Drugs Case: డ్రగ్స్ కేసు నుంచి హీరోయిన్ల పేరు తొలగింపు- శ్రద్ధా కపూర్, నోరా ఫతేహితోపాటు మరో ముగ్గురికి క్లీన్ చిట్!

Shraddha Kapoor Nora Fatehi Clean Chit Drugs Case: 2022 ముంబై డ్రగ్స్ సరఫరా కేసులో బాలీవుడ్ భామలు శ్రద్ధా కపూర్, నోరా ఫతేహిలకు భారీ ఊరట లభించింది. తగిన ఆధారాలు లేకపోవడంతో వీరి పేర్లను ఛార్జ్‌షీట్ నుంచి తొలగించాలని యాంటీ నార్కోటిక్స్ సెల్ నిర్ణయించింది. వీరితోపాటు మరో ముగ్గురికి క్లీన్ చిట్ ఇచ్చారు.

Published on: Apr 25, 2026, 16:17:25 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Shraddha Kapoor Nora Fatehi Out From Drugs Case: బాలీవుడ్‌ను ఒకప్పుడు కుదిపేసిన 2022 మెఫెడ్రోన్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న హీరోయిన్స్ శ్రద్ధా కపూర్, నోరా ఫతేహిలతో పాటు శ్రద్ధా సోదరుడు సిద్ధాంత్ కపూర్, సోషల్ మీడియా స్టార్ ఓరీ (Orry), రాజకీయ నాయకుడు జీషాన్ సిద్ధిఖీలకు క్లీన్ చిట్ లభించింది.

డ్రగ్స్ కేసు నుంచి హీరోయిన్ల పేరు తొలగింపు- శ్రద్ధా కపూర్, నోరా ఫతేహితోపాటు మరో ముగ్గురికి క్లీన్ చిట్!
డ్రగ్స్ కేసు నుంచి హీరోయిన్ల పేరు తొలగింపు- శ్రద్ధా కపూర్, నోరా ఫతేహితోపాటు మరో ముగ్గురికి క్లీన్ చిట్!

తగిన సాక్ష్యాలు లేని కారణంగానే

ముంబై పోలీసుల యాంటీ నార్కోటిక్స్ సెల్ (ANC) దాఖలు చేయనున్న అనుబంధ ఛార్జ్‌షీట్ నుంచి వీరి పేర్లను తొలగించనున్నారు. శ్రద్ధా కపూర్, నోరా, ఓరి, సిద్ధాంత్, జీషాన్ డ్రగ్స్ తీసుకున్నట్లు తగిన సాక్ష్యాలు లేని కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారిక వర్గాల సమాచారం.

అసలేం జరిగింది? ఆరోపణల వెనుక కథ ఇదీ!

ఈ కేసు మూలాలు 2022 నాటి డ్రగ్స్ దందాలో ఉన్నాయి. ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు మహ్మద్ సలీం అలియాస్ సుహైల్ షేక్ అనే డ్రగ్ పెడ్లర్‌ను అరెస్ట్ చేసినప్పుడు ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ముంబై, దుబాయ్‌లలో నిర్వహించే రేవ్ పార్టీలకు తాను డ్రగ్స్ సరఫరా చేసేవాడినని, ఆ పార్టీలకు పలువురు సెలబ్రిటీలు హాజరయ్యేవారని సలీం పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాడు.

నిరూపించే బలమైన ఆధారాలు

ఆ సమయంలోనే శ్రద్ధా కపూర్, నోరా ఫతేహి, అబ్బాస్-మస్తాన్ కుమారులు, జీషాన్ సిద్ధిఖీ వంటి పేర్లను నిందితుడు ప్రస్తావించాడు. దీంతో 2025లో వీరిని ఏఎన్సీ అధికారులు సుదీర్ఘంగా విచారించారు. అయితే, నిందితుడు కేవలం పేర్లు చెప్పడమే తప్ప, ఈ సెలబ్రిటీలకు డ్రగ్స్ దందాతో ప్రత్యక్ష సంబంధం ఉందని నిరూపించే బలమైన ఆధారాలు పోలీసులకు దొరకలేదు.

"అంతా అసూయతో చేసిన పని" - ఓరీ ఆగ్రహం

ఈ వార్త బయటకు రాగానే సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ ఓరీ తనదైన శైలిలో స్పందించారు. ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఈ వార్తా కథనాన్ని షేర్ చేస్తూ.. "నా పేరును వారాల తరబడి అనవసరంగా వివాదాల్లోకి లాగి, సంచలనం కోసం పాకులాడిన ఆ అసూయపరులు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు?" అంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కేవలం క్లిక్ బైట్ కోసమే సెలబ్రిటీల ప్రతిష్ఠను దిగజార్చారని ఆయన మండిపడ్డారు.

పోలీసుల తదుపరి కార్యాచరణ

ప్రస్తుతం ఈ విచారణ పూర్తి కావడంతో, పోలీసులు త్వరలోనే కోర్టులో ఫైనల్ రిపోర్ట్ సమర్పించనున్నారు. ఇప్పటికే ముగ్గురు నిందితులపై ప్రాథమిక ఛార్జ్‌షీట్ దాఖలు కాగా, ఇప్పుడు మరికొందరు అరెస్ట్ అయిన వారిపై, పరారీలో ఉన్న వారిపై అనుబంధ ఛార్జ్‌షీట్ వేస్తారు. సెలబ్రిటీలను ఈ కేసుతో ముడిపెట్టే లింకులు దొరకకపోవడంతో, వారిని ఈ చిక్కుల నుంచి తప్పిస్తూ పోలీసులు నిర్ణయం తీసుకున్నారు.

అభిమానులకు పెద్ద ఊరట

బాలీవుడ్‌లో డ్రగ్స్ కలకలం రేగిన ప్రతిసారీ సెలబ్రిటీల పేర్లు తెరపైకి రావడం, చివరకు విచారణలో అవి వీగిపోవడం పరిపాటిగా మారింది. ఈ తాజా పరిణామం శ్రద్ధా కపూర్, నోరా ఫతేహి అభిమానులకు పెద్ద ఊరటనిచ్చింది.

క్లీన్ చిట్ పొందిన ఓరీ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ
క్లీన్ చిట్ పొందిన ఓరీ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)

1. 2022 ముంబై డ్రగ్స్ కేసులో ఎవరెవరికి క్లీన్ చిట్ లభించింది?

నటీమణులు శ్రద్ధా కపూర్, నోరా ఫతేహీ, సిద్ధాంత్ కపూర్, సోషల్ మీడియా స్టార్ ఓరీ, నేత జీషాన్ సిద్ధిఖీలకు ఈ కేసులో విముక్తి లభించింది.

2. వీరి పేర్లు ఛార్జ్‌షీట్ నుంచి ఎందుకు తొలగించారు?

నిందితుడు మహ్మద్ సలీం వీరి పేర్లు చెప్పినప్పటికీ, వీరికి డ్రగ్స్ సరఫరా లేదా వాడకంతో సంబంధం ఉందని నిరూపించే సాక్ష్యాలు ఏవీ పోలీసుల విచారణలో లభించలేదు.

3. ఈ కేసు ఎప్పుడు ప్రారంభమైంది?

2022లో ముంబై యాంటీ నార్కోటిక్స్ సెల్ భారీ ఎత్తున మెఫెడ్రోన్ డ్రగ్స్ పట్టుకున్నప్పుడు ఈ కేసు వెలుగులోకి వచ్చింది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More