...
...
Next Story

Shruti Haasan: పెళ్లి పీటల వరకూ వచ్చి ఆగిపోయా.. అసలు పెళ్లి ఎందుకు.. మ్యారేజ్ చేసుకోకుండానే తల్లినవుతా: శ్రుతి హాసన్

Shruti Haasan: 40 ఏళ్ల వయసులో సింగిల్‌గా ఉండటం, పెళ్లి, పిల్లలపై హీరోయిన్ శ్రుతి హాసన్ సంచలన వ్యాఖ్యలు చేసింది. పెళ్లి పేరుతో చేసే పేపర్‌వర్క్, కోట్లు తగలేసే గ్రాండ్ వెడ్డింగ్స్ తనకు నచ్చవని కుండ బద్ధలు కొట్టింది. గతంలో ఒకసారి పెళ్లి పీటల దాకా వచ్చి ఆగిపోయానని వెల్లడించింది.

Published on: Sep 23, 2026, 07:24:07 IST
Advertisement

Shruti Haasan: ​సోహా అలీ ఖాన్ పాడ్‌కాస్ట్ 'ఆల్ అబౌట్ హర్' (All About Her) లో పాల్గొన్న శ్రుతి హాసన్ తన పర్సనల్ లైఫ్ పై సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. తన వ్యక్తిగత జీవితం, పెళ్లి, ఆరోగ్య సమస్యలపై ఓపెన్‌గా మాట్లాడింది. ఆమె వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

పెళ్లి వరకూ వెళ్లా

పెళ్లి పీటల వరకూ వచ్చి ఆగిపోయా.. అసలు పెళ్లి ఎందుకు.. మ్యారేజీ చేసుకోకుండానే తల్లినవుతా: శ్రుతి హాసన్ (x/shrutihaasan)
పెళ్లి పీటల వరకూ వచ్చి ఆగిపోయా.. అసలు పెళ్లి ఎందుకు.. మ్యారేజీ చేసుకోకుండానే తల్లినవుతా: శ్రుతి హాసన్ (x/shrutihaasan)

"నాకు ఒక భాగస్వామి తోడు ఉండటం ఇష్టమే. కానీ ఒక బాక్స్‌లో ఇమిడిపోవడం నా వల్ల కాదు. సాంప్రదాయమైన ఆలోచనలు ఉన్నప్పటికీ.. పెళ్లి పేరుతో లీగల్ పేపర్‌వర్క్ చేసుకోవడం, కోట్ల రూపాయలు ఖర్చు చేసి హడావుడి నాకు నచ్చదు. అంత డబ్బు ఖర్చు చేసే బదులు అనాథలకు చారిటీ చేయడం మేలు.

నా జీవితంలో ఒకసారి పెళ్లి దాకా వెళ్లాను. కానీ చివరకు వద్దనుకున్నా. అది నా సొంత నిర్ణయాన్ని మార్చలేదు. ప్రతిరోజూ ఇద్దరూ ఒకరినొకరు ప్రేమించుకోవాలి. అంతే కానీ ఒక కాగితం ముక్కపై సంతకం పెట్టడం కోసం పెళ్లి చేసుకోకూడదు’’ అని శ్రుతి హాసన్ చెప్పింది.

​14 ఏళ్లకే హెల్త్ ప్రాబ్లమ్స్

​తన హెల్త్, పిల్లల గురించి కూడా శ్రుతి హాసన్ మాట్లాడింది. "నాకు 14 ఏళ్ల వయసులోనే పీసీఓఎస్ (PCOS) ఉందో లేదో తెలియని పరిస్థితి. పిల్లలు పుట్టడం కష్టమని వైద్యులు చెప్పారు. దానివల్ల మాతృత్వం గురించి మాట్లాడాలంటేనే భయపడేదాన్ని. కానీ ఇటీవల నా గైనకాలజిస్ట్‌తో మాట్లాడాక నా ఆలోచన మారింది’’ అని శ్రుతి హాసన్ వెల్లడించింది.

పెళ్లి కాకుండానే పిల్లలు

​కమల్ హాసన్, సారికల కుమార్తెగా చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టిన శ్రుతి హాసన్ ఎప్పుడూ తన సొంత ఐడెంటిటీతోనే ముందుకెళ్లింది. 40 ఏళ్ల వయసులో పెళ్లి, లీగల్ ప్రాసెస్, సోషల్ ప్రెజర్ గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ముఖ్యంగా పీసీఓఎస్ (PCOS) వంటి మహిళా ఆరోగ్య సమస్యలపై ఓపెన్‌గా మాట్లాడటం, మాతృత్వానికి బైలాజికల్ చైల్డ్ మాత్రమే మార్గం కాదని, దత్తత కూడా గొప్ప ఆప్షన్ అని చెప్పడం వైరల్ గా మారింది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks