Singer Kailash Kher Slams Host: ఏదైనా అవార్డు వేడుక లేదా ఆడియో ఫంక్షన్ జరిగినప్పుడు హోస్ట్‌లు అక్కడికి వచ్చిన సింగర్లను సరదాగా రెండు పాటలు పాడమని అడగడం మనం నిత్యం చూస్తుంటాం. అయితే, ఈ సంప్రదాయంపై ప్రముఖ గాయకుడు కైలాష్ ఖేర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
హోస్ట్‌కు చురకలు

ఏప్రిల్ 25న ఢిల్లీలోని తాజ్ ప్యాలెస్‌లో జరిగిన 'సిక్స్ సిగ్మా లీడర్‌షిప్ సమ్మిట్'లో సింగర్ కైలాష్ ఖేర్ అతిథిగా పాల్గొన్నారు. ఈ క్రమంలో వ్యాఖ్యాత (హోస్ట్) కైలాష్ ఖేర్‌ను 'రెండు లైన్లు పాడి వినిపించమని' కోరారు. దీనికి కైలాష్ ఖేర్ చాలా ఘాటుగా స్పందించారు.
"సంగీతాన్ని, గాయకులను ఇలా చూడకూడదు. 'రెండు లైన్లు పాడండి.. మూడ్ సెట్ చేయండి' అని అడగడం చాలా తప్పు. ఇలాంటి రిక్వెస్ట్‌లు అస్సలు చేయకండి. సమాజంలో ఈ ధోరణిని మార్చాలన్నదే నా తపన" అని ఆయన బహిరంగంగానే తేల్చి చెప్పారు.
"సచిన్‌ను సిక్స్ కొట్టమని అడుగుతారా?"
కళాకారుల పట్ల చూపే వివక్షను ఎండగడుతూ కైలాష్ ఖేర్ కొన్ని ఆసక్తికరమైన ఉదాహరణలు ఇచ్చారు. "మీరు ఎప్పుడైనా సచిన్ టెండూల్కర్‌ను కలిసి.. 'సార్, ఇక్కడ ఒక సిక్స్ కొట్టి చూపించండి' అని అడుగుతారా? ఈ భూమ్మీద ఎవరూ అలా చేయరు" అని కైలాష్ ఖేర్ చెప్పారు.
"అలాగే ఒక ఆర్మీ జవాన్‌ను చూసి.. 'నీ పొజిషన్ తీసుకుని ఒక రౌండ్ కాల్పులు జరిపి చూపించు' అని అడగగలరా? మరి కళాకారుల దగ్గరకు వచ్చేసరికి మాత్రం ఎందుకు ఇలా ప్రవర్తిస్తారు? కళాకారులను క్లౌన్స్ (జోకర్లు) చేయకండి. ఒక సాధకుడిని కేవలం వినోదం పంచే వ్యక్తిగా కుదించవద్దు. కళాకారులు మనసు చెప్పినట్లు నడుచుకునే సాధకులు" అని సింగర్ కైలాష్ ఖేర్ ఆవేదన వ్యక్తం చేశారు.
సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు
కైలాష్ ఖేర్ వ్యాఖ్యలపై నెటిజన్లు రెండు వర్గాలుగా విడిపోయారు. ఒక వర్గం ఆయన మాటల్లో నిజం ఉందని సమర్థిస్తుండగా, మరో వర్గం ఆయన అహంకారాన్ని ప్రదర్శిస్తున్నారని విమర్శిస్తున్నారు.
{{/usCountry}}కైలాష్ ఖేర్ వ్యాఖ్యలపై నెటిజన్లు రెండు వర్గాలుగా విడిపోయారు. ఒక వర్గం ఆయన మాటల్లో నిజం ఉందని సమర్థిస్తుండగా, మరో వర్గం ఆయన అహంకారాన్ని ప్రదర్శిస్తున్నారని విమర్శిస్తున్నారు.
{{/usCountry}}"రెండు లైన్లు పాడటం వల్ల ఎదుటివారి ముఖంలో చిరునవ్వు కనిపిస్తే అందులో తప్పేముంది?" అని ఒక నెటిజన్ ప్రశ్నించారు.
మరోవైపు, "నిజమే.. ఒక కళాకారుడికి కూడా మూడ్, గౌరవం ఉంటాయి. వారు కోరుకున్నప్పుడే పాడాలి తప్ప, ఆర్డర్ చేసినట్లు అడగకూడదు" అని కైలాష్ ఖేర్ అభిమానులు మద్దతు తెలుపుతున్నారు.
జింగిల్స్ నుంచి 'బాహుబలి' వరకు..
ఇదిలా ఉంటే, కైలాష్ ఖేర్ ప్రస్థానం కోకాకోలా, పెప్సి వంటి బ్రాండ్ల జింగిల్స్‌తో మొదలైంది. 2003లో వచ్చిన 'అల్లా కే బందే' సాంగ్ ఆయన కెరీర్‌ను మలుపు తిప్పింది. ఆ తర్వాత 'కైలాస' బ్యాండ్ ద్వారా 'తేరీ దీవానీ' వంటి సెన్సేషనల్ హిట్స్ ఇచ్చారు.
తెలుగు ప్రేక్షకులకు కూడా కైలాష్ ఖేర్ సుపరిచితులే. ముఖ్యంగా రాజమౌళి ప్రతిష్టాత్మక చిత్రం 'బాహుబలి'లో 'ఎవడంటా ఎవడంటా', 'జయ జయకార' వంటి పాటలతో ఆయన గొంతు తెలుగు రాష్ట్రాల్లో మారుమోగిపోయింది.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)
1. కైలాష్ ఖేర్ హోస్ట్‌పై ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేశారు?
ఒక ఈవెంట్‌లో వ్యాఖ్యాత ఆయనను 'రెండు లైన్లు పాడండి' అని కోరడం తన వృత్తిని, గౌరవాన్ని తక్కువ చేయడమేనని భావించి కైలాష్ ఖేర్ అసహనం వ్యక్తం చేశారు.
2. కళాకారులను ఎవరితో పోల్చారు?
కళాకారులను సచిన్ టెండూల్కర్, ఆర్మీ జవాన్లతో పోల్చారు. మైదానం వెలుపల సచిన్‌ను సిక్స్ కొట్టమని ఎవరూ అడగరని, అలాగే కళాకారులను కూడా ఇష్టం వచ్చినప్పుడు పాడమని అడగకూడదని ఆయన వాదించారు.
3. కైలాష్ ఖేర్ పాడిన ప్రసిద్ధ పాటలు ఏవి?
ఆయన 'అల్లా కే బందే', 'తేరీ దీవానీ' వంటి హిందీ పాటలతో పాటు, తెలుగులో 'బాహుబలి' చిత్రంలోని 'ఎవడంటా ఎవడంటా', 'జయ జయకార' వంటి ప్రజాదరణ పొందిన పాటలు పాడారు.