ఓ తెలుగు థ్రిల్లర్ మూవీ ఇప్పుడు నేరుగా ఓటీటీలోకి వస్తోంది. అందులోనూ ఈ సినిమాలో లీడ్ రోల్లో నటించింది శోభితా ధూళిపాళ కావడంతో దీనిపై మరింత ఆసక్తి నెలకొంది. 'చీకటిలో' అనే ఈ సినిమా స్ట్రీమింగ్ తేదీని అమెజాన్ ప్రైమ్ వీడియో గురువారం (జనవరి 8) తన సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అనౌన్స్ చేసింది.
చీకటిలో మూవీ ఓటీటీ రిలీజ్ డేట్

అక్కినేని నాగ చైతన్యతో పెళ్లి తర్వాత ఏడాది కాలంగా తెలుగు వాళ్లకు కూడా బాగా దగ్గరైన తెలుగమ్మాయి శోభిత ధూళిపాళ. ఆమె ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా 'చీకటిలో' (Cheekatilo). ఈ సినిమా థియేటర్లను స్కిప్ చేసి డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ అవుతోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో జనవరి 23 నుంచి స్ట్రీమింగ్‌కు రాబోతోంది.
తెలుగులో అడివి శేష్ 'మేజర్' సినిమా తర్వాత శోభిత నటిస్తున్న డైరెక్ట్ తెలుగు సినిమా ఇదే కావడంతో దీనిపై ఆసక్తి నెలకొంది. ఈ సస్పెన్స్ డ్రామా స్ట్రీమింగ్ వివరాలను అమెజాన్ ప్రైమ్ అధికారికంగా వెల్లడించింది. కేవలం తెలుగులోనే కాకుండా.. హిందీ, తమిళ ఆడియోల్లోనూ అందుబాటులో ఉంటుంది.
చీకటిలో మూవీ కథ ఏంటి?
శోభితా ధూళిపాళ ఇంటెన్స్ లుక్ లో ఉన్న ఫస్ట్ లుక్ పోస్టర్ తో మేకర్స్ స్ట్రీమింగ్ తేదీని అనౌన్స్ చేశారు. క్రైమ్ పాడ్‌కాస్టర్ పాత్రలో శోభిత ఇందులో కనిపించింది. మేకర్స్ చెప్పిన వివరాల ప్రకారం.. ఈ కథ మొత్తం హైదరాబాద్ నేపథ్యంలో జరుగుతుంది. ఇందులో శోభిత 'సంధ్య' అనే పాత్రలో కనిపిస్తుంది. ఆమె ఒక ట్రూ క్రైమ్ పోడ్‌కాస్టర్.
సిటీలో జరిగే కొన్ని భయంకరమైన, డెడ్లీ మిస్టరీల వెనుక ఉన్న నిజాన్ని సంధ్య ఎలా వెతికి పట్టుకుంది? చీకటిని ఎదిరించి నిజాన్ని ఎలా బయటపెట్టింది అనేదే ఈ సినిమా కథ. క్రైమ్ బోర్డు ముందు శోభిత కూర్చున్న అనౌన్స్మెంట్ పోస్టర్ ఇప్పటికే ఆసక్తి రేపుతోంది.
{{/usCountry}}సిటీలో జరిగే కొన్ని భయంకరమైన, డెడ్లీ మిస్టరీల వెనుక ఉన్న నిజాన్ని సంధ్య ఎలా వెతికి పట్టుకుంది? చీకటిని ఎదిరించి నిజాన్ని ఎలా బయటపెట్టింది అనేదే ఈ సినిమా కథ. క్రైమ్ బోర్డు ముందు శోభిత కూర్చున్న అనౌన్స్మెంట్ పోస్టర్ ఇప్పటికే ఆసక్తి రేపుతోంది.
{{/usCountry}}ఈ సినిమాను శరణ్ కొప్పిశెట్టి డైరెక్ట్ చేశాడు. శోభితతోపాటు విశ్వదేవ్ రాచకొండ, చైతన్య విశాలాక్షి, ఈషా చావ్లా, సీనియర్ నటీమణులు ఝాన్సీ, ఆమని కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రీసెంట్‌గా అమెజాన్ ప్రైమ్‌లో డ్రైవ్, జటాధర, 12A రైల్వే కాలనీ వంటి చిన్న సినిమాలు వచ్చాయి. ఇప్పుడు ఆ లిస్టులో శోభిత 'చీకటిలో' చేరుతోంది. త్వరలోనే ట్రైలర్ రిలీజ్ కానుంది.