాలని శర్వానంద్ చెప్పాడు. భోగి సినిమాలో అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయాతి ఫీమేల్ లీడ్ రోల్స్ ప్లే చేస్తున్నారు.

సూపర్ హిట్ పాటలు

ఇక భక్తి పాటలు పాడటంలోనూ నర్సన్స స్లైల్ వేరు. ‘ఎండి కొండల వాడ’, ‘ఓ నా రామయ్య’ సాంగ్స్ యూట్యూబ్ ను షేక్ చేస్తూనే ఉన్నాయి. ఇప్పుడు భోగి మూవీలో గంగాతో పాటు ఎగిలి వారంగా సాంగ్స్ పాడాడు. ఇక సినిమా పాటలతో కూడా నర్సన్న బిజీగా మారేలా కనిపిస్తున్నాడు.

Featured Video

 

ABOUT THE AUTHOR

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks