Singeetham Srinivasarao: సింగీతం శ్రీనివాసరావు.. ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో మోగిపోతున్న పేరు ఇది. 94 ఏళ్ల వయసులో ఆయన దర్శకత్వం వహించిన ‘సింగ్ గీతం’ మూవీ ఇవాళ (జూన్ 12) రిలీజైంది. ఈ మూవీకి పాజిటివ్ టాక్ వస్తుంది. డైలాగ్ లనే పాటలుగా మార్చి తీసిన ఈ మూవీ హాట్ టాపిక్ మారింది. అయితే సింగీతం ఇలాంటి ప్రయోగాలు ఎన్నో చేశారు. ఈ సినిమాలు నిజంగా ఆణిముత్యాలే.
మయూరి (1985) – ఒక చారిత్రాత్మక బయోపిక్

ఎవరిదైనా బయోపిక్ తీస్తుంటే ఆ పోలికలు ఉన్న యాక్టర్లను లీడ్ రోల్ గా తీసుకుంటారు. కానీ ఎవరి బయోపిక్ తీస్తున్నామో వాళ్లతోనే యాక్ట్ చేయించడం చాలా అరుదు. ఆ ప్రయోగాన్ని చేశారు సింగీతం శ్రీనివాసరావు. 1985లోనే ఇలాంటి సరికొత్త ఆలోచనతో భారతీయ సినిమాను సింగీతం ఆశ్చర్యపరిచారు.
ప్రమాదంలో కాలు కోల్పోయినా పట్టుదలతో నృత్యకారిణిగా ఎదిగిన సుధా చంద్రన్ నిజ జీవిత కథతో 'మయూరి' చిత్రాన్ని సింగీతం రూపొందించారు. ఆమెతోనే లీడ్ రోల్ చేయించి సంచలనం సృష్టించారు. ఈ చిత్రం ఏకంగా 14 నంది అవార్డులను సొంతం చేసుకుంది. తెలుగు సినీ చరిత్రలో ఒకే సినిమాకు ఇన్ని నంది పురస్కారాలు దక్కడం ఒక అపూర్వ రికార్డు.
పుష్పక విమానం (1987) – మాటలు లేని కావ్యం
రెండు గంటల ముప్పై ఒక్క నిమిషాల నిడివి గల సినిమా, కానీ ఒక్క డైలాగ్ కూడా ఉండదు! ఇలాంటి కథతో సినిమా తీయాలనే ఆలోచన చేయడానికే చాలా మంది దర్శకులు భయపడతారు. కానీ, సింగీతం శ్రీనివాసరావు ఒక్క మాట కూడా లేకుండా ప్రేక్షకులు ఆద్యంతం లీనమయ్యేలా ఒక అద్భుతమైన నిశ్శబ్ద చిత్రాన్ని నిర్మించారు. కమల్ హాసన్ కథానాయకుడిగా వచ్చిన ఈ 'పుష్పక విమానం' నేటికీ ఒక అపురూప మాస్టర్‌పీస్‌గా నిలిచిపోయింది.
అపూర్వ సహోదరులు (1989) – టెక్నికల్ మాస్టర్
ఐదు అడుగుల ఐదు అంగుళాల ఎత్తున్న ఒక స్టార్ హీరో, సినిమాలో పొట్టివాడిగా (డ్వార్ఫ్) కనిపిస్తే ఎలా ఉంటుంది? నేటి ఆధునిక గ్రాఫిక్స్, సీజీఐ సాంకేతికతతో ఇది చాలా సులభం కావచ్చు. కానీ, ఎలాంటి టెక్నాలజీ లేని 1989లోనే సింగీతం శ్రీనివాసరావు చేసిన మరో ప్రయోగమే'అపూర్వ సహోదరులు' (తమిళంలో అపూర్వ సగోదరర్గళ్). సినిమాలో కమల్ హాసన్‌ను అంత పొట్టిగా చూపించడానికి ఆయన వాడిన కెమెరా ట్రిక్స్, ఆప్టికల్ ఇల్యూజన్ టెక్నిక్స్ ఏమిటనేది ఇప్పటికీ ఎందరో నూతన దర్శకులకు ఒక పెద్ద మిస్టరీ. అంతే కాకుండా ఒక గొప్ప పాఠం కూడా.
ఆదిత్య 369 (1991) – టైమ్ మెషిన్ అద్భుతం
{{/usCountry}}ఐదు అడుగుల ఐదు అంగుళాల ఎత్తున్న ఒక స్టార్ హీరో, సినిమాలో పొట్టివాడిగా (డ్వార్ఫ్) కనిపిస్తే ఎలా ఉంటుంది? నేటి ఆధునిక గ్రాఫిక్స్, సీజీఐ సాంకేతికతతో ఇది చాలా సులభం కావచ్చు. కానీ, ఎలాంటి టెక్నాలజీ లేని 1989లోనే సింగీతం శ్రీనివాసరావు చేసిన మరో ప్రయోగమే'అపూర్వ సహోదరులు' (తమిళంలో అపూర్వ సగోదరర్గళ్). సినిమాలో కమల్ హాసన్‌ను అంత పొట్టిగా చూపించడానికి ఆయన వాడిన కెమెరా ట్రిక్స్, ఆప్టికల్ ఇల్యూజన్ టెక్నిక్స్ ఏమిటనేది ఇప్పటికీ ఎందరో నూతన దర్శకులకు ఒక పెద్ద మిస్టరీ. అంతే కాకుండా ఒక గొప్ప పాఠం కూడా.
