Giri Babu: గిరిబాబు అంటే ఆయన స్క్రీన్ నేమ్ మాత్రమే. ఆయన అసలు పేరు యర్రా శేషగిరిరావు. 1943 జూన్ 8న ప్రకాశం జిల్లాలోని రావినూతల అనే గ్రామంలో ఒక సాధారణ మధ్యతరగతి వ్యవసాయ కుటుంబంలో ఆయన జన్మించారు. సినిమాల మీద ఉన్న మక్కువతో మద్రాసు రైలు ఎక్కిన ఆయన తన పేరును గిరిబాబుగా మార్చుకుని ఇండస్ట్రీలో స్థిరపడిపోయారు.
విలన్ గా ఫేమస్

చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే.. గిరిబాబు ఇండస్ట్రీకి వచ్చింది విలన్ గానో, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానో కాదు. హీరో కావాలనే కోరికతో! 1973లో వచ్చిన 'జగమే మాయ' సినిమాతో ఆయన విలన్ గా పరిచయం అయ్యారు. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో హీరోగా చేశారు. కానీ ఆయన గంభీరమైన కంఠం, విలక్షణమైన బాడీ లాంగ్వేజ్ చూసిన దర్శక నిర్మాతలు ఆయనకు నెగెటివ్ రోల్స్ ఎక్కువగా ఆఫర్ చేశారు. 'కురుక్షేత్రం' సినిమాలో ఆయన పోషించిన దుశ్శాసనుడి పాత్ర ఆయన కెరీర్ ను మలుపు తిప్పింది.
మోహన్ బాబుతో రూ.40 అద్దె గదిలో..
చెన్నైలో అవకాశాల కోసం తిరుగుతున్న రోజుల్లో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, గిరిబాబు ఇద్దరూ ప్రాణమిత్రులు. ఇద్దరూ కలిసి చెరో రూ.20 వేసుకుని ఒక చిన్న రూమ్ లో (నెలకు రూ.40 అద్దె) ఉండేవారు. ఇద్దరూ కలిసి ఎన్నో ఆడిషన్స్ కు వెళ్లేవారు. ఆ కష్టాల నుంచే ఇద్దరూ టాలీవుడ్ లో దిగ్గజ నటులుగా ఎదిగారు. గిరిబాబు మరణవార్త విని మోహన్ బాబు కన్నీరుమున్నీరు కావడం వారి సుదీర్ఘ స్నేహానికి అద్దం పడుతుంది.
కేవలం నటుడే కాదు
గిరిబాబు కేవలం నటనకే పరిమితం కాలేదు. ఆయనలో మంచి నిర్మాత, దర్శకుడు కూడా ఉన్నారు. 'రణరంగం', 'ఇంద్రజిత్', 'నీ సుఖమే నే కోరుకున్నా' వంటి చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. అలాగే 'దేవతలారా దీవించండి', 'సింహగర్జన', 'మెరుపు దాడి' వంటి భారీ చిత్రాలను నిర్మించి తన బహుముఖ ప్రజ్ఞను చాటుకున్నారు.
నవ్వించే విలన్
{{/usCountry}}గిరిబాబు కేవలం నటనకే పరిమితం కాలేదు. ఆయనలో మంచి నిర్మాత, దర్శకుడు కూడా ఉన్నారు. 'రణరంగం', 'ఇంద్రజిత్', 'నీ సుఖమే నే కోరుకున్నా' వంటి చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. అలాగే 'దేవతలారా దీవించండి', 'సింహగర్జన', 'మెరుపు దాడి' వంటి భారీ చిత్రాలను నిర్మించి తన బహుముఖ ప్రజ్ఞను చాటుకున్నారు.
నవ్వించే విలన్
{{/usCountry}}విలన్ గా క్రూరమైన పాత్రలు చేస్తూనే.. తనలోని కామెడీ యాంగిల్ ను కూడా బయటకు తీశారు గిరిబాబు. కమెడియన్ గా ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి కడుపుబ్బా నవ్వించారు. ఆయన వారసత్వాన్ని అందిపుచ్చుకున్న ఆయన కుమారుడు రఘుబాబు నేడు టాలీవుడ్ లో టాప్ కమెడియన్ గా కొనసాగుతున్నారు. గిరిబాబు భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన పోషించిన పాత్రలు ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతాయనడంలో సందేహం లేదు.