RCBకి రెండో WPL టైటిల్- పలాష్ ముచ్చల్‌పై స్మృతి మంధాన తల్లి స్మితా సెటైర్లు- ఆంటీ తోపు అంటూ నెటిజన్స్!
స్మృతి మంధాన వీరోచిత పోరాటంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) వరుసగా రెండోసారి డబ్ల్యూపీఎల్ ఛాంపియన్‌గా నిలిచింది. అయితే, మైదానంలో స్మృతి ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడితే.. సోషల్ మీడియాలో ఆమె తల్లి స్మితా మంధాన తన కూతురు మాజీ ప్రియుడు పలాష్ ముచ్చల్‌పై వేసిన 'సెటైర్లు' నెట్టింట వైరల్ అవుతున్నాయి.
మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) 2026 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరోసారి జైత్రయాత్రను కొనసాగించింది. వడోదర వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్‌లో 6 వికెట్ల తేడాతో విజయం సాధించి, వరుసగా రెండో ఏడాది కూడా ట్రోఫీని ముద్దాడింది ఆర్సీబీ. ఈ చారిత్రాత్మక విజయంలో కెప్టెన్ స్మృతి మంధాన (41 బంతుల్లో 87 పరుగులు) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయింది.

అనారోగ్యాన్ని జయించి.. అద్భుతం చేసి!
ఈ విజయం వెనుక స్మృతి అంకితభావం ఎంత ఉందో తెలిస్తే ఎవరైనా ముక్కున వేలేసుకోవాల్సిందే. ఫైనల్ మ్యాచ్‌కు ముందు రోజు స్మృతి మంధాన 103 డిగ్రీల తీవ్ర జ్వరంతో బాధపడ్డారు. అయినప్పటికీ, జట్టు కోసం జ్వరం లెక్కచేయకుండా మైదానంలోకి అడుగుపెట్టారు. 204 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో జార్జియా వోల్‌తో (79) కలిసి స్మృతి ఆడిన ఇన్నింగ్స్ డబ్ల్యూపీఎల్ చరిత్రలోనే చిరస్థాయిగా నిలిచిపోతుంది.
నెట్టింట 'ఆంటీ తోపు' అంటూ హల్‌చల్
అయితే, మైదానం బయట మరో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. గత ఏడాది స్మృతి మంధాన, బాలీవుడ్ గాయకుడు పలాష్ ముచ్చల్ నిశ్చితార్థం తర్వాత వివాహం ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఫైనల్‌లో స్మృతి ఢిల్లీ బౌలర్లను ఉతికి ఆరేస్తుంటే.. "స్మృతి బంతుల్లో తన మాజీ ప్రియుడి మొహాన్ని చూసుకుని కొడుతున్నట్లుంది" అంటూ సోషల్ మీడియాలో మీమ్స్ ప్రత్యక్షమయ్యాయి.
ఇవే కాకుండా అందరినీ ఆశ్చర్యపరుస్తూ స్మృతి తల్లి స్మితా మంధాన స్వయంగా ఈ మీమ్‌ను తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేశారు. పలాష్‌ను ఉద్దేశించి వచ్చిన ఈ వ్యంగ్యాస్త్రాన్ని ఆమె సమర్థించడంతో నెటిజన్లు ఫిదా అయిపోయారు.
"స్మృతి తల్లి మామూలు వ్యక్తి కాదు.. నిజమైన సావేజ్ ఆంటీ (ఆంటీ తోపు అన్న అర్థంలో)!" అంటూ కామెంట్లు కురిపిస్తున్నారు. అయితే శనివారం (ఫిబ్రవరి 7) ఉదయానికి ఆ పోస్ట్ వైరల్ కావడంతో స్మితా మంధాన దానిని తొలగించారు.
ముగిసిన ఆరేళ్ల బంధం..
ఇదిలా ఉంటే, స్మృతి, పలాష్ ముచ్చల్ గత ఆరేళ్లుగా ప్రేమలో ఉన్నారు. 2025 నవంబర్‌లో సాంగ్లీలో వీరి పెళ్లి జరగాల్సి ఉంది. కానీ, అనూహ్య కారణాల వల్ల పెళ్లికి కొన్ని గంటల ముందే ఈ బంధం తెగిపోయింది. పలాష్ మోసం చేశాడని అప్పట్లో వార్తలు వచ్చినా, ఇరు కుటుంబాలు మాత్రం ఆరోగ్య కారణాల వల్ల పెళ్లి వాయిదా పడిందని పేర్కొన్నాయి.

ఆ బాధ నుంచి కోలుకుని స్మృతి ఇప్పుడు క్రికెట్ మైదానంలో తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తోంది. మొత్తానికి, అటు ఆటలోనూ, ఇటు వ్యక్తిగత జీవితంలోనూ ఎదురైన సవాళ్లను ధీటుగా ఎదుర్కొని 'క్వీన్ మంధాన' అని తన అభిమానులతో అనిపించుకుంటోంది స్మృతి.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


