రియల్ హీరో శృతి హాసన్.. ఈ పాప పేరెంట్స్ చేసిన పోస్ట్ వైరల్.. అసలు ఆమె ఎవరో తెలుసా?
ప్రముఖ నటి శృతి హాసన్ ఓ అరుదైన జన్యుపరమైన వ్యాధితో బాధపడుతున్న చిన్నారి ప్రాణాలను కాపాడి రియల్ హీరో అనిపించుకుంది. చికిత్స కోసం ఆ చిన్నారి తల్లిదండ్రులకు అండగా నిలిచి, డాక్టర్లను కలిసి వారికి కావాల్సిన సహాయాన్ని అందించింది. దీనికి సంబంధించిన ఎమోషనల్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సినిమాల్లో హీరోయిన్‌గా అలరించే శృతి హాసన్.. నిజ జీవితంలోనూ తానొక గొప్ప మనసున్న మనిషినని నిరూపించుకుంది. ఓ అరుదైన జన్యుపరమైన వ్యాధితో పోరాడుతున్న పసిపాప ప్రాణాలను కాపాడి.. ఆ కుటుంబానికి పెద్ద దిక్కుగా నిలిచింది. ఆ చిన్నారి తల్లిదండ్రులు ఇటీవల తమ ఇన్‌స్టాగ్రామ్‌లో శృతి హాసన్‌తో తమ పాప ఆడుకుంటున్న వీడియోను షేర్ చేస్తూ.. ఆమె చేసిన సాయాన్ని గుర్తుచేసుకుని భావోద్వేగానికి గురయ్యారు.

ఆ చిన్నారి ప్రాణం శృతి భిక్షే..
'ఆళ్వి' అనే చిన్నారి అరుదైన 'ఎంఎస్‌ఎమ్‌డి' (MSMD - మెండీలియన్ ససెప్టిబిలిటీ టు మైకోబాక్టీరియల్ డిసీజెస్) అనే జన్యు సంబంధిత వ్యాధితో పుట్టింది. 2023లో జన్మించిన ఈ పాప.. నెలల వయసు నుంచే ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సి వచ్చింది. 2025లో బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ (ఎముక మజ్జ మార్పిడి) అవసరమైన క్లిష్ట పరిస్థితుల్లో.. దేవుడిలా శృతి హాసన్ ఆ కుటుంబానికి అండగా నిలిచింది.
పాప తల్లిదండ్రులు తమ పోస్ట్‌లో రాస్తూ.. "మనం మన అభిమాన తారలను కలవకూడదని అంటారు. కానీ వాళ్లు శృతి హాసన్‌ను కలిసి ఉండకపోవచ్చు. ఆమె కేవలం ఒక స్టార్ మాత్రమే కాదు.. అంతకుమించిన గొప్ప వ్యక్తి. మా పాప ఆళ్వి ఈరోజు బతికి ఉందంటే దానికి కారణం శృతి గారే" అని కృతజ్ఞతలు తెలిపారు.
శృతి చేసిన సాయం ఏంటి?
గతేడాది జులైవో ఆళ్వి పరిస్థితి విషమించి ఐసీయూలో చేరాల్సి వచ్చినప్పుడు శృతి హాసన్ స్వయంగా రంగంలోకి దిగింది. డాక్టర్ ధరణి, డాక్టర్ దివ్య వంటి నిపుణులైన వైద్య బృందాన్ని ఆ కుటుంబానికి పరిచయం చేసింది. దేశంలోని అత్యుత్తమ స్పెషలిస్టుల ద్వారా పాపకు మెరుగైన వైద్యం అందేలా చూసింది. కేవలం వైద్య సాయమే కాకుండా.. మానసికంగానూ, ఆర్థికంగానూ ఆ కుటుంబానికి ధైర్యాన్ని ఇచ్చింది.
బిస్కెట్ ప్యాకెట్‌తో చిన్నారి ముఖంలో నవ్వు
ఇటీవల ఆళ్వి, ఆమె తల్లిదండ్రులు శృతి హాసన్‌ను కలిశారు. ఈ సందర్భంగా శృతి ఆ చిన్నారితో ఆడుకుంటున్న వీడియో నెటిజన్ల మనసు గెలుచుకుంటోంది. "ఆమె మమ్మల్ని తన ఇంటి మనిషిలా ఆదరించారు. ఆళ్వి కోసం పెద్ద బిస్కెట్ ప్యాకెట్ తెచ్చి ఇచ్చారు. అది చూసి మా పాప ముఖంలో వెలిగిన ఆనందం మాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. శృతి గారు చాలా డౌన్ టు ఎర్త్" అని తల్లిదండ్రులు చెప్పారు. ఈ పోస్ట్‌కు శృతి హాసన్ హార్ట్ ఎమోజీలతో స్పందించింది.
కెరీర్ పరంగా ఫుల్ బిజీ
ఇక సినిమాల విషయానికి వస్తే 2025లో రజినీకాంత్ 'కూలీ' సినిమాలో కనిపించిన శృతి హాసన్.. ప్రస్తుతం విజయ్ సేతుపతితో 'ట్రైన్' సినిమాలో, దుల్కర్ సల్మాన్‌తో 'ఆకాశంలో ఒక తార' చిత్రంలో నటిస్తున్నారు. అలాగే ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్న ప్రతిష్టాత్మక మూవీ 'వారణాసి'లో శృతి ఒక పాటను పాడటం విశేషం.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


