సఖి, ఏ మాయే చేశావే వంటి ఫీల్ గుడ్ మూవీ అవుతుంది, నేను ఇక్కడ ఉండటానికి కారణం అదే- నిలవేపై సింగర్ సునీత కామెంట్స్

టాలీవుడ్ పాపులర్ సింగర్ సునీత ముఖ్య అతిథిగా విచ్చేసిన మ్యూజికల్ రొమాంటిక్ మూవీ నిలవే. సౌమిత్ పోలాడి, శ్రేయాసి సేన్ హీరో హీరోయిన్లుగా నటించారు. తాజాగా నిలవే ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించి ట్రైలర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా సింగర్ సునీత ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

Published on: Feb 12, 2026, 11:26:14 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

సౌమిత్ పోలాడి హీరోగా నటిస్తూ సాయి కే వెన్నంతో కలిసి దర్శకత్వం వహించిన చిత్రం నిలవే. ఈ సినిమాతో శ్రేయాసి సేన్ హీరోయిన్‌గా పరిచయం అవుతుంది. హర్ష చెముడు, సుప్రియా ఐసోలా మరో జంటగా నటించారు.

సఖి, ఏ మాయే చేశావే వంటి ఫీల్ గుడ్ మూవీ అవుతుంది, నేను ఇక్కడ ఉండటానికి కారణం అదే- నిలవేపై సింగర్ సునీత కామెంట్స్
సఖి, ఏ మాయే చేశావే వంటి ఫీల్ గుడ్ మూవీ అవుతుంది, నేను ఇక్కడ ఉండటానికి కారణం అదే- నిలవేపై సింగర్ సునీత కామెంట్స్

నిలవే ప్రీ రిలీజ్ ఈవెంట్

పీవోవీ ఆర్ట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజ్ అల్లాడ, గిరిధర్ రావు పోలాడి, సాయి కే వెన్నం నిర్మించారు. నిలవే సినిమా ప్రేమికుల దినోత్సవం కానుకగా ఫిబ్రవరి 13న విడుదలకాబోతుంది. ఈ సందర్భంగా బుధవారం (ఫిబ్రవరి 11) నాడు మాదాపూర్‌లో నిలవే ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించారు.

సింగర్ సునీత కామెంట్స్

ఈ కార్యక్రమానికి టాలీవుడ్ స్టార్ సింగర్ సునీత ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ ఈవెంట్‌లోనే నిలవ ట్రైలర్‌ను సింగర్ సునీత విడుదల చేశారు. ఈ సందర్భంగా నిలవే ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సింగర్ సునీత ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

ఇక్కడ ఉండటానికి కారణం

సింగర్ సునీత మాట్లాడుతూ.. "ఈ మధ్య చాలా తక్కువ సినిమాల్లో చక్కటి భావోద్వేగాలు చూస్తుంటాం. అలా అన్నీ ఎమోషన్స్ చూపించేలా ఉన్న చిత్రమే నిలవే. కాలం మారినా ఇంటెన్స్ మ్యూజిక్ అలానే ఉంటుంది. నేను ఇక్కడ ఉండటానికి కారణం కూడా అదే" అని అన్నారు.

క్లాసికల్ మూవీస్ తరహాలో

"నిలవే అనేది అద్భుతమైన ఫొటోగ్రఫీ, దర్శకత్వం, తగిన నటీనటులు ఉన్న సినిమా. ఈ సినిమా చూశాను. అర్థవంతమైన సినిమా ఇది. మ్యూజికల్ లవ్ స్టోరీ థియేటర్‌లో ఆడేలా ప్రేక్షకులు తీర్పు ఇస్తారని, క్లాసికల్ మూవీస్ సఖి, ఏ మాయే చేశావే తరహాలో మంచి ఫీల్ గుడ్ సినిమా అవుతుందని భావిస్తున్నా" అని సింగర్ సునీత తెలిపారు.

కీరవాణి గారిని వినమంటే

"ఇందులోని పాటలు బాగున్నాయని ఓసారి కీరవాణి గారిని వినమంటే ఆయన విని తన వంతు సపోర్ట్ ఇస్తానని ప్రమోషన్ చేయడం కూడా సినిమాపై పాజిటివిటీ నెలకొంది. ఈ సందర్భంగా అందరికీ మరోసారి విషెస్ చెబుతున్నానాను" అని గాయనీ సునీత తెలిపారు.

సంగీతమే ప్రధాన కారణం

హీరోయిన్ శ్రేయాసి సేన్ మాట్లాడుతూ.. "సినిమా ఇండస్ట్రీలో అతి పెద్దైన తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్‌గా నటించినందుకు ఆనందంగా ఉంది. ఈ సినిమా నేను అంగీకరించడానికి సంగీతమే ప్రధాన కారణం. డైలాగ్స్ కూడా ఫీల్ కలిగేలా ఉన్నాయి" అని అన్నారు.

ప్రేమ మీద మంచి అభిప్రాయం

"జెన్‌జీ జెనరేషన్‌కు చెందిన మా జనరేషన్ సినిమా ఇది. ఈ నిలవే సినిమా చూశాక ప్రేమ మీద మంచి అభిప్రాయానికి వస్తారని నమ్ముతున్నాను. ఇంత మంచి సినిమా చేసిన టీమ్‌కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను" అని డెబ్యూ హీరోయిన్ శ్రేయాసి సేన్ పేర్కొన్నారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More