బెంగళూరులో షాకింగ్ ఇన్సిడెంట్ జరిగింది. ఓ కన్నడ నటి దారుణమైన అనుభవాన్ని ఎదుర్కొంది. ఇటీవల ఇక్కడ సెలబ్రిటీ మహిళా క్రికెట్ టోర్నమెంట్ జరిగింది. ఈ సందర్భంగా ఓ నటి బాత్రూమ్ వెళ్లగా ఆమె వీడియోలను సీక్రెట్ గా రికార్డు చేశారు. ఆ తర్వాత సోషల్ మీడియా ద్వారా పంపి బెదిరిస్తున్నారు. దీనిపై పోలీసు కేసు నమోదైంది.
ఏం జరిగిందంటే?

రీసెంట్ గా బెంగళూరులోని స్టేడియంలో సెలబ్రిటీ వుమెన్ క్రికెట్ టోర్నీ జరిగింది. కొరమంగళ ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన ఈ మూడు రోజుల ఈవెంట్‌కు ఓ కన్నడ నటి అటెండ్ అయింది. ఈవెంట్ రెండో రోజు (ఫిబ్రవరి 7న) ఆమె స్టేడియంలో ఉన్న ఓ బాత్రూమ్ లోకి వెళ్లింది. ఆమె బాత్రూమ్ లో ఉన్నప్పుడు ఓ వ్యక్తి సీక్రెట్ గా వీడియో రికార్డు చేశాడు.
ఫ్రెండ్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాకు
కన్నడ నటి బాత్రూమ్ లో ఉండగా ఓ అజ్ఞాత వ్యక్తి వీడియో తీయడం కలకలం రేపుతోంది. అశ్లీలతతో కూడిన ఆ అసభ్యరమైన వీడియోను ఆ నటి ఫ్రెండ్ ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ కు ఆ వ్యక్తి పంపించాడు. ఆ ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ఆ నటిదే అని భావించి ఆ దుండగుడు వీడియో పంపించాడు. ఆ వీడియో చూసిన ఆ నటి, ఆమె ఫ్రెండ్ షాక్ అయ్యారు.
బ్లాక్ మెయిల్
ఆ వీడియో పంపించిన వ్యక్తి డబ్బుల కోసం కూడా డిమాండ్ చేశాడు. దీనిపై నటి పోలీసులకు ఫిర్యాదు చేసింది. 'వీడియోలోని కంటెంట్ అశ్లీలంగా ఉంది. వీడియోను అప్‌లోడ్ చేసిన తర్వాత ఆ అజ్ఞాత వ్యక్తులు మరిన్ని వ్యక్తిగత వీడియోలను పంపుతామని, వీడియో కాల్స్ చేస్తామని బెదిరించారు. డబ్బు అడిగారు. బ్లాక్ మెయిల్ చేశారు’’ అని ఆ కన్నడ నటి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
నిందితుల కోసం గాలింపు
డబ్బులు ఇవ్వకపోతే ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తామని బెదిరించారని ఆ నటి ఫిర్యాదులో పేర్కొంది. పెన్ డ్రైవ్లో ఫిర్యాదుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను పోలీసులకు సమర్పించింది. సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో IT చట్టంలోని సంబంధిత సెక్షన్లు 77, 351, 308 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుల కోసం గాలిస్తున్నారు.
{{/usCountry}}డబ్బులు ఇవ్వకపోతే ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తామని బెదిరించారని ఆ నటి ఫిర్యాదులో పేర్కొంది. పెన్ డ్రైవ్లో ఫిర్యాదుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను పోలీసులకు సమర్పించింది. సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో IT చట్టంలోని సంబంధిత సెక్షన్లు 77, 351, 308 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుల కోసం గాలిస్తున్నారు.
{{/usCountry}}నటి బాత్రూమ్ వీడియోల విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆ నిందితులను కఠినంగా శిక్షించాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.