...
...
Next Story

Shriya Saran: నామినేషన్లు వచ్చినా అవార్డుల ఫంక్షన్‌కు పిలవలేదు, మానసికంగా కుంగిపోయాను: హీరోయిన్ శ్రియా శరణ్ కామెంట్స్

Shriya Saran On Award Shows Invitation Over Awarapan Failure: శ్రియా శరణ్ నటించిన ఆవారాపన్ సినిమా అప్పట్లో బాక్సాఫీస్ వద్ద విజయం సాధించకున్నా కల్ట్ క్లాసిక్ హిట్‌గా నిలిచింది. అయితే, ఈ సినిమా పరాజయం, ఆ తర్వాత పరిశ్రమలో ఎదురైన వివక్షపై హీరోయిన్ శ్రియా శరణ్ ఆవారాపన్ 2 రిలీజ్ సందర్భంగా చెప్పుకొచ్చారు.

Published on: Aug 13, 2026, 10:50:24 IST
Advertisement

Shriya Saran About Award Shows Invitation: హిందీలో లవ్, రొమాంటిక్ చిత్రాలకు పేరుగాంచిన డైరెక్టర్ మోహిత్ సూరి దర్శకత్వంలో 2007లో వచ్చిన బాలీవుడ్ యాక్షన్ డ్రామా 'ఆవారాపన్'. ఇమ్రాన్ హష్మి, శ్రియా శరణ్, మృణాళిని శర్మ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా థియేటర్లలో విడుదలైన సమయంలో ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది.

రెండు దశాబ్దాల తర్వాత

నామినేషన్లు వచ్చినా అవార్డుల ఫంక్షన్‌కు పిలవలేదు, మానసికంగా కుంగిపోయాను: హీరోయిన్ శ్రియా శరణ్ కామెంట్స్
నామినేషన్లు వచ్చినా అవార్డుల ఫంక్షన్‌కు పిలవలేదు, మానసికంగా కుంగిపోయాను: హీరోయిన్ శ్రియా శరణ్ కామెంట్స్

అయితే కాలక్రమేణా అదే ఆవారాపన్ క్లాసిక్ కల్ట్ సినిమాగా గుర్తింపు తెచ్చుకుంది. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఈ చిత్రానికి సీక్వెల్ ఆవరాపన్ 2 సిద్ధమైన తరుణంలో ఆనాటి చేదు అనుభవాలను తెలుగు స్టార్ సీనియర్ హీరోయిన్ శ్రియా శరణ్ ఒక ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నారు.

ఆశలన్నీ అడియాసలు..

ఆవారాపన్ సినిమా విడుదలైన సమయంలో తామంతా ఎన్నో ఆశలు పెట్టుకున్నామని, కానీ ఫలితం నిరాశ పరిచిందని శ్రియా శరణ్ తెలిపారు. సినిమా ట్రెండ్‌కు కాస్త ముందుగా రావడం వల్ల ప్రేక్షకులు వెంటనే కనెక్ట్ కాలేకపోయారని ఆమె అభిప్రాయపడ్డారు.

నన్ను మాత్రం పిలవలేదు

"ఆవారాపన్ సినిమాకు కొన్ని అవార్డుల వేడుకల్లో నామినేషన్లు వచ్చాయి. కానీ, నన్ను మాత్రం ఆ ఫంక్షన్లకు కనీసం ఆహ్వానించలేదు. ఆ సమయంలో నాకు చాలా బాధగా అనిపించింది" అని శ్రియా ఆవేదన వ్యక్తం చేశారు.

మానసికంగా కుంగిపోయాను

సినిమా కచ్చితంగా పెద్ద హిట్ అవుతుందని, అందరూ వేడుకలా జరుపుకుంటారని భావించానని, కానీ పరిస్థితి దానికి భిన్నంగా మారడంతో మానసికంగా కుంగిపోయానని శ్రియా శరణ్ చెప్పుకొచ్చారు. అయితే, బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితం రాకపోయినా ఈ ఆవారాపన్ సినిమాకు ప్రేక్షకుల్లో క్రేజ్ మాత్రం తగ్గలేదు.

పాటలు మాత్రమే కాదు.. కథలోని డెప్తే కారణం!

డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ విక్రమ్ భట్ నిర్మించిన ఆవారాపన్ చిత్రంలో "తో ఫిర్ ఆఓ", "తేరా మేరా రిష్తా" వంటి పాటలు ఇప్పటికీ శ్రోతలను అలరిస్తూనే ఉన్నాయి. హైదరాబాద్, విశాఖపట్నం వంటి దక్షిణాది నగరాల్లోనూ ఈ హిందీ ఆల్బమ్‌కు అప్పట్లో విశేషమైన ఆదరణ లభించింది.

ఆగస్టు 14న థియేటర్లలోకి 'ఆవారాపన్ 2'

సుదీర్ఘ విరామం తర్వాత ఈ కల్ట్ క్లాసిక్ సీక్వెల్ 'ఆవారాపన్ 2' ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది. నితిన్ కక్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ రెండవ భాగంలో ఇమ్రాన్ హష్మీ సరసన దిశా పటానీ నటించగా, షబానా ఆజ్మీ కీలక పాత్ర పోషించారు.

ఆగస్ట్ 14 బాక్సాఫీస్ పోటీ

కాగా, ఆవారాపన్ 2 చిత్రం ఆగస్టు 14న థియేటర్లలో విడుదల కానుంది. అయితే, ఇదే రోజున సన్నీ డియోల్ 'బట్వారా 1947' సినిమా కూడా థియేట్రికల్ రిలీజ్ కానుంది. దీంతో బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఈ రెండు చిత్రాలు పోటీ పడనున్నాయి. మరి ఈ రెండింట్లో ఏది హిట్‌గా నిలిచేలా ఆడియెన్స్ ఆదరిస్తారో చూడాలి.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe