సౌత్ ఇండియా టాప్ హీరోయిన్.. సినిమాకు రూ.15 కోట్లు.. యాడ్‌కు రూ.5 కోట్లు.. డైరెక్టర్‌తో పెళ్లి.. ఈ భామ ఎవరో తెలుసా?
ఈ హీరోయిన్ సౌత్ ఇండియాలోనే టాప్ పొజిషన్ లో కొనసాగుతోంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ మూవీస్ తో బిజీగా ఉంటోంది. ఒక్క మూవీకి రూ.15 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటోంది. డైరెక్టర్ ను పెళ్లి చేసుకున్న ఈ భామ నెట్ వర్త్ రూ.200 కోట్లు. మరి ఈ హీరోయిన్ ఎవరో మీకు తెలుసా?
సౌత్ ఇండియాలో టాప్ హీరోయిన్. ఇండియాలోనే అత్యధిక రెమ్యునరేషన్ అందుకునే హీరోయిన్లలో ఒకరు. ఒక్కో సినిమాకు రూ.15 కోట్లు. యాడ్ కు రూ.5 కోట్లు. ఆమె నెట్ వర్త్ సుమారు రూ.200 కోట్లు. చిత్రాల్లో యాక్టింగ్ తో పాటు ఆదాయంలోనూ అదరగొడుతున్న ఆ భామ ఎవరో కాదు.. లేడీ సూపర్ స్టార్ నయనతార.

నయనతార క్రేజ్
సౌత్ ఇండియాలో నయనతార క్రేజ్ మామూలుగా లేదు. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళంలో ఆమె బిజీ బిజీగా మూవీస్ చేసేస్తోంది. రీసెంట్ గా చిరంజీవితో కలిసి తెలుగులో ‘మన శంకర వరప్రసాద్ గారు’ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఇప్పుడు మలయాళంలో ‘పేట్రియాట్’ మూవీ చేస్తోంది. మమ్ముట్టి, మోహన్ లాల్ 17 ఏళ్ల తర్వాత కలిసి నటిస్తున్న చిత్రం ఇది. ఇక కన్నడలో యష్ హీరోగా నటించిన టాక్సిక్ లో నయనతార కీలక పాత్ర పోషించింది.
అదిరే రెమ్యునరేషన్
లేడీ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న నయనతార ఒక్కో సినిమాకు అదిరే రెమ్యునరేషన్ అందుకుంటోంది. ఒక్కో మూవీకి ఆమె రూ.15 కోట్లు వసూలు చేస్తున్నట్లు టాక్. ఇక ఒక్కో యాడ్ కోసం ఏకంగా రూ.5 కోట్లు డిమాండ్ చేస్తుందని తెలిసింది. ఆమె 50 సెకన్ల యాడ్ కోసం ఇంత భారీ మొత్తం తీసుకుందని సమాచారం. ఈ యాడ్ షూటింగ్ రెండు రోజుల్లోనే కంప్లీట్ అయింది.
నెట్ వర్త్
నయనతార నెట్ వర్త్ సుమారు రూ.200 కోట్లు అని అంచనా. సినిమాలు, యాడ్స్, సోషల్ మీడియా పోస్టులు, ఇతర పెట్టుబడుల ద్వారా నయనతార భారీగా సంపాదిస్తోంది. ఆమెకు ఓ ప్రైవేట్ జెట్ కూడా ఉందని అంటున్నారు. తమిళ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ ను పెళ్లి చేసుకున్న నయనతారకు ఇద్దరు పిల్లలున్నారు. బాలీవుడ్ లో జవాన్ లాంటి సినిమాతో నయనతార సెన్సేషన్ క్రియేట్ చేసింది.
రాబోయే సినిమాలు
నయనతార తెలుగులో నందమూరి బాలకృష్ణ- దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్లో తెరకెక్కుతున్న 'NBK 111' (వర్కింగ్ టైటిల్) చిత్రంలో నటిస్తోంది. 'పేట్రియాట్'తో మలయాళ ఇండస్ట్రీలో కమ్ బ్యాక్ ఇస్తోంది. దీంతో పాటు 'డియర్ స్టూడెంట్స్', 'పట్టు' అనే మరో రెండు మలయాళ సినిమాల్లోనూ నయనతార నటిస్తోంది. ఆమె అమ్మవారిగా కనిపించిన చిత్రం 'మూకుత్తి అమ్మన్' సీక్వెల్ 'మూకుత్తి అమ్మన్ 2' కూడా త్వరలో విడుదల కానుంది. తమిళంలో వరుస సినిమాలతో బిజీగా ఉంది. కన్నడలో నటించిన టాక్సిక్ మార్చి 19న రిలీజ్ కానుంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


