...
...
Next Story

Laya Son Of Kanakadurgamma: అమ్మవారిగా సీనియర్ హీరోయిన్ లయ- నిధి అన్వేషణ కథతో సన్ ఆఫ్ కనకదుర్గమ్మ- పోస్టర్ రిలీజ్

Son Of Kanakadurgamma Laya Poster Release: దేవీ నవరాత్రుల పవిత్ర సందర్భంగా 'సన్ ఆఫ్ కనకదుర్గమ్మ' చిత్రం నుంచి సీనియర్ హీరోయిన్ లయ అమ్మవారి రూపంలో ఉన్న పవర్‌ఫుల్ పోస్టర్‌ను స్టార్ ప్రొడ్యూసర్లు వైజయంతీ మూవీస్ అశ్వనీదత్, స్వప్న దత్ విడుదల చేశారు. నిధి అన్వేషణ నేపథ్యంలో ఈ సినిమా సాగనుంది.

Published on: Oct 22, 2026, 10:50:57 IST
Advertisement

Son Of Kanakadurgamma Laya Poster Release: తెలుగు డివోషనల్ కథలతో చాలా అరుదుగా సినిమాలు వస్తుంటాయి. భక్తి పారవశ్యంతో వచ్చే సినిమాల కోసం ఆడియెన్స్ ఎదురుచూస్తుంటారు. ఇలాంటి సమయంలో టాలీవుడ్‌లో ఓ విభిన్నమైన కాన్సెప్ట్ చిత్రం పట్టాలెక్కింది.

సీనియర్ హీరోయిన్ లయ పోస్టర్

అమ్మవారిగా సీనియర్ హీరోయిన్ లయ- నిధి అన్వేషణ కథతో సన్ ఆఫ్ కనకదుర్గమ్మ- పోస్టర్ రిలీజ్
అమ్మవారిగా సీనియర్ హీరోయిన్ లయ- నిధి అన్వేషణ కథతో సన్ ఆఫ్ కనకదుర్గమ్మ- పోస్టర్ రిలీజ్

సీనియర్ హీరోయిన్ లయ, అనురూప్ కటారి, ఆకాంక్ష త్యాగరాజన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'సన్ ఆఫ్ కనకదుర్గమ్మ'. దసరా పండుగ శుభ సమయాన్ని పురస్కరించుకుని సన్ ఆఫ్ కనకదుర్గమ్మ సినిమా నుంచి అత్యంత శక్తివంతమైన పోస్టర్‌ను చిత్రబృందం సోషల్ మీడియా వేదికగా విడుదల చేసింది.

చాలా కాలం తర్వాత పవర్‌ఫుల్ పాత్రతో

టాలీవుడ్ ప్రముఖ నిర్మాతలు వైజయంతీ మూవీస్ అధినేత సి. అశ్వనీదత్, స్వప్న దత్ ఈ ప్రత్యేక పోస్టర్‌ను ఆవిష్కరించి, చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. కుటుంబ కథా చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న నటి లయ, చాలా కాలం తర్వాత ఒక పవర్‌ఫుల్ పాత్రతో వెండితెరపై అలరించబోతున్నారు.

నిధి అన్వేషణ కథతో

విజయవాడ కనకదుర్గమ్మ ఆశీస్సులతో, ఇంద్రకీలాద్రి నేపథ్యాన్ని ముడిపెడుతూ సాగే థ్రిల్లింగ్ నిధి అన్వేషణ (Treasure Hunt) డ్రామాగా ఈ సన్ ఆఫ్ కనకదుర్గమ్మ సినిమాను రూపొందిస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన పోస్టర్‌లో నటి లయ అమ్మవారి దివ్యమైన, ఉగ్ర రూపంలో దర్శనమిచ్చారు.

రౌద్ర రూపంలో నటి లయ.. రొమాలు నిక్కబొడుచుకునేలా సన్నివేశాలు!

"ఈ సినిమాలో నిధి అన్వేషణ కాన్సెప్ట్ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తుంది. నటి లయ అమ్మవారిగా కనిపించే ప్రతి సన్నివేశం థియేటర్లలో ప్రేక్షకులకు రొమాలు నిక్కబొడుచుకునేలా ఉత్కంఠ రేపుతుంది" అని చిత్ర యూనిట్ సభ్యులు ఆశాభావం వ్యక్తం చేశారు.

అద్భుతమైన సాంకేతిక విలువలు.. కట్టిపడేసే యాక్షన్ సీక్వెన్సెస్!

సన్ ఆఫ్ కనకదుర్గమ్మ చిత్రానికి కథతో పాటు సాంకేతిక నిపుణుల పనితనం ప్రధాన బలంగా నిలవనుంది. శశిధర్ లంక స్వరాలు సమకూరుస్తుండగా, ప్రముఖ సంగీత దర్శకుడు సామ్ కే ప్రసన్ నేపధ్య సంగీతం (BGM) అందిస్తున్నారు. ప్రసాద్ కేవీ ఛాయాగ్రహణ బాధ్యతలు చూస్తుండగా, రాజేష్ లంక పవర్ ఫుల్ యాక్షన్ సన్నివేశాలను కొరియోగ్రఫీ చేస్తున్నారు.

శరవేగంగా షూటింగ్

సన్ ఆఫ్ కనకదుర్గమ్మ చిత్రానికి రాఘవేందర్ రెడ్డి కూర్పు బాధ్యతలు తీసుకోగా, చైతన్య మీనవల్లి, ప్రసాద్ కేవీ సంభాషణలు రాశారు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని కీలక విషయాలను త్వరలోనే ప్రకటిస్తామని నిర్మాతలు తెలిపారు.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks