Sidharth Malhotra Pookie: వెండితెరపై యాక్షన్ హీరోగా మెప్పించే సిద్దార్థ్ మల్హోత్రా, నిజ జీవితంలో మాత్రం తన ముద్దుల కూతురి దగ్గర సాఫ్ట్ డాడ్‌గా మారిపోయారు. గతేడాది భార్య కియారా అద్వానీతో కలిసి పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా సిద్దార్థ్ 'గర్ల్ డాడ్' ఎరాకు సంబంధించిన ఒక క్యూట్ ఫోటోను అభిమానులతో పంచుకున్నారు. ఈ ఫోటో చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
తలకి క్లిప్పుతో ముద్దుగా సిద్దార్థ్

బుధవారం (ఏప్రిల్ 15) ఇన్‌స్టాగ్రామ్‌లో స్టార్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా ఒక ఫోటో షేర్ చేశారు. అందులో సిద్ధార్థ్ తెల్లటి టీషర్ట్ ధరించి కెమెరా వైపు చూస్తూ చిరునవ్వు చిందిస్తున్నారు. అయితే అందరి దృష్టిని ఆకర్షించింది మాత్రం ఆయన తలకి పెట్టుకున్న చిన్న తెల్లటి 'బౌ' (Bow) క్లిప్పు.
"నేను ఒక గర్ల్ డాడ్ అని చెప్పకుండానే.. నేను ఒక గర్ల్ డాడ్ అని చెప్పండి" అంటూ ఈ ఫోటోకు సిద్ధార్థ్ మల్హోత్రా క్యాప్షన్ ఇచ్చారు. అంటే తన చిన్నారి కూతురు సరాయా తన తండ్రికి చేసిన మేకప్ ఇదని అర్థం. తండ్రీకూతుళ్ల మధ్య ఉండే ఆ అనుబంధాన్ని ఈ ఒక్క ఫోటోతో ఆయన చాటిచెప్పారు.
అభిమానుల సందడి
ఈ ఫోటో చూసిన అభిమానులు రకరకాలుగా స్పందిస్తున్నారు. "మా పూకీ మల్హోత్రా" అని కొందరు, "ప్రపంచంలోనే అత్యంత అందమైన తండ్రి" అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. "ఈ స్టైలింగ్ క్రెడిట్స్ కచ్చితంగా సరాయా మల్హోత్రాకే దక్కుతాయి" అంటూ నెటిజన్లు మురిసిపోతున్నారు. సిద్దార్థ్ తన వ్యక్తిగత జీవితం గురించి, ముఖ్యంగా తండ్రిగా తన అనుభూతుల గురించి పోస్ట్ చేయడం చూసి అభిమానులు ఆశ్చర్యంతో పాటు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఇంట్లో సూపర్ స్టార్ ఆమే!
ఇటీవల ముంబైలో జరిగిన ఒక కార్యక్రమంలో సిద్దార్థ్ మల్హోత్రా తన పితృత్వం గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. "ప్రతిరోజూ ఉదయం నా కూతురికి మసాజ్ చేయడం ఇప్పుడు నా దినచర్యలో భాగమైంది. నా జీవితం ఆమె వచ్చిన తర్వాత ఎంతో అందంగా మారిపోయింది. మాట్లాడటం కూడా రాని ఒక చిన్నారి ముందు నేను ఇన్ని వాదనలు ఓడిపోతానని ఎప్పుడూ అనుకోలేదు. ఇప్పుడు మా ఇంట్లో నేను హీరోను కాదు, మా పాప సరాయానే అసలైన సూపర్ స్టార్" అని సిద్ధార్థ్ మల్హోత్రా చెప్పుకొచ్చారు.
{{/usCountry}}ఇటీవల ముంబైలో జరిగిన ఒక కార్యక్రమంలో సిద్దార్థ్ మల్హోత్రా తన పితృత్వం గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. "ప్రతిరోజూ ఉదయం నా కూతురికి మసాజ్ చేయడం ఇప్పుడు నా దినచర్యలో భాగమైంది. నా జీవితం ఆమె వచ్చిన తర్వాత ఎంతో అందంగా మారిపోయింది. మాట్లాడటం కూడా రాని ఒక చిన్నారి ముందు నేను ఇన్ని వాదనలు ఓడిపోతానని ఎప్పుడూ అనుకోలేదు. ఇప్పుడు మా ఇంట్లో నేను హీరోను కాదు, మా పాప సరాయానే అసలైన సూపర్ స్టార్" అని సిద్ధార్థ్ మల్హోత్రా చెప్పుకొచ్చారు.
{{/usCountry}}కాగా.. సిద్దార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ 2023లో రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో అట్టహాసంగా వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. 'షేర్షా' సినిమా సమయంలో మొదలైన వీరి ప్రేమ ప్రయాణం, గతేడాది జూలై 15న సరాయా రాకతో మరింత మధురంగా మారింది. ప్రస్తుతం ఈ జంట తమ కూతురి గోప్యతను కాపాడుతూనే, ఇలాంటి చిన్న చిన్న మధుర క్షణాలను అభిమానులతో పంచుకుంటున్నారు.