అక్కినేని కోడలు శోభితా ధూళిపాళ ఇటీవల ఓటీటీలో రిలీజైన ‘చీకటిలో’ అనే సైకో క్రైమ్ థ్రిల్లర్ తో మళ్లీ తెలుగులోకి తిరిగొచ్చింది. వివిధ భాషల సినిమాల్లో నటించిన ఆమె సినిమా రంగంలో పీఆర్ కల్చర్, పబ్లిసిటీ గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది.
శోభితా సెలక్షన్

శోభితా ధూళిపాళ తన కెరీర్ లో వివిధ భాషల్లోని సినిమాల్లో నటించారు. ఇటీవల 'చీకటిలో' ఓటీటీ మూవీతో ఆమె తెలుగు సినిమాకు తిరిగి వచ్చారు. తాజాగా ఓ పాడ్ కాస్ట్ లో తన సినిమాల సెలక్షన్ పై శోభితా ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేసింది. ముఖ్యంగా చీకటిలో సినిమా కోసం సైన్ చేసేముందు ఆమె ఏ విషయాలను ఆలోచించిందోనని చెప్పుకొచ్చింది.
చాలా డీప్ గా
"నేను ఈ (చీకటిలో) ప్రాజెక్టుకు ఓకే చెప్పినప్పుడు అంత డీప్ గా ఆలోచించలేదు. ఒక ఆడియన్ గా తెలుగు సినిమాతో నాకు చాలా అనుబంధం ఉంది. ఒక ఆర్టిస్ట్ గానూ ఉంది. నేను యాక్టింగ్ ప్రారంభించినప్పుడు తెలుగు అమ్మాయిని అనే అనుభవం సహజంగానే ఉపయోగపడింది.
ఈ (చీకటిలో) సినిమాలో నేను ఒక పాడ్‌కాస్టర్ పాత్ర పోషించాను కాబట్టి చాలా స్పష్టమైన పదాలు వాడాల్సి వచ్చింది. నా భాషను మాట్లాడటం చాలా సంతోషంగా అనిపించింది. ఇది నా మాతృభాష. ఈ రకమైన సంభాషణలను పలకడం భాష తెలియకపోతే సులువు కాదు’’ అని శోభితా తెలిపింది.
పీఆర్ కల్చర్
సినిమా రంగంలో పీఆర్ కల్చర్ పెరిగిపోతుందనే దానిపై శోభితా ధూళిపాళ సంచలన వ్యాఖ్యలు చేసింది. "గత కొన్నేళ్లుగా అప్పుడప్పుడూ నా కోసం ఓ పీఆర్ సంస్థను అసైన్ చేసుకున్నా. కానీ నా వ్యక్తిత్వానికి, నేను తీసుకోవాలనుకునే నిర్ణయాలకు, నా జీవితానికి ఇది అవసరం లేదని అనిపించింది. నేను 24x7 బయట కనిపించాలని అనుకోవడం లేదు. ఎప్పుడూ ఏదో ఒకటి మాట్లాడాలని కూడా అనుకోను. నాకు ఆ ఇంట్రెస్ట్ లేదు’’ అని శోభితా చెప్పింది.
నా గురించి
{{/usCountry}}సినిమా రంగంలో పీఆర్ కల్చర్ పెరిగిపోతుందనే దానిపై శోభితా ధూళిపాళ సంచలన వ్యాఖ్యలు చేసింది. "గత కొన్నేళ్లుగా అప్పుడప్పుడూ నా కోసం ఓ పీఆర్ సంస్థను అసైన్ చేసుకున్నా. కానీ నా వ్యక్తిత్వానికి, నేను తీసుకోవాలనుకునే నిర్ణయాలకు, నా జీవితానికి ఇది అవసరం లేదని అనిపించింది. నేను 24x7 బయట కనిపించాలని అనుకోవడం లేదు. ఎప్పుడూ ఏదో ఒకటి మాట్లాడాలని కూడా అనుకోను. నాకు ఆ ఇంట్రెస్ట్ లేదు’’ అని శోభితా చెప్పింది.
నా గురించి
{{/usCountry}}"నేను పీఆర్ టీమ్ తో పని చేయను. నాకు అది అవసరం లేదు. కానీ బహుశా అది వేరేవాళ్లకు అవసరమేమో. ఇందులో ఎలాంటి రూల్స్ లేవు. ఎందుకంటే ఎవరి ప్రయారిటీస్ వాళ్లకు ఉంటాయి. నా గురించి నాకు తెలుసు. నా సొంత ప్రాధాన్యతల గురించి నాకు తెలుసు’’ అని శోభితా వివరించింది.
‘‘నేను సినిమా ప్రపంచం నుంచి లేదా ముంబై నుంచి రాలేదు. నాది విశాఖపట్నం. అక్కడి నుంచే నేను నేర్చుకున్నా. నాకు ఏం కావాలో, ఏం వద్దో అనే క్లారిటీ ఉంది. నాకు నా గురించి మాత్రం తెలుసు’’ అని శోభితా పేర్కొంది.