Shruti Haasan Peddi Song: బుచ్చిబాబు సాన దర్శకత్వంలో వచ్చిన ‘పెద్ది’ సినిమా థియేటర్లలో రిలీజై అయిదు నెలలు గడుస్తోంది. అయినప్పటికీ ఈ మూవీలో మహిళా పాత్రలను చూపించిన తీరుపై వివాదం మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. కొంతమంది విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శ్రుతి హాసన్ చేసిన తాజా కామెంట్స్ వైరల్ గా మారాయి.
పెద్దిలో స్పెషల్ సాంగ్

రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమాలో శ్రుతి హాసన్ ‘హెల్లల్లలో’ అనే స్పెషల్ సాంగ్ లో తన డ్యాన్స్ తో అదరగొట్టింది. రామ్ చరణ్, జాన్వీ కపూర్ తో కలిసి ఆమె ఎనర్జిటిక్ స్టెప్పులేసింది. అయితే ఈ స్పెషల్ సాంగ్ చేయడం వెనుక ఉన్న కారణాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో శ్రుతి హాసన్ చెప్పుకొచ్చింది.
అది చాలా ఇష్టం
సినిమాల్లో ఇలాంటి స్పెషల్ సాంగ్స్ అవసరమా అనే ప్రశ్న కూడా తనకు ఎప్పుడూ వస్తుందని శ్రుతి హాసన్ తెలిపింది. అయితే తనకు డ్యాన్స్ చేయడం, అందంగా రెడీ అవ్వడం ఇష్టమని చెప్పింది. అందుకే ఈ స్పెషల్ సాంగ్ కు ఓకే చెప్పినట్లు శ్రుతి హాసన్ వెల్లడించింది.
గ్లామర్ విషయంలో తానెప్పుడూ ఓపెన్ గా ఉంటానని, ఎవరినో మెప్పించడానికి బలవంతంగా నటించలేనని శ్రుతి హాసన్ స్పష్టం చేసింది. ఏదైనా దుస్తులు లేదా సీన్ విషయంలో అన్ కంఫర్ట్ గా అనిపిస్తే వెంటనే నో చెప్పేస్తానని తెలిపింది. ఈ విషయంలో కొన్నిసార్లు వాదనలు జరిగాయని కూడా చెప్పింది.
వ్యక్తిగత నిర్ణయం
పెద్ది సినిమాలో హీరోయిన్ జాన్వీ కపూర్ ను చూపించిన తీరుపై విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే పెద్ది మూవీతో పాటు బిగ్ స్క్రీన్ పై మహిళల చిత్రీకరణ గురించి జరుగుతున్న చర్చను తాను అర్థం చేసుకోగలనని శ్రుతి హాసన్ తెలిపింది. అయితే తన వరకు మాత్రం కొరియోగ్రఫీని ఎంజాయ్ చేస్తూ డ్యాన్స్ చేయడం ముఖ్యమని చెప్పింది.
జాన్వీ గురించి మాట్లాడలేనంటూ
{{/usCountry}}పెద్ది సినిమాలో హీరోయిన్ జాన్వీ కపూర్ ను చూపించిన తీరుపై విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే పెద్ది మూవీతో పాటు బిగ్ స్క్రీన్ పై మహిళల చిత్రీకరణ గురించి జరుగుతున్న చర్చను తాను అర్థం చేసుకోగలనని శ్రుతి హాసన్ తెలిపింది. అయితే తన వరకు మాత్రం కొరియోగ్రఫీని ఎంజాయ్ చేస్తూ డ్యాన్స్ చేయడం ముఖ్యమని చెప్పింది.
జాన్వీ గురించి మాట్లాడలేనంటూ
{{/usCountry}}ఈ ఇంటర్వ్యూలో జాన్వీ కపూర్ గురించి ప్రస్తావన రాగానే శ్రుతి హాసన్ జాగ్రత్తగా ఆన్సర్ చేసింది. ‘హెల్లల్లలో’ పాట కోసం జాన్వీతో కలిసి పని చేసినప్పటికీ.. ఈ సినిమా విషయంలో ఆమెకు ఎదురైన అనుభవం గురించి తాను మాట్లాడలేనని శ్రుతి హాసన్ చెప్పింది. ఎవరి అనుభవం గురించి వాళ్లే మాట్లాడటం కరెక్ట్ అని ఇండైరెక్ట్ గా పేర్కొంది.
రీసెంట్ గా థియేటర్లకు వచ్చిన ఆకాశంలో ఒక తార సినిమాలో శ్రుతి హాసన్ బోల్డ్ క్యారెక్టర్ తో అదరగొట్టింది. ఆమె నటనకు ప్రశంసలు దక్కుతున్నాయి.
ABOUT THE AUTHOR
చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.