...
...
Next Story

Shreya: రియల్ ఎస్టేట్ ఇన్వెస్టిమెంట్‌లో దూసుకుపోతున్న స్టార్ సింగర్ శ్రేయా ఘోషల్- 2 లగ్జరీ ప్లాట్స్ కొనుగోలు- ధర ఎంతంటే?

Shreya Ghoshal Buys 2 Luxury Flats At Worli: ప్రముఖ నేపథ్య గాయని శ్రేయా ఘోషల్ ముంబైలోని అత్యంత ఖరీదైన వర్లీ ప్రాంతంలో రెండు విలాసవంతమైన అపార్ట్‌మెంట్లను కొనుగోలు చేశారు. తన తల్లిదండ్రులతో కలిసి అత్యంత భారీ వ్యయంతో ఈ ఆస్తులను రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు.

Published on: Apr 11, 2026, 12:37:46 IST
Advertisement

టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు తన మధురమైన గొంతుతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న స్టార్ సింగర్ శ్రేయా ఘోషల్ రియల్ ఎస్టేట్ రంగంలో భారీ ఇన్వెస్ట్‌మెంట్స్‌తో దూసుకుపోతున్నారు. ముంబైలోని అత్యంత విలాసవంతమైన ఏరియాల్లో ఒకటిగా పేరుగాంచిన వర్లీలో శ్రేయా ఘోషల్ రెండు ఖరీదైన ఫ్లాట్లను సొంతం చేసుకున్నారు.

రియల్ ఎస్టేట్ ఇన్వెస్టిమెంట్‌లో దూసుకుపోతున్న స్టార్ సింగర్ శ్రేయా ఘోషల్- 2 లగ్జరీ ప్లాట్స్ కొనుగోలు- ధర ఎంతంటే? (Instagram)
రియల్ ఎస్టేట్ ఇన్వెస్టిమెంట్‌లో దూసుకుపోతున్న స్టార్ సింగర్ శ్రేయా ఘోషల్- 2 లగ్జరీ ప్లాట్స్ కొనుగోలు- ధర ఎంతంటే? (Instagram)

రియల్ ఎస్టేట్ దిగ్గజం 'గోద్రెజ్ ప్రాపర్టీస్' నిర్మిస్తున్న 'గోద్రెజ్ ట్రైలాజీ' ప్రాజెక్టులో ఈ అపార్ట్‌మెంట్లు ఉన్నాయి. ఏప్రిల్ 1, 2026న ఈ లావాదేవీలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయింది.

కోట్లలో స్టాంప్ డ్యూటీ.. విలాసవంతమైన సౌకర్యాలు

మొదటి అపార్ట్‌మెంట్ వివరాల్లోకి వెళ్తే.. దీని కార్పెట్ ఏరియా సుమారు 2,430 చదరపు అడుగులు కాగా, మొత్తం ఏరియా 2,750 చదరపు అడుగులుగా ఉంది. ఈ ఒక్క ప్లాట్ కోసమే శ్రేయా కుటుంబం రూ. 1.78 కోట్ల స్టాంప్ డ్యూటీని ప్రభుత్వానికి చెల్లించింది. దీనితో పాటు మూడు కార్ పార్కింగ్ స్లాట్లు కేటాయించారు.

ఇక రెండో అపార్ట్‌మెంట్ సైతం దాదాపు 2,778 చదరపు అడుగుల విస్తీర్ణంతో ఉంది. దీని విలువ కూడా సుమారు రూ. 30 కోట్లుగా రిజిస్ట్రేషన్ పత్రాలు చెబుతున్నాయి. ఈ రెండో ప్లాట్ కోసం రూ. 1.8 కోట్ల స్టాంప్ డ్యూటీ, రూ. 30 వేల రిజిస్ట్రేషన్ ఛార్జీలు చెల్లించారు. అంటే కేవలం రిజిస్ట్రేషన్ ఫీజుల రూపంలోనే దాదాపు 3.6 కోట్లు ఖర్చు చేశారంటే ఈ ప్లాట్లు ఎంత ఖరీదైనవో అర్థం చేసుకోవచ్చు.

వర్లీ.. సెలబ్రిటీల చిరునామా

ముంబైలోని వర్లీ ప్రాంతం ఇప్పుడు సంపన్నులకు, సినీ సెలబ్రిటీలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. గతంలో దక్షిణ ముంబై, బాంద్రా ప్రాంతాలకు ఉన్న క్రేజ్ ఇప్పుడు వర్లీకి షిఫ్ట్ అయింది. ఇక్కడ చదరపు అడుగు ధర లక్ష రూపాయల నుంచి ప్రారంభమవుతుంది. ముంబై రియల్ ఎస్టేట్ చరిత్రలోనే అత్యధికంగా ఒక చదరపు అడుగుకు రూ. 2.80 లక్షల ధర పలికిన రికార్డు కూడా ఈ వర్లీలోని 'నమన్ జానా' భవనం పేరు మీద ఉండటం గమనార్హం.

దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ ధరలు పెరుగుతున్నప్పటికీ, ముంబైలో లగ్జరీ ఇళ్లకు డిమాండ్ తగ్గడం లేదు. ఇటీవలే సింగర్ జుబిన్ నౌటియాల్ కూడా ముంబైలో రూ. 4.94 కోట్లతో ఒక ఇంటిని కొనుగోలు చేశారు.

కానీ, శ్రేయా ఘోషల్ ఏకంగా రూ. 60 కోట్లతో డీల్ కుదుర్చుకోవడం ఇప్పుడు ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. తన తల్లి శమిష్ఠ ఘోషల్, తండ్రి బిస్వజిత్ ఘోషల్‌తో కలిసి ఆమె ఈ నూతన గృహ ప్రవేశానికి సిద్ధమవుతున్నారు.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks