20 సుమోలు, జీబ్స్ కాన్వాయ్‌లా వస్తే గర్వంగా అనిపించింది, ఆ బాంబ్ బ్లాస్ట్స్‌కు భయమేసింది.. సింగర్ రఘు కుంచె
సింగర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ రఘు కుంచే ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ సినిమా దేవగుడి. బెల్లం రామకృష్ణా రెడ్డి రచన, దర్శకత్వం, నిర్మాతగా వ్యవహరించిన దేవగుడి ఇవాళ థియేట్రికల్ రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు రఘు కుంచె.
అభినవ శౌర్య, నరసింహ, అనుశ్రీ, సింగర్, సంగీత దర్శకుడు రఘు కుంచె ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ మూవీ దేవగుడి. ఈ సినిమాకు బెల్లం రామకృష్ణా రెడ్డి రచనా దర్శకత్వంతోపాటు స్వీయ నిర్మాతగా వ్యవహరించారు. ఇవాళ (జనవరి 30) దేవగుడి సినిమా థియేట్రికల్ రిలీజ్ కానుంది.

సింగర్ రఘు కుంచె కామెంట్స్
ఈ నేపథ్యంలో ఇటీవల దేవగుడి దర్శక నిర్మాత బెల్లం రామకృష్ణా రెడ్డితోపాటు సింగర్ రఘు కుంచె ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విశేషాలను సింగర్ రఘు కుంచె పంచుకున్నారు.
చాలా పవర్ ఫుల్ వ్యక్తి
-నేను దేవగుడి సినిమాలో వీరారెడ్డి అనే పాత్రలో నటించాను. ఆయన ఆ చుట్టు పక్కల ఏరియాలో పవర్ ఫుల్ వ్యక్తి. నాకు పలాస సినిమా తర్వాత అలాంటి రోల్స్ వస్తున్నాయి. ఈ సినిమాలో వీరారెడ్డి పాత్ర కోసం దర్శకుడు రామకృష్ణా రెడ్డి గారు ఎలా చెబితే అలా పర్ ఫార్మ్ చేశాను. రాయలసీమ యాసలో డైలాగ్స్ చెప్పాను.
చాలా క్లారిటీగా తీశారు
-ఈ సినిమా షూటింగ్ అంతా రియల్ లొకేషన్స్‌లో చేశాం. ఎక్కడైతే కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయని దర్శకుడు స్క్రిప్ట్ రాశారో అక్కడే షూటింగ్ చేశాం. దర్శకుడిగా, నిర్మాతగా బెల్లం రామకృష్ణా రెడ్డి గారు ఆయన జాబ్ పర్పెక్ట్‌గా చేశారు. సినిమా కోసం బాగా ఖర్చు పెట్టారు. అలాగే దర్శకుడిగా ప్రతి సీన్ చాలా క్లారిటీగా రూపొందించారు.
రియల్ లైఫ్‌లో అలా రాదు కదా
-నేను జీబులో వెళ్తుంటే నా పక్కన ఓ ఇరవై సుమోలు, జీబ్స్ వస్తుంటాయి. అన్ని వాహనాలతో కాన్వాయ్‌లా వెళ్లడం పర్సనల్‌గా గర్వంగా అనిపించేది. నాకు రియల్ లైఫ్‌లో అలాంటి సందర్భం రాదు కదా. కాబట్టి వీరారెడ్డి పాత్రలో నటించడాన్ని రోజూ ఎంజాయ్ చేశాను. యాక్షన్ సీక్వెన్సుల్లో మాత్రం కొన్ని బాంబ్ బ్లాస్ట్స్ ఉన్నాయి. అప్పుడు మాత్రం భయమేసేది.
బ్యాక్ డ్రాప్‌లా మాత్రమే
-స్నేహం, ప్రేమ, పగ, ఫ్యామిలీ ఎమోషన్స్‌తో ఈ మూవీ ఆకట్టుకునేలా సాగుతుంది. ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్నా దాన్నొక బ్యాక్ డ్రాప్‌లా మాత్రమే పెట్టుకున్నారు. ఈ సినిమాలో ప్రతి ఒక్కరూ డెడికేషన్‌తో వర్క్ చేశారు. సెట్‌కు వెళ్లే సరికి ప్రతీది రెడీగా ఉండేది.
మదీన్ మంచి సాక్స్ చేశాడు
-లోకల్ ఆర్టిస్టులు కూడా బాగా నటించారు. ఈ సినిమాలో నేను ఒక పాట కంపోజ్ చేసి పాడాను. మదీన్ మంచి సాంగ్స్ చేశాడు. అతనికి మ్యూజిక్ డైరెక్టర్‌గా ఫ్యూచర్ ఉంటుంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