ఆదిత్య 369 (1991) – టైమ్ మెషిన్ అద్భుతం
{{/usCountry}}కచ్చితంగా ఇది సింగీతం శ్రీనివాసరావు కెరీర్‌లోనే అత్యుత్తమ చిత్రం. తెలుగు సినిమా చరిత్రలో ఎప్పటికీ ఒక క్లాసిక్‌గా నిలిచిపోతుంది. నందమూరి బాలకృష్ణ లాంటి పక్కా మాస్ ఇమేజ్ ఉన్న హీరోతో సోషియో-ఫాంటసీ, సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్స్ కలిపిన టైమ్ ట్రావెల్ కథను తెరకెక్కించడం అంటే మామూలు విషయం కాదు.
కానీ ఇలాంటి ప్రయోగాలు చేయడమే సింగీతం శ్రీనివాసరావు స్టైల్ కదా. సింగీతం ఆ సాహసం చేసి మనకు ఒక ఆణిముత్యాన్ని అందించారు. విడుదలైన ఇన్నేళ్ల తర్వాత కూడా ఈ సినిమా అంతే నూతనంగా అనిపిస్తుంది. భారతీయ సినిమా గర్వించదగ్గ గొప్ప చిత్రాల్లో ఒకటిగా ఆదిత్య 369 మూవీని ప్రేక్షకులు ఆదరిస్తూనే ఉన్నారు.
భైరవద్వీపం (1994) – జానపద బ్రహ్మ
జోనాథన్ స్విఫ్ట్ రాసిన 'గులివర్స్ ట్రావెల్స్' పుస్తకంలో లిల్లీపుట్స్ (మరుగుజ్జులు) గురించి చదివే ఉంటారు. 1994లోనే ఒక పాటలో సాధారణ మనుషులను లిల్లీపుట్స్‌గా చూపిస్తూ, అది ప్రేక్షకులకు పూర్తిగా నమ్మశక్యంగా అనిపించేలా చిత్రీకరించడం ఒక్క సింగీతానికే సాధ్యమైంది. అంతటి మాస్ ఫాలోయింగ్ ఉన్న నందమూరి బాలకృష్ణను సినిమాలోని కొన్ని సన్నివేశాల కోసం 'కురూపి' పాత్రలో నటించేలా ఒప్పించడం ఆయన మేధస్సుకే చెల్లింది.
94 ఏళ్ల వయసులో 'సింగ్ గీతం' మ్యాజిక్
ప్రస్తుతం 94 ఏళ్ల వయసులో కూడా ఆయనలో సినిమా పట్ల ఉన్న కసి, సృజనాత్మకత తగ్గలేదు. ఇప్పుడు ఆయన 'సింగ్ గీతం' (Sing-Geetham) అనే ఒక సరికొత్త మ్యూజికల్ ఫిల్మ్‌తో మన ముందుకు వచ్చారు. ఇందులో పాత్రలు సాధారణ డైలాగులతో కాకుండా కేవలం పాటల ద్వారానే సంభాషించుకుంటాయి. ఈ వైవిధ్యభరిత దర్శకుడి వెండితెర మాయాజాలాన్ని మరోసారి పెద్ద తెరపై వీక్షిస్తూ అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.
People Also Ask - తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)
1. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన ఏ సినిమాకు అత్యధిక నంది అవార్డులు వచ్చాయి?
సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో వచ్చిన 'మయూరి' (1985) సినిమాకు ఏకంగా 14 నంది అవార్డులు లభించాయి. తెలుగు సినీ చరిత్రలో ఒకే సినిమాకు ఇన్ని నంది పురస్కారాలు దక్కడం ఇదే ప్రథమం.
2. 'ఆదిత్య 369' సినిమా ప్రత్యేకత ఏమిటి?
నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటించిన 'ఆదిత్య 369' తెలుగులోనే మొట్టమొదటి టైమ్ ట్రావెల్ సైన్స్ ఫిక్షన్ చిత్రం. సోషియో-ఫాంటసీ, సైన్స్ ఎలిమెంట్స్ కలయికతో వచ్చిన ఈ సినిమా నేటికీ ఒక ఎవర్గ్రీన్ క్లాసిక్‌గా నిలిచింది.
3. సింగీతం శ్రీనివాసరావు కొత్త సినిమా 'సింగ్ గీతం' విశేషం ఏమిటి?
94 ఏళ్ల వయసులో ఆయన తెరకెక్కించిన 'సింగ్ గీతం' ఒక వినూత్న మ్యూజికల్ ఫిల్మ్. ఈ సినిమాలో పాత్రలు సాధారణ డైలాగులు కాకుండా కేవలం పాటల రూపంలోనే ఒకరితో ఒకరు మాట్లాడుకుంటాయి.