ఓటీటీలోకి శ్రియ శరణ్ నటించిన వెబ్ సిరీస్.. టీజర్ రిలీజ్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

శ్రియ శరణ్ నటించిన వెబ్ సిరీస్ ఓటీటీలోకి రాబోతోంది. ఇస్రో చేసిన చంద్రయాన్ ప్రయోగాల చుట్టూ తిరిగే ఈ వెబ్ సిరీస్ ఈ నెలలోనే స్ట్రీమింగ్ కానుంది. ఇందులో శ్రియ ఓ కీలకపాత్రలో నటించినట్లు తాజాగా వచ్చిన చిన్న టీజర్ చూస్తే తెలుస్తోంది.

Published on: Jan 6, 2026, 20:14:03 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఓటీటీలోకి శ్రియ శరణ్ నటించిన మరో వెబ్ సిరీస్ రాబోతోంది. టీవీఎఫ్ నిర్మించిన ఈ సిరీస్ పేరు స్పేస్ జెన్ - చంద్రయాన్. ఇది ఇస్రో సాగించిన చంద్రయాన్ ప్రయోగాల చుట్టూ తిరిగే సిరీస్. మంగళవారం (జనవరి 6) ఈ సిరీస్ టీజర్ ను జియోహాట్‌స్టార్ రిలీజ్ చేసింది. ఆ విశేషాలేంటో చూడండి.

ఓటీటీలోకి శ్రియ శరణ్ నటించిన వెబ్ సిరీస్.. టీజర్ రిలీజ్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే
ఓటీటీలోకి శ్రియ శరణ్ నటించిన వెబ్ సిరీస్.. టీజర్ రిలీజ్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

స్పేస్ జెన్ వెబ్ సిరీస్ టీజర్

జియోహాట్‌స్టార్ ఈ కొత్త ఏడాది తొలి నెలలోనే తీసుకొస్తున్న అద్భుతమైన వెబ్ సిరీస్ స్పేస్ జెన్ - చంద్రయాన్. గతేడాది డిసెంబర్ లోనే ఈ సిరీస్ స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్ చేయగా.. తాజాగా ఓ చిన్న టీజర్ రిలీజ్ చేసింది. ఇందులో సిరీస్ లోని ముఖ్యమైన పాత్రలను పరిచయం చేశారు. అందులో శ్రియ శరణ్ కూడా ఉండటం విశేషం. గడిచిన కొన్నేళ్లలో ఇస్రో సాగించిన చంద్రయాన్ ప్రయోగాలను ఈ సిరీస్ కళ్లకు కట్టబోతునట్లు టీజర్ చూస్తోంది. ఈ టీజర్ చాలా భావోద్వేగాలతో కూడిన రోలర్ కోస్టర్ లా సాగింది. జనవరి 23న ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతుంది.

చంద్రయాన్ ప్రస్థానం: సిరీస్ లో ఏం ఉంటుంది?

వెబ్ సిరీస్ ఇస్రో చేపట్టిన చంద్రయాన్ మిషన్ల చుట్టూ తిరుగుతుంది. 2008లో చేపట్టిన చంద్రయాన్-1 చంద్రుడిపై నీటి జాడను కనిపెట్టిన మొట్టమొదటి మిషన్ ఇది. ఈ మిషన్ తో ప్రపంచాన్నే నివ్వెర పరిచింది ఇస్రో.

ఆ తర్వాత 2019లో చంద్రయాన్-2 ఆర్బిటర్, ల్యాండర్ (విక్రమ్), రోవర్ (ప్రజ్ఞాన్)తో చేసిన భారీ ప్రయోగం. ల్యాండింగ్ సమయంలో చిన్న ఇబ్బందులు వచ్చినా ఇది ఇస్రో పట్టుదలకు నిదర్శనం.

ఇక 2023లో చంద్రయాన్-3తో చరిత్ర సృష్టించింది. యావత్ ప్రపంచం ఆశ్చర్యపోయేలా చంద్రుడి దక్షిణ ధ్రువం (South Pole)పై సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన ఘనత ఇస్రోకి దక్కింది.

బెంగళూరు కేంద్రంగా పనిచేసే ఇస్రో.. అతి తక్కువ ఖర్చుతో ప్రపంచ స్థాయి స్పేస్ మిషన్లను ఎలా చేపట్టిందో ఈ సిరీస్ ద్వారా మనం చూడొచ్చు. స్పేస్ జెన్ వెబ్ సిరీస్ జనవరి 23 నుంచి జియోహాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More