...
...
Next Story

Singer Mangli : నార్సింగి పోలీసులను ఆశ్రయించిన సింగర్ మంగ్లీ - న్యాయవాదిపై ఫిర్యాదు..!

Singer Mangli police complaint : సింగర్ మంగ్లీ నార్సింగ్ పోలీసులను ఆశ్రయించారు. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తూ, అసత్య ప్రచారానికి పాల్పడుతున్నారంటూ న్యాయవాది సుభా సియపోగుపై ఫిర్యాదు చేశారు. రూ. 150 కోట్ల మోసం అంటూ జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని ఆమె స్పష్టం చేశారు.

Published on: Apr 11, 2026, 17:26:51 IST
Advertisement

తనను సుభా సియపోగు అనే న్యాయవాది వేధిస్తున్నానంటూ ప్రముఖ సింగర్ మంగ్లీ నార్సింగి పోలీసులను ఆశ్రయించారు. తన వ్యక్తిత్వానికి భంగం కలిగించేలా అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ ఫిర్యాదు చేశారు. తనకు ఎలాంటి సంబంధం లేని కరెన్సీ నోట్లు ఉన్న వీడియో చూపించి బెదిరించారని పేర్కొన్నారు. రూ. 150 కోట్ల మోసం అంటూ జరుగుతున్న ప్రచారంలో ఏ మాత్రం నిజం లేదన్నారు.

సింగర్‌ మంగ్లీ
సింగర్‌ మంగ్లీ

న్యాయవాది సుభా సియపోగు తనపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని మంగ్లీ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. సుమారు రూ. 150 కోట్లు మోసం చేశారంటూ తనపై తప్పుడు ప్రచారం సాగిస్తున్నారని… ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వివాదంతో తనకు ఎలాంటి సంబంధం లేకపోయినా… కావాలనే తన పేరును ఈ వ్యవహారంలోకి లాగుతున్నారని ఫిర్యాదులో ప్రస్తావించారు.

కేవలం ఆరోపణలు చేయడమే కాకుండా… తనను భయభ్రాంతులకు గురిచేసే ప్రయత్నం కూడా జరిగిందని మంగ్లీ ఆరోపించారు. తనకు ఏమాత్రం సంబంధం లేని భారీ కరెన్సీ నోట్ల కట్టలు ఉన్న ఒక వీడియోను చూపించి.. తనను బెదిరించారని ఫిర్యాదులో వెల్లడించారు. ఈ తప్పుడు ప్రచారాలతో తన వ్యక్తిగత జీవితంతో పాటు ప్రతిష్టకు భంగం కలుగుతోందని పేర్కొన్నారు. ఈ వ్యవహారంలోని నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.

మంగ్లీ ఇచ్చిన ఫిర్యాదును స్వీకరించిన నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అసలు ఆ వీడియో మూలాలు ఏమిటి…? 150 కోట్ల ఆరోపణల వెనుక ఉన్న వాస్తవాలేంటి..? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. మంగ్లీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. సుభా సింగబోష్‌పై బీఎన్ఎస్ సెక్షన్లు 79, 351(3) కింద కేసు నమోదు చేశారు.

మంగ్లీపై కేసు..!

ఈ మైక్రో ఫైనాన్స్ వ్యవహారంపై పోలీసులు లోతుగా విచారిస్తున్నారు. అయితే ఈ కేసులో ఏ1 ఎవరనే విషయాన్ని గుర్తించే పనిలో పడ్డారు. కట్ చేస్తే… తన వ్యక్తిత్వానికి భంగం కలిగించేలా అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ మంగ్లీ ఫిర్యాదు చేయటం చర్చనీయాంశంగా మారింది. పోలీసుల పూర్తిస్థాయి విచారణ తర్వాత….ఏం జరిగిందనేది బయటికి రానుంది.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks