డేటింగ్‌లో ఉన్నప్పుడు నా భర్త రోజు పొద్దున్నే నా కోసం అలా చేసేవాడు: ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పిన శ్రియా శరణ్
ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగొందింది శ్రియా శరణ్. ఇప్పుడు సినిమాల్లో కీ రోల్స్ చేస్తోంది. తన భర్తతో డేటింగ్ లో ఉన్నప్పటి విషయాలను శ్రియా రీసెంట్ గా బయటపెట్టింది.
పెళ్లికి ముందు తన డేటింగ్ రోజుల గురించి నటి శ్రియా శరణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేసింది. ఫిల్మ్ మేకర్-కంటెంట్ క్రియేటర్ ఫరా ఖాన్ ఇటీవల నటి శ్రియా శరణ్ వీడియో కోసం ముంబై నివాసానికి వెళ్లారు. అక్కడ వీరిద్దరి మధ్య సరదా సంభాషణ జరిగింది. ఈ సందర్భంగా శ్రియా తన వ్యక్తిగత జీవితం గురించి, ముఖ్యంగా తన భర్త ఆండ్రీ కోషీవ్ తో ప్రేమలో ఉన్నప్పటి తొలి జ్ఞాపకాల గురించి అభిమానులకు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించింది.

శ్రియా శరణ్ డేటింగ్
భర్త ఆండ్రీతో డేటింగ్ గురించి శ్రియా శరణ్ మనసువిప్పి చెప్పింది. ఫరా లేటెస్ట్ కుకింగ్ వ్లాగ్ లో తన భర్త ఆండ్రీ డేటింగ్ రోజుల్లో తన కోసం ప్రతి ఉదయం టిఫిన్ రెడీ చేసే పెట్టేవాడని శ్రియా తెలిపింది.
"మేము డేటింగ్ లో ఉన్నప్పుడు, అతను ఉదయాన్నే లేచి నాకు అల్పాహారం చేసేవాడు" అని శ్రియా చెప్పింది. ఫరా వెంటనే ఆటపట్టిస్తూ.. "డేటింగ్ ఆ?" అని అడగగా, శ్రియా నవ్వి.. "అవును, డేటింగ్? అప్పుడు మా పెళ్లి కాలేదు" అని బదులిచ్చింది.
ఫరా కోసం
వెంటనే దిలీప్ ఈ అవకాశాన్ని వదలకుండా.. "మేడమ్, నేను కూడా మేడమ్ (ఫరా) కోసం తయారు చేస్తా" అని అన్నాడు. ఫరా తనదైన హాస్యంతో వెంటనే స్పష్టతనిస్తూ "అవును, కానీ స్పష్టంగా మేమిద్దరం డేటింగ్ లో లేము. నువ్వు నా కుక్ కాబట్టి నా కోసం వంట చేయాలి. అది నీ పని, నీ వృత్తి రోజూ వంట చేయడం" అని చెప్పింది. దీనికి దిలీప్ నవ్వుతూ తల వూపాడు. ఫరా ఖాన్ జోడిస్తూ, "అయితే పెద్ద దయ చూపిస్తున్నావు" అని అనడంతో అందరూ నవ్వారు.
శ్రియా, ఆండ్రీ లవ్ స్టోరీ
శ్రియా శరణ్ కొన్ని సంవత్సరాలు డేటింగ్ చేసిన తర్వాత మార్చి 2018 లో రష్యన్ వ్యాపారవేత్త ఆండ్రీ కోషీవ్ ను వివాహం చేసుకుంది. ఈ జంట మొదట మార్చి 12 న ముంబైలో తమ వివాహాన్ని నమోదు చేసుకున్నారు. ఆ తర్వాత మార్చి 19 న ఉదయపూర్ లో సన్నిహిత కుటుంబ సభ్యులు, స్నేహితులు, నటుడు మనోజ్ బాజ్ పాయ్ తో సహా కొద్దిమంది సమక్షంలో ప్రైవేట్ హిందూ వివాహ వేడుకను నిర్వహించారు. వీరికి జనవరి 2021 లో కుమార్తె జన్మించింది
శ్రియా సినిమాలు
ఒకప్పుడు టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా మెరిసింది శ్రియా శరణ్. ఇప్పుడు 43 ఏళ్ల వయసులోనూ అదిరే అందాలతో కట్టిపడేస్తోంది. ఇప్పుడు సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తోంది. చివరగా తేజ సజ్జా 'మిరాయ్' లో కనిపించింది. ఆమె ఇటీవల రాబోయే తమిళ చిత్రం 'నాన్ వైలెన్స్' నుండి మెట్రో శిరీష్ తో 'కనగ' అనే ఉత్సాహభరితమైన డ్యాన్స్ నంబర్ లో కనిపించింది. ఈ చిత్రంలో బాబీ సింహ నటిస్తున్నారు.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


