...
...
Next Story

వల లాంటి డ్రెస్సులో శ్రద్ధా శ్రీనాథ్ గ్లామర్ డోస్- ట్రాన్సపరెంట్‌గా అందాల వడ్డింపు- జెర్సీ హీరోయిన్ ఫొటోలు వైరల్!

టాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్ బీచ్‌లో దిగిన గ్లామరస్ ఫోటోలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. తెలుపు రంగు ట్రాన్స్‌పరెంట్ వల లాంటి డ్రెస్సులో శ్రద్ధా శ్రీనాథ్ అందాలు ఆరబోస్తూ అభిమానుల మనసు దోచుకుంటోంది. ముక్కుకు ముక్కెర పెట్టిన జెర్సీ హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్ గ్లామర్ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

Published on: Dec 21, 2025, 19:12:29 IST
Advertisement

టాలీవుడ్‌లో ‘జెర్సీ’ సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మలయాళ ముద్దుగుమ్మ శ్రద్ధా శ్రీనాథ్ సోషల్ మీడియాలో అగ్గి రాజేస్తోంది. సహజసిద్ధమైన నటనతోనే కాకుండా, అప్పుడప్పుడు తన గ్లామరస్ ఫోటో షూట్లతోనూ కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తోంది.

వలలాంటి డ్రెస్సులో

వల లాంటి డ్రెస్సులో శ్రద్ధా శ్రీనాథ్ గ్లామర్ డోస్- ట్రాన్సపరెంట్‌గా అందాల వడ్డింపు- జెర్సీ హీరోయిన్ ఫొటోలు వైరల్!
వల లాంటి డ్రెస్సులో శ్రద్ధా శ్రీనాథ్ గ్లామర్ డోస్- ట్రాన్సపరెంట్‌గా అందాల వడ్డింపు- జెర్సీ హీరోయిన్ ఫొటోలు వైరల్!

తాజాగా బీచ్ ఒడ్డున దిగిన కొన్ని శ్రద్ధా శ్రీనాథ్ ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పంచుకుంది. అందులో తెలుపు రంగు నెట్ డ్రెస్ ధరించి దేవకన్యలా మెరిసిపోతోంది ఈ హీరోయిన్. వలలాంటి ఆ డ్రెస్సు ట్రాన్స్‌పరెంట్‌గా ఉండటంతో శ్రద్ధా శ్రీనాథ్ తన అందాలను వయ్యారంగా వడ్డించేసింది.

గ్లామర్‌కు కేరాఫ్ అడ్రస్‌గా శ్రద్ధా!

సముద్రపు అలల మధ్య, ఇసుక తిన్నెలపై శ్రద్ధా శ్రీనాథ్ ఇచ్చిన పోజులు ఇప్పుడు ఇంటర్నెట్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. వైట్ కలర్ నెట్ డ్రెస్సులో తన పరువాలను వయ్యారంగా ఒలకబోస్తూ ఆమె ఇచ్చిన స్టిల్స్ నెటిజన్లను కట్టిపడేస్తున్నాయి.

హోమ్లీ పాత్రల్లో

క్లాస్ లుక్‌లోనూ మాస్ గ్లామర్‌ను ఎలా పండించాలో శ్రద్ధా మరోసారి నిరూపించింది. గతంలో హోమ్లీ పాత్రల్లో కనిపించిన ఈ భామ ఈ స్థాయిలో గ్లామర్ షో చేయడంతో అభిమానులు ఆశ్చర్యంతో పాటు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

నెట్టింట కామెంట్ల వర్షం

ఈ ఫోటోలు పోస్ట్ చేసిన కొద్దిసేపటికే లక్షలాది లైకులు, వేల సంఖ్యలో కామెంట్లు వచ్చి చేరుతున్నాయి. "వైట్ డ్రెస్‌లో శ్రద్ధా అద్భుతంగా ఉంది", "సముద్రపు అందం కంటే మీ అందమే ఎక్కువగా మెరిసిపోతోంది" అంటూ నెటిజన్లు తెగ పొగిడేస్తున్నారు.

రాయల్ లుక్ ఇచ్చిందంటూ

ఇదిలా ఉంటే, ముద్దుగుమ్మ శ్రద్ధా శ్రీనాథ్ చేతిలో పలు ఆసక్తికరమైన ప్రాజెక్టులు ఉన్నాయి. మెగాస్టార్ చిరంజీవి-వశిష్ట కాంబినేషన్‌లో వస్తున్న విశ్వంభర మూవీలో శ్రద్ధా శ్రీనాథ్ నటిస్తోందని సమాచారం. అలాగే, హిందీ మూవీ 'లెటర్స్ టు మిస్టర్ ఖన్నా'లో కూడా శ్రద్ధా శ్రీనాథ్ యాక్ట్ చేస్తోంది.

గ్లామర్ పవర్ చూపిస్తూ

ఒకవైపు నటనకు ప్రాధాన్యమున్న పాత్రలు చేస్తూనే, మరోవైపు ఇలాంటి హాట్ ఫోటోషూట్లతో తన గ్లామర్ పవర్‌ను కూడా చూపిస్తూ కెరీర్‌లో దూసుకుపోతోంది ఈ భామ. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా సోషల్ మీడియా ద్వారా తన వ్యక్తిగత విశేషాలను, ఇలాంటి అందమైన ఫోటోలను పంచుకుంటూ ఫ్యాన్స్‌కు టచ్‌లోనే ఉంటోంది నాని జెర్సీ హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks