కోరికలు తీరక.. భర్తను చంపి శవంతో ఇంట్లో.. తెలుగులో ఓటీటీలో సిస్టర్ మిడ్‌నైట్ మూవీ.. పెద్ద వాళ్లకు మాత్రమే
ఓటీటీలోకి తెలుగులో ఓ ఇంట్రెస్టింగ్ మూవీ వచ్చేసింది. రాధికా ఆప్టే హీరోయిన్ గా నటించిన ఈ మూవీలో కామెడీ, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. సిస్టర్ మిడ్‌నైట్ స్టోరీతో వచ్చిన ఈ మూవీ ఏ ఓటీటీలో ఉందో చూసేయండి.
శుక్రవారం రాగానే ఓటీటీలో సందడి కాస్త ఎక్కువగా ఉంటుంది. కొత్త సినిమాలు, సిరీస్ లు రిలీజ్ కు క్యూ కడతాయి. లాంగ్ వీకెండ్ కోసం మంచి ఆప్షన్స్ అందుబాటులో ఉంటాయి. ఇప్పుడు అలాగే ఓటీటీలో తెలుగులో వచ్చేసిన మూవీ ‘సిస్టర్ మిడ్‌నైట్’. ఈ సినిమాలో రాధికా ఆప్టే లీడ్ రోల్ ప్లే చేసింది. ఇదో బ్లాక్ కామెడీ థ్రిల్లర్ గా తెరకెక్కిన చిత్రం

సిస్టర్ మిడ్‌నైట్ ఓటీటీ
రాధికా ఆప్టే ప్రధాన పాత్రలో నటించిన ‘సిస్టర్ మిడ్‌నైట్’ మూవీ తెలుగు ఆడియన్స్ కు అందుబాటులోకి వచ్చింది. ఇవాళ (డిసెంబర్ 12) నుంచి ఈ సినిమాను తెలుగు ఆడియన్స్ కూడా ఓటీటీలో ఎంజాయ్ చేయొచ్చు. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పటికే హిందీలో ఉన్న ఈ సినిమాకు తెలుగు, తమిళం డబ్బింగ్ యాడ్ చేశారు.
6 నెలల తర్వాత
సిస్టర్ మిడ్‌నైట్ మూవీ మే 20, 2025న థియేటర్లలో రిలీజైంది. అక్కడ ఆడియన్స్ ను పెద్దగా అట్రాక్ట్ చేయలేకపోయింది. జూన్ 17న ఓటీటీలోకి వచ్చింది. అప్పుడు కేవలం హిందీ భాషలోనే స్ట్రీమింగ్ అయింది సిస్టర్ మిడ్‌నైట్ మూవీ. ఇప్పుడు ఆరు నెలల తర్వాత తెలుగుతో పాటు తమిళంలోనూ అందుబాటులోకి వచ్చింది.
కేన్స్ లో
సిస్టర్ మిడ్‌నైట్ మూవీకి కరణ్ కందారి డైరెక్టర్. 2024 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఈ సినిమాను ప్రదర్శించారు. ఇందులో రాధికా ఆప్టే, అశోక్ పాఠక్, ఛాయా కదమ్ తదితరులు నటించారు. ఈ సినిమాకు థియేటర్లలో ఆశించిన ఫలితం రాలేదు. కానీ హిందీలో ఓటీటీలో మంచి రెస్పాన్స్ దక్కించుకుంది.
సిస్టర్ మిడ్‌నైట్ కథ
గోపాల్ (అశోక్ పాఠక్), ఉమ (రాధికా ఆప్టే) వేర్వేరు గ్రామాలకు చెందిన వాళ్లు. ఉమను గోపాల్ పెళ్లి చేసుకుంటాడు. అతను ముంబైలో పని చేస్తుంటాడు. అక్కడి ఓ మురికివాడలో చిన్న ఇంట్లో గోపాల్, ఉమ ఉంటారు. కానీ ఉమకు ఇంటి పనులు, వంట పనులు చేయడం అంటే చిరాకు. ఏ పని సరిగ్గా రాదు. పైగా కోరికలు ఎక్కువ.
అమాయకంగా ఉండే భర్త నుంచి కోరుకున్నది ఏదీ ఉమకు దొరకదు. దీంతో తీవ్రమైన ఒత్తిడి కారణంగా ఉమ మైండ్ సెట్ మారిపోతుంది. వింతగా ప్రవర్తిస్తుంది. ఈ క్రమంలో అనుకోని పరిస్థితుల్లో జంతువులను చంపుతుంది. ఎక్కడికైనా వెళ్లిపోవాలని అనుకుంటుంది. భర్తను చంపి శవాన్ని ఇంట్లోనే ఉంచుకుంటుంది. మరి ఆ తర్వాత ఏం జరిగింది? భర్తను ఎందుకు చంపింది? అన్నది సిస్టర్ మిడ్‌నైట్ సినిమాలో చూడాల్సిందే.














