ఇండియన్ వుమెన్ స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన, పలాష్ ముచ్చల్ పెళ్లి రద్దు హాట్ టాపిక్ గా మారింది. ఆదివారం (డిసెంబర్ 7) ఈ ఇద్దరూ వేర్వేరుగా తమ ఇన్ స్టా స్టోరీల ద్వారా వివాహం రద్దు ప్రకటన చేశారు. అయితే పలాష్ తన పోస్ట్ ద్వారా వార్నింగ్ కూడా ఇచ్చాడు. నిజానికి నవంబర్ 23న స్మృతి మంధాన, పలాష్ ముచ్చల్ పెళ్లి జరగాల్సింది. కానీ ఆ రోజు ఉదయం స్మృతి మంధాన తండ్రికి హార్ట్ స్ట్రోక్ రావడం, పలాష్ కూడా హాస్పిటల్లో చేరడంతో పెళ్లి వాయిదా పడింది. ఇప్పుడు మొత్తానికే రద్దయింది.
పలాష్ పోస్ట్

స్మృతి మంధానతో పెళ్లి క్యాన్సిల్ అవడంపై పలాష్ ముచ్చల్ ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో సంచలన వ్యాఖ్యలు చేశాడు. ‘‘నేను నా జీవితంలో ముందుకు సాగాలని, నా వ్యక్తిగత సంబంధాల నుండి తప్పుకోవాలని నిర్ణయించుకున్నా. నాకు అత్యంత పవిత్రమైన దానిపై నిరాధారమైన పుకార్ల గురించి ప్రజలు ఇంత సులభంగా స్పందించడం చూసి నేను చాలా బాధపడుతున్నా. ఇది నా జీవితంలో అత్యంత కష్టమైన దశ. నా నమ్మకాలను గట్టిగా పట్టుకొని నేను దీనిని చాకచక్యంగా ఎదుర్కొంటా’’ అని పలాష్ పేర్కొన్నాడు.
లీగల్ వార్నింగ్
‘‘గాసిప్‌ల ఆధారంగా ఒకరిని అంచనా వేయడానికి ముందు మనం సమాజంగా, ఆగిపోవడం నేర్చుకుంటామని నేను నిజంగా ఆశిస్తున్నా. వాటి మూలాలు ఎప్పుడూ గుర్తించరు. మనం వీటి గురించి ఆలోచిస్తున్నప్పుడు, ప్రపంచంలో చాలా మంది తీవ్ర పరిణామాలను ఎదుర్కొంటున్నారు. తప్పుడు, పరువు నష్టం కలిగించే కంటెంట్‌ను వ్యాప్తి చేస్తున్న వారిపై నా బృందం కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటుంది. ఈ కష్టకాలంలో నాకు అండగా నిలిచిన వారందరికీ కృతజ్ఞతలు’’ అని పలాష్ ముచ్చల్ ముగించాడు.
ఇదేనా కారణం?
స్మృతి మంధాన, పలాష్ ముచ్చల్ చాలా కాలం నుంచి రిలేషన్ షిప్ లో ఉన్నారు. ఈ ఏడాది ఇండియన్ వుమెన్ టీమ్ వరల్డ్ కప్ గెలిచిన తర్వాత మంధానకు పలాష్ ప్రపోజ్ చేశాడు. వీళ్ల పెళ్లి ముహూర్తాన్ని నవంబర్ 23గా నిర్ణయించారు. మెహందీ, సంగీత్ వేడుకలు ఘనంగా జరిగాయి. కానీ చివరకు వివాహం రద్దు అయింది. అయితే సంగీత్ రోజు రాత్రి వెడ్డింగ్ కొరియోగ్రాఫర్ తో కలిసి స్మృతిని పలాష్ చీట్ చేశాడనే వార్తలు వస్తున్నాయి.
స్మృతి మంధాన ఇలా
{{/usCountry}}స్మృతి మంధాన, పలాష్ ముచ్చల్ చాలా కాలం నుంచి రిలేషన్ షిప్ లో ఉన్నారు. ఈ ఏడాది ఇండియన్ వుమెన్ టీమ్ వరల్డ్ కప్ గెలిచిన తర్వాత మంధానకు పలాష్ ప్రపోజ్ చేశాడు. వీళ్ల పెళ్లి ముహూర్తాన్ని నవంబర్ 23గా నిర్ణయించారు. మెహందీ, సంగీత్ వేడుకలు ఘనంగా జరిగాయి. కానీ చివరకు వివాహం రద్దు అయింది. అయితే సంగీత్ రోజు రాత్రి వెడ్డింగ్ కొరియోగ్రాఫర్ తో కలిసి స్మృతిని పలాష్ చీట్ చేశాడనే వార్తలు వస్తున్నాయి.
స్మృతి మంధాన ఇలా
{{/usCountry}}స్మృతి మంధాన ఇన్ స్టా స్టోరీలో.. ‘‘గత కొన్ని వారాలుగా నా జీవితం గురించి ఎన్నో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ సమయంలో నేను స్పందించడం ముఖ్యమని భావిస్తున్నా. నేను చాలా ప్రైవేట్ పర్సన్‌ను, అలాగే ఉండాలనుకుంటున్నా. కానీ పెళ్లి రద్దయినట్లు స్పష్టం చేయాలనుకుంటున్నా. ఈ విషయాన్ని ఇక్కడితో ముగించి, మీరందరూ కూడా అలాగే చేస్తారని కోరుకుంటున్నా. ఈ సమయంలో ఇరు కుటుంబాల గోప్యతను గౌరవించాలని, మాకు మాకుగా ఈ విషయాన్ని అధిగమించడానికి కొంత సమయం ఇవ్వాలని మిమ్మల్ని అభ్యర్థిస్తున్నా.
మనందరినీ నడిపించే ఒక ఉన్నతమైన ఉద్దేశ్యం ఉందని నేను నమ్ముతున్నా. నాకు అది ఎల్లప్పుడూ నా దేశానికి అత్యున్నత స్థాయిలో ప్రాతినిధ్యం వహించడమే. వీలైనంత ఎక్కువ కాలం భారతదేశం కోసం ఆడి, ట్రోఫీలు గెలవాలని ఆశిస్తున్నా. నా దృష్టి ఎల్లప్పుడూ దానిపైనే ఉంటుంది. మీ అందరి మద్దతుకు ధన్యవాదాలు. ముందుకు సాగాల్సిన సమయం వచ్చింది’’ అని స్మృతి పేర్కొంది.