డిసెంబర్ 9న సోనియాగాంధీ బయోపిక్ షూటింగ్ ప్రారంభం.. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్!
అగ్రనేత సోనియా గాంధీ బయోపిక్ తీస్తానని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా సినిమా షూటింగ్ అయ్యే తేదీని వెల్లడించారు.
ఏఐసీసీ అగ్రనేత సోనియా గాంధీ జీవిత చరిత్రను(బయోపిక్) వెండితెరపైకి తీసుకురావాలనే ఆలోచన తనకు ఉందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ప్రకటించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్లతో చర్చించిన అనంతరం ఈ సినిమా ప్రాజెక్ట్‌కు సంబంధించిన పూర్తి ప్రణాళికను అధికారికంగా వెల్లడిస్తానని ఆయన తెలిపారు. గురువారం హైదరాబాద్‌లోని గాంధీ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జగ్గారెడ్డి మాట్లాడారు.

డిసెంబర్ 9న సోనియా గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ సినిమా షూటింగ్‌ను ప్రారంభిస్తామని, తిరిగి ఆమె తదుపరి పుట్టినరోజు నాటికి చిత్రాన్ని పూర్తి చేస్తామని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. ఈ చిత్ర నిర్మాణానికి పార్టీ శ్రేణుల నుంచి నైతిక మద్దతుతో పాటు, స్థానిక మిత్రులు, శ్రేయోభిలాషుల నుంచి ఆర్థిక సహకారం తీసుకుంటానని ఆయన పేర్కొన్నారు.
దేశ రాజకీయాల్లో గాంధీ కుటుంబం చేసిన త్యాగాలు మరే ఇతర రాజకీయ కుటుంబానికి లేవని జగ్గారెడ్డి కొనియాడారు. గతంలో దేశానికి ఎంతోమంది ప్రధానమంత్రులుగా పనిచేసినప్పటికీ, సోనియా గాంధీ చూపిన నిస్వార్థం, ప్రజాసేవా దృక్పథం అత్యున్నతమైనవని ఆయన అన్నారు.
మూడుసార్లు ప్రధానమంత్రి అయ్యే సువర్ణావకాశం తలుపు తట్టినా, దేశ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని సోనియా గాంధీ ఆ పదవిని తృణప్రాయంగా వదులుకున్నారని జగ్గారెడ్డి గుర్తు చేశారు. నాడు మిత్రపక్షాలన్నీ ఆమెనే ప్రధానిగా ఉండాలని కోరినప్పటికీ, ఆమె అంగీకరించలేదని తెలిపారు.
సోనియా గాంధీ ఆత్మకథ ‘బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్’ (Belonging: A Journey of Love)పై వస్తున్న విమర్శలను జగ్గారెడ్డి తిప్పికొట్టారు. 'రూ. 1,000 ఖర్చు పెట్టి సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం చేసుకునే ఈ రోజుల్లో.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినప్పటికీ, ఆ విషయాన్ని తన పుస్తకంలో గొప్పగా చెప్పుకోకపోవడమే ఆమె హుందాతనానికి నిదర్శనం.' అని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు.
సోనియా గాంధీ పుస్తకంపై బీజేపీ ఎంపీ, నటి కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలపై జగ్గారెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కంగనా రనౌత్ ఇప్పటికీ ఒక సినీ నటిలాగే వ్యవహరిస్తున్నారని, ఆమెకు రాజకీయ పరిణతి లేదని ఎద్దేవా చేశారు. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్‌ను, డైలాగులను చదవడం తప్ప ఆమెకు దేశ రాజకీయ చరిత్ర, నాయకుల త్యాగాల గురించి ఏం తెలుసని ప్రశ్నించారు.
ఈ దేశంలోనే పుట్టి, పెరిగి కూడా సామాన్య ప్రజల కష్టాలను అర్థం చేసుకోలేని బీజేపీ నేతలు గొప్పవారా? లేక విదేశాల నుంచి ఈ ఇంటి కోడలిగా వచ్చి, భారతీయ సంస్కృతిని ఆకళింపు చేసుకుని ప్రజల కోసం పాలన సాగించిన సోనియా గాంధీ గొప్పవారా? అని బీజేపీ నాయకత్వాన్ని జగ్గారెడ్డి నిలదీశారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్ఎడిటర్గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్మెంట్లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


