...
...
Next Story

Shruti Haasan: నాన్న కూడా ఆ క్రింజ్ రీల్స్ పంపిస్తారు- శ్రుతి హాసన్ కామెంట్స్- కమల్, రజనీలో సేమ్ క్వాలిటీ చెప్పిన బ్యూటీ

Shruti Haasan About Kamal Haasan Rajinikanth Same Quality: విశ్వనటుడు కమల్ హాసన్ కూతురిగా కాకుండా, ఒక సాధారణ తండ్రీకూతుళ్లలా తమ మధ్య ఉండే అనుబంధం గురించి శృతి హాసన్ ముచ్చటించారు. కమల్ హాసన్, రజనీకాంత్ లలో ఉండే ఒకే ఒక్క కామన్ క్వాలిటీని ఆమె ఈ సందర్భంగా పంచుకున్నారు.

Published on: Mar 23, 2026, 12:55:46 IST
Advertisement

ప్రపంచం దృష్టిలో ఆయన ఒక 'విశ్వనటుడు'.. కానీ తన దృష్టిలో మాత్రం కేవలం 'అప్పా' (నాన్న) మాత్రమే అంటోంది సౌత్ బ్యూటిఫుల్ హీరోయిన్ శ్రుతి హాసన్. వెండితెరపై కమల్ హాసన్ ఇమేజ్ ఎంత భారీగా ఉన్నా, ఇంట్లో మాత్రం తామిద్దరం చాలా సాధారణంగా ఉంటామని ఆమె చెప్పుకొచ్చింది.

నాన్న కూడా ఆ క్రింజ్ రీల్స్ పంపిస్తారు- శ్రుతి హాసన్ కామెంట్స్- కమల్, రజనీలో సేమ్ క్వాలిటీ చెప్పిన బ్యూటీ
నాన్న కూడా ఆ క్రింజ్ రీల్స్ పంపిస్తారు- శ్రుతి హాసన్ కామెంట్స్- కమల్, రజనీలో సేమ్ క్వాలిటీ చెప్పిన బ్యూటీ

తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రుతి హాసన్ తన తండ్రితో ఉన్న బాంధవ్యం గురించి, అలాగే రజనీకాంత్, కమల్ హాసన్‌లలో తను గమనించిన ఒక గొప్ప లక్షణం గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది.

రజనీ, కమల్‌లలో ఉన్న ఆ ఒక్క పోలిక!

కెరీర్ పరంగా తాను ఎప్పుడూ కమల్ హాసన్ దగ్గర గానీ, రజనీకాంత్ దగ్గర గానీ సలహాలు తీసుకోలేదని శ్రుతి హాసన్ తెలిపింది. కేవలం వారిని గమనిస్తూనే చాలా విషయాలు నేర్చుకున్నానని చెప్పింది.

"వారిద్దరిలోనూ ఉన్న ఒకే ఒక్క కామన్ క్వాలిటీ ఏంటంటే.. అది వారి పని రాక్షసత్వం (Hardworking). 'నేను చాలా కష్టపడుతున్నాను, ఒత్తిడిలో ఉన్నాను' అని వారు ఎప్పుడూ పైకి చెప్పుకోరు. నిశ్శబ్దంగా తమ పని తాము చేసుకుంటూ వెళ్లిపోతారు. ఆఫీసులను, కుటుంబాలను బ్యాలెన్స్ చేస్తూనే.. పని విషయానికి వస్తే ఒక మృగంలా శ్రమిస్తారు. ఆ గుణం చాలా అందంగా ఉంటుంది" అని వారిపై తనకున్న గౌరవాన్ని చాటుకుంది శ్రుతి హాసన్.

నాన్న పంపే ఆ ‘క్రింజ్’ రీల్స్..

తమ మధ్య సినిమాల గురించి చర్చలు చాలా తక్కువని, సాధారణ తండ్రీకూతుళ్లలాగే మాట్లాడుకుంటామని శృతి హాసన్ వివరించింది. "మేమిద్దరం ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ షేర్ చేసుకుంటాం. నాన్న అప్పుడప్పుడు కొన్ని 'క్రింజ్' (చికాకు కలిగించేవి లేదా సిల్లీగా ఉండేవి) రీల్స్ పంపిస్తుంటారు" అని శ్రుతి హాసన్ చెప్పుకొచ్చింది.

ఇదిలా ఉంటే, శ్రుతి హాసన్ హాసన్ ఇటీవల రజనీకాంత్‌తో కలిసి 'కూలీ' సినిమాలో నటించింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ. 518 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం. ఇక తన తదుపరి చిత్రాల విషయానికి వస్తే.. దుల్కర్ సల్మాన్‌తో కలిసి 'ఆకాశంలో ఒక తార' చిత్రంలో నటిస్తోంది శ్రుతి హాసన్.

అలాగే ప్రభాస్ సరసన 'సలార్: పార్ట్ 2' కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అందులో శ్రుతి హాసన్ కూడా ఉండనుంది. మరోవైపు, 46 ఏళ్ల తర్వాత కమల్ హాసన్, రజనీకాంత్ ఒకే స్క్రీన్‌పై కనిపించబోతున్న ప్రాజెక్ట్ గురించి కూడా చర్చలు జరుగుతున్నాయి. దీనిని రాజ్ కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్ నిర్మించనుంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe