ఓటీటీలోకి ఇవాళ వచ్చిన మ్యూజికల్ ఎమోషనల్ మూవీ- యాంకర్, సింగర్ రియల్ లైఫ్ భార్యాభర్తలతో- మనసుకు హత్తుకునేలా సీన్లు!

ఓటీటీలోకి ఇవాళ తెలుగు మ్యూజికల్ ఎమోషనల్ హార్ట్ టచింగ్ మూవీ వచ్చేసింది. ఆ మూవీ పేరే సింధు భైరవి. రియల్ లైఫ్‌లో భార్యాభర్తలైన సింగర్ కృష్ణ చైతన్య కారంచేడు, యాంకర్ మృదుల అయ్యంగార్ జంటగా నటించిన మ్యూజికల్ ఎమోషనల్ సినిమా సింధు భైరవి ఓటీటీ స్ట్రీమింగ్ ఎక్కడో ఇక్కడ తెలుసుకుందాం.

Published on: Nov 2, 2025, 15:37:03 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఓటీటీలో డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలు ప్రతివారం ఎన్నో స్ట్రీమింగ్ అవుతున్నాయి. తెలుగులోనూ అధికంగా ఓటీటీ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అయితే, ఇటీవల కాలంలో స్వచ్ఛమైన తెలుగు సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి. ప్రతివారం సరికొత్తగా ఒక యూనిక్ కాన్సెప్ట్‌తో ఓటీటీ తెలుగు సినిమా రిలీజ్ అవుతోంది.

ఓటీటీలోకి ఇవాళ వచ్చిన మ్యూజికల్ ఎమోషనల్ మూవీ- యాంకర్, సింగర్ రియల్ లైఫ్ భార్యాభర్తలతో- మనసుకు హత్తుకునేలా సీన్లు!
ఓటీటీలోకి ఇవాళ వచ్చిన మ్యూజికల్ ఎమోషనల్ మూవీ- యాంకర్, సింగర్ రియల్ లైఫ్ భార్యాభర్తలతో- మనసుకు హత్తుకునేలా సీన్లు!

దర్శకేంద్రుడి పర్యవేక్షణ

ఈ క్రమంలోనే ఇవాళ ఆదివారం (నవంబర్ 2) ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమా సింధు భైరవి. తెలుగులో మ్యూజికల్ ఎమోషనల్ హార్ట్ టచింగ్ మూవీగా సింధు భైరవి తెరకెక్కింది. ఈ సినిమాకు దర్శకేంద్రుడు కె రాఘవేంద్ర రావు కథ, స్క్రీన్ ప్లే, నిర్మాతగా, దర్శకత్వ పర్యవేక్షణ వహించారు.

రియల్ లైఫ్ భార్యాభర్తలు

అలాగే, సింధు భైరవి సినిమాకు సాయి తేజ దర్శకత్వం వహించారు. శేఖర్ గంగమోని సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టగా.. సాయి మధుకర్ సంగీతం అందించారు. ఇక ఈ మూవీలో కృష్ణ చైతన్య కారంచేడు, మృదుల అయ్యంగార్ ప్రధాన పాత్రలు పోషించారు. నిజానికి వీరిద్దరు రియల్ లైఫ్‌లో భార్యాభర్తలు.

సింగర్ అండ్ యాంకర్

కృష్ణ చైతన్య టాలీవుడ్‌లో మంచి సింగర్‌గా పేరు తెచ్చుకోగా.. మృదుల యాంకర్‌గా పాపులర్ అయింది. ఇలా యాంకర్, సింగర్ రియల్ లైఫ్ భార్యాభర్తలైన మృదుల, కృష్ణ చైతన్య నటించిన సింధు భైరవి సినిమా మనసుకు హత్తుకునే సీన్లతో తెరకెక్కించినట్లు మూవీ ట్రైలర్ చూస్తుంటే తెలుస్తోంది.

సంగీతమే ప్రపంచంగా

వీరిద్దరు సినిమాలో భార్యాభర్తలుగా నటించగా.. పరిణిత వీరికి కుమార్తెగా యాక్ట్ చేసింది. ఈ సినిమాలో సంగీతం, ఎమోషన్, ఫ్యామిలీ డ్రామా వంటి ఎలిమెంట్స్ ఉన్నట్లు తెలుస్తోంది. సంగీతమే ప్రపంచంగా బతికే దంపతులకు ఒక కుమార్తె ఉంటుంది. కూతురును అతి గారాబంగా పెంచుతారు.

సింధు భైరవి ట్విస్టులు

అయితే, ఓ సమయంలో వీరిద్దరిని ఆ కూతురు వదిలిపెట్టి వెళ్లిపోతుంది. ఆ తర్వాత ఏం జరిగింది?, అందుకు గల కారణాలు ఏంటీ? అనే ట్విస్టులతో సింధు భైరవి సినిమా తెరకెక్కింది.

తన జీవితం తాను

అయితే, సంగీతమే ప్రపంచం అనుకునే ఆ భార్యాభర్తలు తమ కూతురు కూడా తమలాగే మ్యూజిక్‌పై పట్టు సాధించాలనుకుంటారని, కానీ అది కాదని తన జీవితం తాను చూసుకునేందుకు కుమార్తె ఇల్లు వదిలి వెళ్లిపోయినట్లుగా సింధు భైరవి మూవీ ట్రైలర్‌లో చూపించారు.

ఈటీవి విన్ ఓటీటీలో

ఇక సింధు భైరవి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రముఖ తెలుగు డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఈటీవీ విన్‌లో ఇవాళ సింధు భైరవి ఓటీటీ రిలీజ్ అయింది. 37 నిమిషాల 32 సెకన్ల రన్‌టైమ్ ఉన్న సింధు భైరవి సినిమాను ఈటీవీ విన్ ఓటీటీలో ఎంచక్కా నేటి నుంచి చూసేయొచ్చు.

చాలా స్పెషల్

కాగా, ఈటీవీ విన్‌ ఓటీటీలో ప్రతి వారం సరికొత్త సినిమాను అతి తక్కువ రన్‌టైమ్‌తో డిజిటల్ ప్రీమియర్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈటీవీ విన్ ప్లాట్‌ఫామ్‌లో కథా సుధా అనే వీక్లి సిరీస్ టైటిల్‌తో ప్రతి వారం ఓ తెలుగు సినిమా ఓటీటీ రిలీజ్ అవుతోంది. అయితే, ఇలా సింగర్, యాంకర్‌తో సంగీతం నేపథ్యంతో ఓటీటీ సినిమా రావడం చాలా స్పెషల్ అని చెప్పుకోవచ్చు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More