యువతరంలో మంచి గుర్తింపు సాధించే ప్రతిభావంతురాలైన మనస్విని బాలబొమ్మల తెలుగులో “కొక్కోరోకో” చిత్రంతో వెండితెరపైకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఇది ఆమె కళాత్మక ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలవనుందని తెలుస్తోంది.
కొక్కోరోకో స్పెషల్ పోస్టర్

సంక్రాంతి పండుగ సందర్భంగా చిత్ర బృందం విడుదల చేసిన కొక్కోరోకో ప్రత్యేక పోస్టర్ అట్రాక్ట్ చేస్తోంది. సున్నితమైన, సంప్రదాయాత్మక భావంతో నిండిన ఈ పోస్టర్ వెంటనే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది.
ఆ పోస్టర్‌పై “మా బంగర్రాజు కుటుంబం మీకు, మీ కుటుంబసభ్యులకు సంక్రాంతి శుభాకాకంక్షలు చెబుతోంది. ‘కొక్కోరోకో’ త్వరలో థియేటర్లలో” అనే క్యాప్షన్‌తో చిత్రానికి పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చారు. ఈ సంక్రాంతి పోస్టర్ ద్వారా మనస్విని బాలబొమ్మల తొలి అధికారిక లుక్ కూడా విడుదలైంది.
టాలీవుడ్ డెబ్యూ
ఆ పోస్టర్‌లో సీనియర్ నటుడు సముద్రఖని సహా ఇతర నటులతో కలిసి మనస్విని బాలబొమ్మల కనిపించారు. ఈ చిత్రంలో మనస్విని బాలబొమ్మలది అతిథి పాత్ర అయినప్పటికీ, ఇది తెలుగు సినిమాల్లో ఆమెకు అధికారిక డెబ్యూ కానుంది. దీంతో మనస్విని బాలబొమ్మల టాలీవుడ్ డెబ్యూ మంచి స్పందనను రాబడుతోంది.
సినిమాల్లోకి రాకముందే మనస్విని ఒక శిక్షణ పొందిన, బహుముఖ ప్రతిభ కలిగిన కళాకారిణిగా తనదైన బలమైన పునాది వేసుకున్నారు. థియేటర్ రంగంలో లిటిల్ వుమెన్ నాటకంలో జోగా, మచ్ అడో ఎబౌట్ నథింగ్ (Much Ado About Nothing)లో బియాట్రిస్‌గా ప్రధాన పాత్రలను పోషించింది మనస్విని.
భక్తి గీతాలకు ప్రదర్శన
నటనతో పాటు మనస్విని బాలబొమ్మలకు పెరిని నాట్యం అనే శాస్త్రీయ నృత్యంలో శిక్షణ ఉండగా, కర్ణాటక సంగీతంలోనూ ప్రావీణ్యం సాధించారు. భక్తి గీతాల ప్రదర్శనలు ఇవ్వడం, గ్లెండేల్ అకాడమీలో ప్రధాన పాఠశాల కార్యక్రమాలకు యాంకరింగ్ చేయడం కూడా ఆమె కళా ప్రయాణంలో భాగమే.
ఇవే కాకుండా తెలుగులో డివోషనల్ సింగర్‌గా మనస్విని బాలబొమ్మల పేరు తెచ్చుకున్నారు. అమ్మా భవానీ అనే భక్తి పాటతో మనస్విని పాపులర్ అయ్యారు. ఇప్పుడు కొక్కోరోకో చిత్రంతో వెండితెరపై ఎంట్రీ ఇవ్వనున్నారు మనస్విని బాలబొమ్మల.
5 విభిన్న పాత్రలో అంథాలజీ మూవీ
{{/usCountry}}ఇవే కాకుండా తెలుగులో డివోషనల్ సింగర్‌గా మనస్విని బాలబొమ్మల పేరు తెచ్చుకున్నారు. అమ్మా భవానీ అనే భక్తి పాటతో మనస్విని పాపులర్ అయ్యారు. ఇప్పుడు కొక్కోరోకో చిత్రంతో వెండితెరపై ఎంట్రీ ఇవ్వనున్నారు మనస్విని బాలబొమ్మల.
5 విభిన్న పాత్రలో అంథాలజీ మూవీ
{{/usCountry}}ఇదిలా ఉంటే, “కొక్కోరోకో” చిత్రాన్ని దర్శకుడు రమేష్ వర్మ తన కొత్త బ్యానర్ ఆర్వీ ఫిల్మ్ హౌస్ ద్వారా తొలిసారి నిర్మాతగా మారి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి శ్రీనివాస్ వసంతల దర్శకత్వం వహిస్తున్నారు. ఐదు విభిన్న పాత్రలతో కూడిన ఈ సంకలిత (అంథాలజీ) చిత్రం, సంప్రదాయ కోడిపందేల నేపథ్యాన్ని ప్రధానంగా తీసుకుంది.
రేఖా వర్మ, కురపాటి సిరీష నిర్మాతలుగా వ్యవహరిస్తున్న కొక్కోరోకో మూవీ షూటింగ్ పూర్తి చేసుకుని, నీలాద్రి ప్రొడక్షన్ పతాకంపై 2026లో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమాకు సంకీర్తన్ సంగీతం అందించగా, ఆకాశ్ ఆర్ జోషి ఛాయాగ్రహణం, జివి సాగర్ సంభాషణలు అందించారు.
స్ట్రాంగ్ ఎమోషన్స్
కొక్కోరోకో కథన శైలి, ఆకట్టుకునే విజువల్స్, స్ట్రాంగ్ ఎమోషన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చిత్ర బృందం నమ్మకం వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో, మనస్విని బాలబొమ్మల సినీ ఆరంభం ఈ ప్రాజెక్ట్ ప్రయాణంలో ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని పేర్కొన్నారు.