Chinmayi Sripaada: ఈ దేశాన్ని రౌడీలు పాలిస్తున్నారు.. ఆ దేవుడే కాపాడాలి.. మిమ్మల్ని ఎవరూ పట్టించుకోరు: చిన్మయి ట్వీట్
Chinmayi Sripaada: సింగర్ చిన్మయి శ్రీపాద్ మరోసారి సంచలన ట్వీట్ చేసింది. ధర్మేంద్ర ప్రధాన రాజీనామా డిమాండ్ చేస్తూ ఢిల్లీలో నిరాహార దీక్ష చేస్తున్న సోనమ్ వాంగ్‌చుక్ ను దీక్ష విరమించాలని కోరుతూ పాలకులపై ఆమె చేసిన ఘాటు కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Chinmayi Sripaada: పాపులర్ ప్లేబ్యాక్ సింగర్, సోషల్ యాక్టివిస్ట్ చిన్మయి శ్రీపాద కేంద్ర ప్రభుత్వంపై, దేశంలో జరుగుతున్న నీట్ (NEET) పేపర్ లీక్స్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. లడఖ్ పర్యావరణవేత్త సోనమ్ వాంగ్‌చుక్ చేస్తున్న నిరాహార దీక్షను వెంటనే విరమింపజేయాలంటూ సోషల్ మీడియా వేదికగా ఆమె పెట్టిన వైరల్ పోస్ట్ ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.

నీట్ పేపర్ లీక్స్.. విద్యార్థుల ఆందోళన
గత కొంతకాలంగా దేశంలో నీట్ ఎగ్జామ్స్ చుట్టూ పేపర్ లీక్స్, రీ-ఎగ్జామ్స్ వివాదాలు నడుస్తూనే ఉన్నాయి. దీనివల్ల లక్షలాది మంది విద్యార్థులు, వాళ్ల పేరెంట్స్ తీవ్ర మానసిక ఆందోళనకు గురవుతున్నారు.
ఈ విద్యా వ్యవస్థలో లోపాలను ఎండగడుతూ చిన్మయి తన ఎక్స్ అకౌంట్ లో ఘాటైన వ్యాఖ్యలు చేశారు. పరీక్షల లీకేజీలు, మళ్లీ మళ్లీ ఎగ్జామ్స్ రాయలేక అలిసిపోయిన నీట్ స్టూడెంట్స్ మైండ్ లో ఇప్పుడు సోనమ్ వాంగ్‌చుక్ దీక్ష గురించి ఆలోచించే ఓపిక కూడా లేదని ఆమె స్పష్టం చేశారు.
సోనమ్ వాంగ్‌చుక్ దీక్షపై కేంద్రం వైఖరి
లడఖ్ హక్కుల కోసం, పర్యావరణ పరిరక్షణ కోసం నిరంతరం పోరాడే సోనమ్ వాంగ్‌చుక్ ప్రస్తుతం ఒక పెద్ద నిరాహార దీక్ష చేస్తున్నారు. ఆయన ఆరోగ్యం క్షీణిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై చిన్మయి ఆవేదన వ్యక్తం చేశారు.
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తో పాటు ఆయన బాస్‌లు అంటూ పరోక్షంగా ప్రధాని నరేంద్ర మోదీని కూడా చిన్మయి నేరుగా ఎటాక్ చేశారు. వాంగ్‌చుక్ చివరి శ్వాస వరకు దీక్ష చేసినా సరే ఈ పాలకులకు ఎలాంటి పట్టింపూ ఉండదని ఆమె తీవ్రంగా విమర్శించారు. ఎవరో ఒకరు చొరవ తీసుకుని ఆయన చేత దీక్ష విరమింపజేయాలని కోరారు.
దుర్మార్గుల చేతుల్లో అందమైన దేశం
మనది ఎంతో అందమైన దేశమని, కానీ ఇది కనీసం మనస్సాక్షి లేని తీవ్ర అవినీతిపరుల చేతుల్లో చిక్కుకుపోయిందని చిన్మయి మండిపడ్డారు. మన దేశాన్ని రౌడీలు పాలిస్తున్నారని కూడా ఆమె అనడం గమనార్హం. ప్రతి సెకనుకూ 'ధర్మం' అనే పదాన్ని వాడుకుంటూ దేశాన్ని దోచుకుంటున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. పాలకుల అనుచరులు కూడా వాళ్ల లాగే దుర్మార్గులుగా తయారయ్యారని ఘాటుగా విమర్శించారు. "దుర్మార్గుల చేతుల్లో చిక్కుకున్న ఈ దేశాన్ని ఆ దేవుడే కాపాడాలి" అంటూ ఆమె తన పోస్ట్‌ను ముగించారు.
చిన్మయి కేవలం సినిమా పాటలకే పరిమితం కాకుండా మీటూ (MeToo) మూవ్‌మెంట్ టైమ్ నుంచే సమాజంలో జరిగే అన్యాయాలపై గొంతు ఎత్తుతున్నారు. గతంలో సినిమా ఇండస్ట్రీలోని వేధింపులపై మాట్లాడి సంచలనం సృష్టించిన ఆమె.. ఇప్పుడు దేశంలో జరుగుతున్న రాజకీయ, విద్యా వ్యవస్థ సంక్షోభంపైనా చాలా ఘాటుగా రియాక్ట్ అవుతూ పోస్టులు పెడుతున్నారు. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజన్ల నుంచి భిన్నమైన స్పందనలు వస్తున్నాయి.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


