Today OTT: ఓటీటీలోకి ఇవాళ వచ్చిన తెలుగు పీరియాడిక్ యాక్షన్ డ్రామా- మాజీ ప్రధాని రాసిన కథ- మనవరాలి శీలాన్ని కాపాడే బామ్మ!
Today OTT Telugu Release: ఓటీటీలోకి ఇవాళ వచ్చేసిన తెలుగు పీరియాడిక్ యాక్షన్ ఎమోషనల్ డ్రామా చిత్రం గొల్ల రామవ్వ. భారత మాజీ ప్రధాని పీవీ నరసింహ రావు రాసిన తెలంగాణ సాయుధ పోరాట గాథలోని పాత్రతో ఈ సినిమాను రూపొందించారు. మరి గొల్ల రామవ్వ ఓటీటీ స్ట్రీమింగ్ ఎక్కడో ఇక్కడ తెలుసుకుందాం.
ఓటీటీలోకి ప్రతివారం డిఫరెంట్ సినిమాలు, వెబ్ సిరీస్‌లు దర్శనం ఇస్తూనే ఉంటాయి. ఎక్కువగా హారర్, క్రైమ్, కామెడీ, ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్‌ను ఓటీటీ ఆడియెన్స్ ఇష్టపడుతుంటారు. అయితే, నిజ జీవిత సంఘటనల నుంచి వచ్చే సినమాలు చాలా అరుదు.

పీవీ నరసింహారావు రాసిన కథ
అలాంటిది తాజాగా రియల్ ఇన్సిడెంట్స్ నుంచి స్ఫూర్తి తీసుకుని సృష్టించిన ఓ పాత్ర ఆధారంగా తెరకెక్కిన సినిమా ఓటీటీలోకి ఇవాళ (జనవరి 25) వచ్చేసింది. ఆ సినిమానే గొల్ల రామవ్వ. తెలుగు జాతి గర్వపడేలా చేసిన భారత మాజీ ప్రధాని, భారతరత్న అవార్డ్ గ్రహిత స్వర్గీయ పీవీ నరసింహారావు రాసిన కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు.
తెలంగాణ సాయుధ పోరాట గాథకు దృశ్య రూపం
పీవీ నరసింహారావు రాసిన తెలంగాణ సాయుధ పోరాట గాథకు దృశ్య రూపంగా నిలిచిన గొల్ల రామవ్వ పాత్రతో ఈ మూవీని రూపొందించారు. రజాకార్‌ల ఆక్రమణలను, హింస, దౌర్జన్యాన్ని ఎదుర్కొన్న వీర వనితగా గొల్ల రామవ్వ పాత్రను సృష్టించారు.
మనవరాలి శీలాన్ని కాపాడే బామ్మ
రజాకార్‌ల నుంచి తన మనవరాలి శీలాన్ని కాపాడే బామ్మగా, తెలంగాణ సాయిధ పోరాటంలో వీరోచితంగా పోరాడిన మహిళగా గొల్ల రామవ్వను చూపించారు. ఇలాంటి గొల్ల రామవ్వ ఓటీటీలోకి ఇవాళ వచ్చేసింది. ప్రముఖ తెలుగు డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఈటీవీ విన్‌లో నేడు గొల్ల రామవ్వ ఓటీటీ రిలీజ్ అయింది.
గొల్ల రామవ్వ ఓటీటీ స్ట్రీమింగ్
ఈటీవీ విన్ ఓటీటీ వీక్లీ సిరీస్ అయిన కథా సుధాలో భాగంగా ఇవాళ గొల్ల రామవ్వ మూవీని డిజిటల్ ప్రీమియర్ చేశారు. తెలంగాణ సాయుధ పోరాటాన్ని కళ్లకు కట్టినట్లు చూపించేలా ఈ సినిమా తెరకెక్కినట్లు ట్రైలర్ చూస్తుంటే తెలుస్తోంది.
ప్రఖ్యాత రచయిత తనయుడి దర్శకత్వం
కాగా గొల్ల రామవ్వ టైటిల్ పాత్రను ప్రముఖ నటి, నిజం ఫేమ్ తాళ్లూరి రామేశ్వరి పోషించారు. ఆమెతోపాటు సినిమాలో అన్విత్, మణి మతేనా, అల్లు గీత తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. గొల్ల రామవ్వ ఓటీటీ సినిమాకు ప్రఖ్యాత రచయిత ముళ్లపూడి వెంకటరమణ కుమారుడు ముళ్లముడి వరా దర్శకత్వం వహించారు.
గొల్ల రామవ్వ టెక్నికల్ వర్క్స్
మౌనమే నీ భాష వంటి సినినిమాను నిర్మించిన చిత్రబృందం ఈ గొల్ల రామవ్వను రూపొందించింది. ఇక గొల్ల రామవ్వ చిత్రానికి సాయి మధుకర్ సంగీతం అందించారు. రవి బయ్యవరపు, వర ముళ్లపూడి ఇద్దరు రచనతోపాటు స్క్రీన్ ప్లే అందించారు. గంగమోని శేఖర్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టారు.
ఈటీవీ విన్ ఓటీటీలో
సుచేత డ్రీమ్ వర్క్స్ ప్రొడక్షన్, వర్మ డ్రీమ్ క్రియేషన్స్ బ్యానర్స్‌పై రామ్ విశ్వాస్ హనూర్కర్, రాఘవేంద్ర వర్మ (బుజ్జి) కలిసి సంయుక్తంగా గొల్ల రామవ్వ సినిమాను నిర్మించారు. నిజ జీవిత సంఘటనల నుంచి తెరకెక్కించిన సినిమాలను ఇష్టపడేవారు ఈటీవీ విన్‌లో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్న గొల్ల రామవ్వను చూడటం బెస్ట్ ఆప్షన్.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


