...
...
Next Story

​Sing Geetham Box Office: సింగ్ గీతం బాక్సాఫీస్ నత్తనడక.. అయినా నెట్‌ఫ్లిక్స్ డీల్‌తో నిర్మాతలు సేఫ్ ఎలా అయ్యారంటే?

​Sing Geetham Box Office: ​లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన ప్రయోగాత్మక చిత్రం 'సింగ్ గీతం' థియేటర్లలో ఆశించిన వసూళ్లు సాధించలేకపోతోంది. అయితే, నెట్‌ఫ్లిక్స్ భారీ ఓటీటీ డీల్‌తో బడ్జెట్ రికవరీ కావడమే కాకుండా నిర్మాతలు సేఫ్ జోన్‌లోకి వెళ్లడం హాట్ టాపిక్‌గా మారింది.

Published on: Jun 17, 2026, 09:51:01 IST
Advertisement

​Sing Geetham Box Office: సినిమా బాగుంది అని విమర్శకులు మెచ్చినా, సోషల్ మీడియాలో పాజిటివ్ రివ్యూలు వచ్చినా.. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు రాబట్టడం ఎంత కష్టంగా మారిందో 'సింగ్ గీతం' (Sing Geetham Movie)సినిమాను చూస్తే అర్థమవుతోంది. సక్నిల్క్ ప్రకారం ఈ మూవీ కలెక్షన్లు అంతంతమాత్రంగానే ఉన్నాయి. కానీ నిర్మాతలు ఇప్పటికే సేఫ్ అయ్యారు. అది ఎలానో చూసేయండి.

సింగ్ గీతం సినిమా

సింగ్ గీతం బాక్సాఫీస్ నత్తనడక.. అయినా నెట్‌ఫ్లిక్స్ డీల్‌తో నిర్మాతలు సేఫ్ (x/VyjayanthiFilms)
సింగ్ గీతం బాక్సాఫీస్ నత్తనడక.. అయినా నెట్‌ఫ్లిక్స్ డీల్‌తో నిర్మాతలు సేఫ్ (x/VyjayanthiFilms)

టాలీవుడ్ లెజెండరీ విజనరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు (Singeetham Srinivasa Rao) రూపొందించిన ఈ వినూత్న ప్రయోగాత్మక సింగ్ గీతం సినిమాను థియేటర్లలో చూడటానికి ప్రేక్షకులు అంతగా ఆసక్తి చూపడం లేదు. విభిన్నమైన కథాంశంతో వచ్చిన ఈ సినిమా థియేట్రికల్ రన్ పరంగా తీవ్ర ఒడిదొడుకులు ఎదుర్కొంటోంది.

​5 రోజుల బాక్సాఫీస్ వసూళ్లు

​సింగ్ గీతం విడుదలైన ఐదు రోజుల్లో ఇండియా అంతటా కలిపి కేవలం రూ.3.76 కోట్ల నెట్ వసూళ్లను మాత్రమే రాబట్టిందని సక్నిల్క్ తెలిపింది. సింగీతం లాంటి మాస్టర్ క్రాఫ్ట్స్‌మెన్ నుంచి వచ్చిన సినిమాకు ఈ స్థాయి కలెక్షన్లు చాలా తక్కువని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

ఇవే కారణాలు

మల్టీప్లెక్స్‌లు, ఏ క్లాస్ సెంటర్లలో ఈ సినిమాకు సానుకూల స్పందన (Positive Talk) వినిపిస్తున్నా, బి అండ్ సి సెంటర్లలోని మాస్ ఆడియన్స్ థియేటర్లకు రావడం లేదు. ప్రస్తుత కాలంలో కమర్షియల్ హంగులు, లౌడ్ ఎంటర్‌టైన్‌మెంట్ లేని డ్రామాలను థియేటర్లలో కంటే ఓటీటీలోనే చూడటానికి ప్రేక్షకులు ఇష్టపడుతుండటమే ఈ నత్తనడక కలెక్షన్లకు ప్రధాన కారణాలని చెప్పొచ్చు.

ఓటీటీ రూపంలో రూ.14 కోట్ల జాక్‌పాట్!

​ఈ భారీ డిజిటల్ ఒప్పందం కారణంగా సింగ్ గీతం నిర్మాణ వ్యయం, పెట్టిన పెట్టుబడి మొత్తం థియేటర్లలో రిలీజ్ కాకముందే వెనక్కి వచ్చేసిందని సమాచారం. దీంతో బాక్సాఫీస్ వసూళ్లతో సంబంధం లేకుండా నిర్మాతలు ముందే పూర్తి సేఫ్ జోన్‌లోకి ఎంటర్ అయ్యారు. ప్రస్తుత టాలీవుడ్ మార్కెట్ పరంగా కంటెంట్ నమ్ముకుని తీసే చిన్న, ప్రయోగాత్మక సినిమాలకు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు ఎలాంటి లైఫ్ లైన్‌గా మారాయో చెప్పడానికి 'సింగ్ గీతం' బిజినెస్ మోడలే ఒక పర్ఫెక్ట్ ఉదాహరణ.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks