...
...
Next Story

Sodara OTT: ఒకే అమ్మాయిని ప్రేమించే చిరంజీవి, ప‌వ‌న్.. ఏడాది త‌ర్వాత ఓటీటీలోకి తెలుగు కామెడీ ఫిల్మ్‌!

Sodara OTT: తెలుగు కామెడీ సినిమా ఒకటి థియేటర్లో రిలీజైన ఏడాది తర్వాత ఓటీటీలోకి వస్తుంది. ఇందులో చిరంజీవి, పవన్ అనే బ్రదర్స్ ఒకే అమ్మాయిని ప్రేమిస్తారు. మరి ఆ తర్వాత ఏం జరిగిందో, ఈ సినిమా ఏ ఓటీటీలో వస్తుందో చూసేయండి.

Published on: Apr 28, 2026, 09:49:23 IST
Advertisement

Sodara OTT: ఓటీటీలోకి తెలుగు కామెడీ మూవీ ‘సోదరా’ వచ్చేస్తోంది. థియేటర్లో రిలీజైన ఏడాది తర్వాత ఈ చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్ కు రాబోతుండటం గమనార్హం. ఈ సినిమాలో సంపూర్ణేశ్ బాబు హీరో. బ్రోమాంటిక్ స్టోరీగా ఈ సోదరా సినిమాను తెరకెక్కించారు. ఈ మూవీ ఓటీటీ వివరాలపై ఓ లుక్కేయండి.

సోదరా ఓటీటీ

ఓటీటీలోకి తెలుగు కామెడీ మూవీ (instagram-ahavideoin)
ఓటీటీలోకి తెలుగు కామెడీ మూవీ (instagram-ahavideoin)

సంపూర్ణేశ్ బాబు, సంజోష్ అన్నదమ్ములుగా నటించిన తెలుగు కామెడీ సినిమా ‘సోదరా’. ఈ మూవీ ఎట్టకేలకు ఓటీటీలోకి వస్తోంది. మే 1, 2026న డిజిటల్ స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమా ఆహా వీడియో ఓటీటీలో రిలీజ్ కానుంది. ఈ విషయాన్ని ఆహా ఓటీటీ అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. ఇన్ స్టాగ్రామ్ అకౌంట్లో పోస్టు షేర్ చేసింది.

ఏడాది తర్వాత

సోదరా మూవీ ఏడాది తర్వాత ఓటీటీలోకి వస్తోంది. ఈ సినిమా ఏప్రిల్ 25, 2025న థియేటర్లలో రిలీజైంది. కానీ బాక్సాఫీస్ దగ్గర బొక్కబోర్లా పడింది. ఈ మూవీని థియేటర్లో ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పుడు ఏడాది తర్వాత ఈ చిత్రం ఓటీటీలో అడుగుపెట్టనుంది. మే 1, 2026న ఓటీటీ డెబ్యూ చేయనుంది. ఓటీటీ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు వచ్చేస్తోంది.

సోదరా స్టోరీ

చిరంజీవి (సంపూర్ణేశ్ బాబు), పవన్ (సంజోష్) బ్రదర్స్. వీళ్ల ఫ్యామిలీకి సోడా బిజినెస్ ఉంది. చిరంజీవికి వయసు పెరుగుతున్నా పెళ్లి కాదు. ఇదే సమస్యతో బాధపడుతుంటాడు. అప్పుడే ఎదురింట్లోకి దివి (ఆర్తి గుప్తా) అనే అమ్మాయి వస్తుంది. ఆ అమ్మాయిని చిరంజీవి, పవన్ ఇద్దరూ ప్రేమిస్తారు.

మరి ఆ తర్వాత ఏం జరిగింది? ప్రాణానికి ప్రాణంగా ఉండే అన్నదమ్ముల మధ్య గొడవలు ఎందుకు జరిగాయి? అసలు వీళ్ల పెళ్లి జరిగిందా? చిరంజీవి బ్రహ్మచారిగానే ఉండిపోయాడా? అనే ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే సోదరా మూవీ చూడాల్సిందే.

ప్యారడైజ్ లో

సంపూర్ణేశ్ బాబు కామెడీ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. అతను నటించిన హృద‌య కాలేయం, కొబ్బ‌రి మ‌ట్ట‌ లాంటి సినిమాలను ప్రేక్షకులను నవ్వించాయి. ఓ వైపు హీరోగా సినిమాలు చేస్తున్న సంపూర్ణేశ్ బాబు.. ప్రస్తుతం నాని మూవీ ‘ప్యారడైజ్’లో బిర్యానీ అనే క్యారెక్టర్ పోషిస్తున్నాడు. ఇప్పుడు సంపూర్ణేశ్ మూవీ సోదరా ఓటీటీ రిలీజ్ కు రెడీ అయింది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks