...
...
Next Story

Shiva Rajkumar: క్యాన్సర్ కారణంగా పెద్ది సినిమాను వదిలేద్దామనుకున్నా, కానీ.. ఊహించని నిజం చెప్పిన శివ రాజ్‌కుమార్

Shiva Rajkumar Almost Quit Ram Charan Peddi For Cancer: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు సాన కాంబినేషన్‌లో వస్తున్న పెద్ది జూన్ 4న విడుదల కానుంది. ఈ సినిమా చెన్నై ప్రమోషన్స్ వేదికగా కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్ తనకు క్యాన్సర్ సోకిన సమయంలో జరిగిన షాకింగ్ విషయాలను పంచుకున్నారు.

Published on: May 31, 2026, 20:00:42 IST
Advertisement

Shiva Rajkumar Almost Quit Ram Charan Peddi For Cancer: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, 'ఉప్పెన' చిత్రంతో సంచలన విజయం అందుకున్న దర్శకుడు బుచ్చిబాబు సాన కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న హై-వోల్టేజ్ పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామా సినిమా 'పెద్ది'. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది.

ఊహించని నిజాన్ని

క్యాన్సర్ కారణంగా పెద్ది సినిమాను వదిలేద్దామనుకున్నా, కానీ.. ఊహించని నిజం చెప్పిన శివ రాజ్‌కుమార్ (PTI)
క్యాన్సర్ కారణంగా పెద్ది సినిమాను వదిలేద్దామనుకున్నా, కానీ.. ఊహించని నిజం చెప్పిన శివ రాజ్‌కుమార్ (PTI)

ఈ నేపథ్యంలో చెన్నైలో నిర్వహించిన పెద్ది ప్రమోషన్స్ వేదికగా కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్ (Shivanna) ఒక ఊహించని నిజాన్ని బయటపెట్టారు. తనకు క్యాన్సర్ మహమ్మారి సోకిన సమయంలో ఈ సినిమా నుంచి దాదాపు తప్పుకోవాలని అనుకున్నట్లు ఆయన ఎమోషనల్ అయ్యారు.

"వద్దనుకున్నా.. కానీ.."

చెన్నై ఈవెంట్‌లో శివ రాజ్‌కుమార్ మాట్లాడుతూ .. 'పెద్ది' చిత్ర బృందం చూపించిన ఓపికకు, ఇచ్చిన గౌరవానికి కృతజ్ఞతలు తెలిపారు. 2024లో తనకు క్యాన్సర్ అని తేలక ముందే బుచ్చిబాబు ఈ కథను చెప్పారని ఆయన గుర్తుచేసుకున్నారు.

"పెద్ది కథ వినగానే నాకు బాగా నచ్చింది, ఆ రోజే రామ్ చరణ్‌తో కూడా మాట్లాడాను. అయితే దురదృష్టవశాత్తూ ఆ తర్వాతే నాకు క్యాన్సర్ అని నిర్ధారణ అయింది. వైద్యం కోసం అమెరికా వెళ్లాల్సి వచ్చింది" అని శివన్న వివరించారు.

ఆలస్యం అవుతుందని భావించి

క్యాన్సర్ చికిత్స వల్ల సినిమా ఆలస్యం అవుతుందని భావించి ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటానని చిత్ర యూనిట్‌కు చెప్పినట్లు శివ రాజ్‌కుమార్ పేర్కొన్నారు. "నా వల్ల సినిమా లేట్ కాకూడదు, క్యాన్సిల్ చేసుకుందాం అని నేను అన్నాను. కానీ, డైరెక్టర్ బుచ్చిబాబు మాత్రం.. లేదు సార్, మాకు మీరే కావాలి, ఎంతకాలమైనా ఎదురుచూస్తాం అని చెప్పారు. వారు నా కోసం చాలా కాలం వేచి చూశారు. ఈ ప్రయాణం చాలా అద్భుతమైనది. చరణ్, బుచ్చిబాబులకు నా ధన్యవాదాలు" అని శివ రాజ్‌కుమార్ ఎమోషనల్‌గా చెప్పారు.

శివన్న స్క్రీన్ పైకి వస్తే పూనకాలే: రామ్ చరణ్

"శివన్న స్క్రీన్ పైకి వస్తే ఒక ఫైర్ పుడుతుంది. కేవలం ఆయన క్యారెక్టర్ కోసమే నేను జైలర్ సినిమాను ఎన్నోసార్లు చూశాను. విలన్లను చంపి కారులో వెళ్లేటప్పుడు, సిగరెట్ తాగే ఆ స్లో-మోషన్ షాట్ ఒక ఐకానిక్ పర్ఫార్మెన్స్. ఆయన కళ్లలోనే అద్భుతమైన ఎక్స్‌ప్రెషన్స్ ఉంటాయి" అని రామ్ చరణ్ కొనియాడారు.

ప్రాణాంతక వ్యాధిపై అలుపెరగని పోరాటం

కన్నడ చిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న శివ రాజ్‌కుమార్ 2024 డిసెంబర్‌లో అమెరికాలోని మయామి ఆసుపత్రిలో చేరారు. అక్కడ వైద్యులు ఆయనకు సోకిన క్యాన్సర్ గడ్డను (క్యాన్సరస్ బ్లాడర్) తొలగించి, పేగుల సహాయంతో కృత్రిమ మూత్రాశయాన్ని ఏర్పాటు చేశారు.

ఈ కష్టకాలంలో తన కుటుంబం, అభిమానులు, డాక్టర్లు ఇచ్చిన ధైర్యంతోనే ఈ మహమ్మారిపై విజయం సాధించానని శివన్న గతంలో తెలిపారు. కీమోథెరపీ తీసుకుంటూనే కన్నడ చిత్రం '45' షూటింగ్‌లో పాల్గొన్నానని, ఆ సమయంలో తీవ్ర అలసట వచ్చినా ఓర్చుకుని క్లైమాక్స్ పూర్తి చేశానని ఆయన గుర్తుచేసుకున్నారు.

మహమ్మారిని జయించిన తర్వాత

క్యాన్సర్ మహమ్మారిని జయించిన తర్వాత శివన్న నటిస్తున్న మొదటి భారీ చిత్రం 'పెద్ది' కావడం విశేషం. ఈ సినిమా తర్వాత ఆయన రజనీకాంత్‌తో కలిసి 'జైలర్ 2'లో కూడా అలరించనున్నారు.

ఇక జూన్ 4న థియేటర్లలో విడుదల కానున్న 'పెద్ది' బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks