...
...
Next Story

Sing Geetham OTT: సింగ్ గీతం ఓటీటీ రిలీజ్ డేట్ కన్ఫామ్.. మ్యూజికల్ వండర్ స్ట్రీమింగ్ ఆ రోజే.. ఈ మూవీని ఎందుకు చూడాలంటే?

Sing Geetham OTT: మ్యూజిక్ తో మ్యాజిక్ చేసి, సిల్వర్ స్క్రీన్ పై ఓ డిఫరెంట్ ఎక్స్ పరిమెంట్ గా నిలిచిపోయిన సింగ్ గీతం మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది. 94 ఏళ్ల సింగీతం శ్రీనివాస రావు తీసిన ఈ మాస్టర్ పీస్ డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ కన్ఫామ్ అయింది. అసలు ఈ మూవీని ఎందుకు చూడాలో ఇక్కడ తెలుసుకోండి.

Published on: Jul 6, 2026, 11:01:36 IST
Advertisement

Sing Geetham OTT: కొన్ని సినిమాలు కేవలం ఎంటర్ టైన్మెంట్ పర్పస్ కోసమే థియేటర్లకు వస్తాయి. కానీ కొన్ని మాత్రం డిఫరెంట్ ఎక్స్ పరిమెంట్ తో ఆడియన్స్ మైండ్ లో తిష్ఠ వేస్తాయి. అలాంటి సినిమానే ‘సింగ్ గీతం’. 94 ఏళ్ల సింగీతం శ్రీనివాస రావు తీసిన ఈ మ్యూజికల్ వండర్ ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ కు రెడీ అయింది.

సింగ్ గీతం ఓటీటీ

సింగీతం ఓటీటీ రిలీజ్ డేట్ కన్ఫామ్ (x)
సింగీతం ఓటీటీ రిలీజ్ డేట్ కన్ఫామ్ (x)

తెలుగు సినిమాలోనే కాదు ఇండియన్ మూవీ ఇండస్ట్రీలోనే గర్వంగా చెప్పుకునే డైరెక్టర్ పేరు సింగీతం శ్రీనివాస రావు. అలాంటి లెజండరీ డైరెక్టర్ 94 ఏళ్ల వయసులో తీసిన మూవీ ‘సింగ్ గీతం’. ఈ చిత్రం ఓటీటీలోకి రాబోతుంది. జూలై 9 నుంచి పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో ఇది స్ట్రీమింగ్ కానుంది. ఈ ఓటీటీ ప్లాట్ ఫామ్ కమింగ్ సూన్ సెక్షన్ లో సింగ్ గీతం పేరు చేర్చారు.

నాలుగు భాషల్లో

సింగ్ గీతం మూవీ ఓటీటీలో నాలుగు భాషల్లో రిలీజ్ కానుంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ చిత్రం ఆడియన్స్ కు అందుబాటులోకి రానుంది. ఈ ఏడాది జూన్ 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైన ఈ సినిమా, బాక్సాఫీస్ వద్ద తనదైన ముద్ర వేసింది. థియేటర్లలో విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

నాగ్ అశ్విన్ నిర్మాణంలో

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో 'ఆదిత్య 369', 'పుష్పక విమానం' వంటి అద్భుత ప్రయోగాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన సింగీతం శ్రీనివాసరావు.. ఈ వయసులోనూ తనదైన శైలిలో సింగ్ గీతం చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు.

ఈ సింగ్ గీతం సినిమాలో ప్రధాన పాత్రలు పోషించిన అహిల్య, అయాన్, శాలిని కొండెపూడి తమ సహజసిద్ధమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. క్లిష్టమైన పాత్రలైనప్పటికీ ఎంతో పరిణతితో నటించి విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్నారు. వీరితో పాటు తులసి శివమణి, శివనారాయణ, అగు స్టాన్లీ చిడోజీ వంటి ప్రతిభావంతులైన నటీనటులు తమ సహాయ పాత్రలతో సినిమాకు మరింత బలాన్ని చేకూర్చారు.

  • దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ మ్యాజిక్

ఈ చిత్రానికి టాలీవుడ్ రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. "సింగీతం రాసుకున్న వైవిధ్యమైన కథా గమనానికి దేవి శ్రీ ప్రసాద్ తన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో ప్రాణం పోశారు" అని సినీ విమర్శకులు కొనియాడారు.

  • కొత్త ప్రయోగం

సింగ్ గీతం మూవీ తెలుగులోనే కాదు ప్రపంచ సినీ చరిత్రలోనే ఎవరూ చేయని కొత్త ప్రయోగం అని చెప్పొచ్చు. ఈ మూవీలో డైలాగ్ లు డైలాగ్ ల్లా ఉండవు. అన్నీ పాటల రూపంలోనే ఉంటాయి. ప్రతి ఒక్క క్యారెక్టర్ పాటల రూపంలోనే మాట్లాడుతుంది.

థియేటర్లలో క్లాస్ ఆడియన్స్‌ను మెప్పించిన ఈ ప్రయోగాత్మక చిత్రం, సరికొత్త కథలను ఆదరించే ఓటీటీ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe