Sing Geetham OTT: భారతీయ చలనచిత్ర రంగంలో సైన్స్ ఫిక్షన్, టైమ్ ట్రావెల్, మూకీ సినిమాలను పరిచయం చేసిన ఘనత దర్శకుడు సింగీతం శ్రీనివాసరావుకే దక్కుతుంది. ఆయన వయసుతో నిమిత్తం లేకుండా 94 ఏళ్ల వయసులో చేసిన తాజా అద్భుత ప్రయోగమే ‘సింగ్ గీతం’. థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ఒక వినూత్నమైన కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పుడీ మూవీ ఓటీటీలోకి రాబోతుంది.
సింగ్ గీతం ఓటీటీ రిలీజ్ డేట్

మ్యూజికల్ ఫాంటసీ మూవీగా, ఓ విభిన్నమైన ప్రయోగంతో వచ్చిన ‘సింగ్ గీతం’ చిత్రం ఓటీటీ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ డిఫరెంట్ మూవీ జూలై 9 నుంచి పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతుందని టాక్. అదే రోజు ఓటీటీ రిలీజ్ అవుతుందని అంటున్నారు.
4 భాషల్లో గ్రాండ్ ఎంట్రీ
సింగ్ గీతం చిత్రం థియేటర్లలో కేవలం తెలుగు, తమిళ భాషల్లో మాత్రమే విడుదలైంది. అయితే ఓటీటీ ఆడియన్స్ కోసం నెట్‌ఫ్లిక్స్ ఈ పరిధిని పెంచింది. జూలై 9 నుంచి ఒరిజినల్ వెర్షన్లతో పాటు కన్నడ, మలయాళ భాషల ఆడియోలను కూడా జత చేసి మొత్తం నాలుగు దక్షిణాది భాషల్లో డిజిటల్ ప్రీమియర్ చేయనున్నారు.
అయాన్, అహిల్యా బమ్రూ జంటగా నటించిన ఈ చిత్రంలో శాలిని కొండెపూడి, నివేదా పేతురాజ్, శివన్నారాయణ, బెనర్జీ, తులసి కీలక పాత్రలు పోషించారు. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ఈ మ్యూజికల్ ఫిల్మ్‌కు ప్రాణంగా నిలిచింది.
పెద్దితో పోటీ
సింగ్ గీతం మూవీ ఓటీటీలో రామ్ చరణ్ పెద్ది సినిమాతో పోటీ పడనుంది. లేటెస్ట్ బ్లాక్ బస్టర్ పెద్ది మూవీ కూడా జూలై 9న అదే నెట్‌ఫ్లిక్స్ లో ఓటీటీ రిలీజ్ కానుంది. ఓ రూరల్ స్పోర్ట్స్ పర్సన్ స్టోరీ లైన్ తో పెద్ది మూవీ తెరకెక్కింది.
సింగ్ గీతం స్టోరీ
{{/usCountry}}సింగ్ గీతం మూవీ ఓటీటీలో రామ్ చరణ్ పెద్ది సినిమాతో పోటీ పడనుంది. లేటెస్ట్ బ్లాక్ బస్టర్ పెద్ది మూవీ కూడా జూలై 9న అదే నెట్‌ఫ్లిక్స్ లో ఓటీటీ రిలీజ్ కానుంది. ఓ రూరల్ స్పోర్ట్స్ పర్సన్ స్టోరీ లైన్ తో పెద్ది మూవీ తెరకెక్కింది.
సింగ్ గీతం స్టోరీ
{{/usCountry}}సింగ్ గీతం సినిమా కథాంశం ప్రకారం.. ఒక మారుమూల గ్రామంలో ఒక వింతైన, అద్భుతమైన సంఘటన జరుగుతుంది. ఆ తర్వాత ఆ ఊరి ప్రజల జీవితాలు పూర్తిగా మారిపోతాయి. అక్కడ ఉన్నవారంతా తమ జీవితంలోని ప్రతి భావోద్వేగాన్ని (బాధ, సంతోషం, కోపం, ప్రేమ) కేవలం పాటల రూపంలోనే వ్యక్తపరచాల్సి ఉంటుంది. ఇలాంటి ఒక అరుదైన మ్యూజికల్ ఫాంటసీ డ్రామాను ఇండియన్ స్క్రీన్‌పై ఇప్పటివరకు ఎవరూ టచ్ చేయలేదు.
ఓటీటీ వెర్షన్‌లో మార్పులు
ఈ సినిమా డిజిటల్ రిలీజ్ గురించి నిర్మాత నాగ్ అశ్విన్ ఒక ఇంట్రెస్టింగ్ అప్ డేట్ పంచుకున్నాడు. థియేటర్లలో విడుదలైన వెర్షన్ కంటే ఓటీటీ వెర్షన్ మరింత మెరుగ్గా ఉండబోతోందని ఇప్పటికే తెలిపాడు.హోమ్ ఆడియన్స్‌కు బెస్ట్ విజువల్ అండ్ సౌండ్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వడం కోసం డిజిటల్ వెర్షన్‌లో కొన్ని సాంకేతిక మార్పులు, కలర్ కరెక్షన్ ఎడిట్స్ చేసినట్లు వెల్లడించాడు.