...
...
Next Story

Peddi Song: పెద్ది స్పెషల్ సాంగ్ ఫిక్స్‌.. రామ్ చ‌ర‌ణ్‌తో ఆ గ్లామ‌ర్ బ్యూటీ డ్యాన్స్‌.. ఫ్యాన్స్‌కు కిక్కే కిక్కు!

Peddi Song: పెద్ది స్పెషల్ సాంగ్ పై సస్పెన్స్ వీడినట్లే! ఈ ప్రత్యేక గీతంలో గ్లామర్ బ్యూటీ డ్యాన్స్ చేయబోతుందని తెలిసింది. ఈ కాంబినేషన్ తో ఫ్యాన్స్ కు కిక్కే కిక్కు అని అంటున్నారు. మరి ఆ హీరోయిన్ ఎవరో చూసేయండి.

Published on: Apr 23, 2026, 12:48:42 IST
Advertisement

Peddi Song: సస్పెన్స్ కు దాదాపుగా తెరపడ్డట్లే. పెద్ది మూవీలో స్పెషల్ సాంగ్ పై ఎట్టకేలకు ఓ క్లారిటీ వచ్చిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. అసలు ఈ సాంగ్ ఉంటుందా? లేదా?.. ఉంటే ఏ హీరోయిన్ తో రామ్ చరణ్ స్టెప్పులు వేస్తాడు అనే దానిపై ఇన్ని రోజులూ అనుమానాలు ఉండేవి. ఇప్పుడు వీటికి ఓ క్లారిటీ దొరికిందని చెప్పొచ్చు.

పెద్ది స్పెషల్ సాంగ్

పెద్ది స్పెషల్ సాంగ్ లో గ్లామర్ క్వీన్ (x)
పెద్ది స్పెషల్ సాంగ్ లో గ్లామర్ క్వీన్ (x)

రామ్ చరణ్ హీరోగా వస్తున్న పెద్ది మూవీలోని స్పెషల్ సాంగ్ లో గ్లామర్ క్వీన్ శ్రుతి హాసన్ డ్యాన్స్ చేయనుందనేది లేటెస్ట్ బజ్. ఈ దుమ్ము రేపే మాస్ సాంగ్ లో చరణ్, శ్రుతి కలిసి డ్యాన్స్ ఇరగదీయబోతున్నారని తెలిసింది. ఈ సాంగ్ ఫ్యాన్స్ కు ఫుల్ కిక్ అందిస్తుందనేది ఇండస్ట్రీ వర్గాల మాట. మొత్తానికి పెద్ది స్పెషల్ సాంగ్ పై క్లారిటీ వచ్చేసిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఆ హీరోయిన్లు

పెద్ది స్పెషల్ సాంగ్ లో రామ్ చరణ్ తో ఆడిపాడటానికి శ్రుతి హాసన్ ను ఫైనలైజ్ చేశారని తెలిసింది. అంతకంటే ముందు మృణాల్ ఠాకూర్‌, మానస వారణాసి, సంయుక్త మీనన్ పేర్లను పెద్ది టీమ్ పరిశీలించిందని సమాచారం. ముఖ్యంగా మృణాల్ ఠాకూర్‌ పేరు ఎక్కువగా వినిపించింది. రామ్ చరణ్ తో కలిసి పెద్ది కోసం ఆమె స్పెషల్ సాంగ్ చేయబోతుందనే ప్రచారం జోరుగా సాగింది.

ఎవడు సినిమాలో

ఇప్పుడు ప్రచారాలను దాటి, ఊహాగానాలకు ముగింపు పలికేలా పెద్ది స్పెషల్ సాంగ్ ను శ్రుతి హాసన్ చేస్తుందని ఫిల్మ్ నగర్ వర్గాలు అంటున్నాయి. ఇప్పుడు ఈ సాంగ్ షూటింగ్ జరుగుతోందని తెలిసింది. రామ్ చరణ్, శ్రుతి హాసన్ ఇప్పటికే ఎవడు సినిమాలో కలిసి నటించారు. అందులో వాళ్లిద్దరి కెమిస్ట్రీ, డ్యాన్స్ అదిరిపోయింది. ఇప్పుడు మళ్లీ ఇద్దరు కలవడంతో పెద్ది స్పెషల్ సాంగ్ కూడా దుమ్ము లేచిపోతుందనే టాక్ వినిపిస్తోంది.

రిలీజ్ డేట్

ఇప్పటికే పెద్ది గ్లింప్స్, పహిల్వాన్ వీడియో, చికిరి చికిరి, రయ్ రయ్ రా రా సాంగ్స్ తో పెద్ది మూవీపై అంచనాలు పెరిగిపోయాయి. ఈ సినిమాకు బుచ్చిబాబు సాన డైరెక్టర్. ఇందులో హీరోయిన్ గా జాన్వీ కపూర్ నటిస్తుంది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks