భారత స్టార్ మహిళా క్రికెటర్ స్మృతి మంధాన సంచలన నిర్ణయం తీసుకుంది. తన ప్రియుడైన సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్ తో తన వివాహం రద్దు అయినట్లు ఆమె ప్రకటించింది. ఆదివారం స్మృతి మంధాన ఇన్ స్టాగ్రామ్ లో ఈ సంచలన స్టోరీ పెట్టింది. గత కొన్ని వారాలుగా వార్తల్లో నిలిచిన ఈ సంబంధానికి ఇలా ఆకస్మాత్తుగా ముగింపు పలికింది.
స్మృతి మంధాన పెళ్లి రద్దు

భారత విమెన్స్ క్రికెట్ టీమ్ వైస్ కెప్టెన్ స్మృతి మంధాన కఠిన పరిస్థితులు ఎదుర్కొంటోంది. తన ప్రియుడు పలాష్ ముచ్చల్ ను ఆమె పెళ్లి చేసుకోవాలనుకుంది. మెహందీ, సంగీత్ లాంటి వివాహ వేడుకలు ఘనంగా జరిగాయి. కానీ నవంబర్ 23, వెడ్డింగ్ రోజున స్మృతి మంధాన తండ్రికి హార్ట్ స్ట్రోక్ కారణంగా పెళ్లి వాయిదా పడింది. ఇప్పుడు వివాహం రద్దు అయినట్లు ఆదివారం (డిసెంబర్ 7) స్మృతి మంధాన ఇన్ స్టా స్టోరీ ద్వారా వెల్లడించింది.
ప్రైవసీ కోరుతూ
భారత వైస్-కెప్టెన్ స్మృతి మంధాన ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి ప్రైవసీ (గోప్యత)ని కోరుతూ ఒక బహిరంగ ప్రకటన విడుదల చేసింది. తాను నిశ్శబ్దంగా ముందుకు సాగాలనే తన కోరికను నొక్కి చెప్పింది. ముచ్చల్‌తో ఇప్పుడు రద్దు అయిన వివాహం చుట్టూ తిరుగుతున్న విపరీతమైన ఊహాగానాలతో మంధాన బాధపడుతున్నట్లు స్పష్టంగా కనిపించింది. శాంతి, నిశ్శబ్దాన్ని కోరింది.
ఇన్ స్టా పోస్ట్
"గత కొన్ని వారాలుగా నా జీవితం చుట్టూ చాలా ఊహాగానాలు ఉన్నాయి. ఈ సమయంలో మాట్లాడటం. ముఖ్యమని భావిస్తున్నా. నేను చాలా గోప్యతను పాటించే వ్యక్తిని. నేను ఆ విధంగానే ఉంచాలనుకుంటున్నా. కానీ వివాహం రద్దు అయిందని నేను స్పష్టం చేయాలి. నేను ఈ విషయాన్ని ఇక్కడితో ముగించాలనుకుంటున్నా. మీ అందరినీ కూడా అలాగే చేయమని కోరుతున్నా. దయచేసి ఈ సమయంలో రెండు కుటుంబాల గోప్యతను గౌరవించాలని, మాకు మా స్వంత వేగంతో ప్రాసెస్ చేయడానికి, ముందుకు సాగడానికి అవకాశం ఇవ్వాలని కోరుతున్నా’’ అని ఇన్ స్టా స్టోరీలో స్మృతి మంధాన పేర్కొంది.
దేశం కోసం ట్రోఫీలు
‘‘మనందరినీ నడిపించే ఉన్నతమైన ఉద్దేశ్యం ఉందని నేను నమ్ముతున్నా. నాకు అది ఎల్లప్పుడూ అత్యున్నత స్థాయిలో నా దేశానికి ప్రాతినిధ్యం వహించడం. నేను వీలైనంత కాలం భారతదేశం కోసం ఆడుతూ ట్రోఫీలను గెలుచుకోవాలని ఆశిస్తున్నా. నా దృష్టి ఎల్లప్పుడూ అక్కడే ఉంటుంది. మీ అందరి మద్దతుకు ధన్యవాదాలు. ముందుకు సాగాల్సిన సమయం వచ్చింది" అని స్మృతి మంధాన స్టోరీలో ప్రకటించింది.
{{/usCountry}}‘‘మనందరినీ నడిపించే ఉన్నతమైన ఉద్దేశ్యం ఉందని నేను నమ్ముతున్నా. నాకు అది ఎల్లప్పుడూ అత్యున్నత స్థాయిలో నా దేశానికి ప్రాతినిధ్యం వహించడం. నేను వీలైనంత కాలం భారతదేశం కోసం ఆడుతూ ట్రోఫీలను గెలుచుకోవాలని ఆశిస్తున్నా. నా దృష్టి ఎల్లప్పుడూ అక్కడే ఉంటుంది. మీ అందరి మద్దతుకు ధన్యవాదాలు. ముందుకు సాగాల్సిన సమయం వచ్చింది" అని స్మృతి మంధాన స్టోరీలో ప్రకటించింది.
{{/usCountry}}