Spider Man OTT: టామ్ హాలండ్ హీరోగా మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ (MCU), సోనీ పిక్చర్స్ కాంబినేషన్‌లో వచ్చిన మోస్ట్ అవేటెడ్ సూపర్ హీరో మూవీ 'స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే' (Spider-Man: Brand New Day). ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది.
స్పైడర్ మ్యాన్ కలెక్షన్లు
ఐమాక్స్ (IMAX) స్క్రీన్లు అందుబాటులో లేకపోయినా.. భారతదేశంలో విడుదలైన తొలి మూడు రోజుల్లోనే స్పైడర్ మ్యాన్ 4 చిత్రం ఏకంగా రూ.309 కోట్ల గ్రాస్ వసూలు చేసి ప్రకంపనలు సృష్టించింది. అంతర్జాతీయంగా వారం రోజులు గడవక ముందే $1 బిలియన్ డాలర్ల గ్రాస్ వసూలు చేసి, 'అవేంజర్స్: ఎండ్ గేమ్' తర్వాత అత్యంత వేగంగా ఈ మైలురాయిని చేరుకున్న రెండవ చిత్రంగా నిలిచింది.
ఈ మూవీ ఇప్పటికే రూ.12000 కోట్లకు పైగా కలెక్షన్లు ఖాతాలో వేసుకుంది. ఇప్పుడు 2 బిలియన్ డాలర్ల క్లబ్ లో చేరే దిశగా పరుగులు తీస్తోంది.
ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడు?
థియేటర్లలో కలెక్షన్ల ఊచకోత కోస్తున్న ఈ స్పైడీ అడ్వెంచర్ డిజిటల్ స్ట్రీమింగ్ కోసం ఆడియన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా సెప్టెంబర్ ఆఖరు లేదా అక్టోబర్ 2026 నాటికి ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉందని నివేదికలు తెలుపుతున్నాయి.
డిజిటల్ రిలీజ్ ఎక్కడ?
సోనీ పిక్చర్స్ గ్లోబల్ డీల్ ప్రకారం ఈ స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే చిత్రం థియేట్రికల్ రన్ ముగిశాక మొదట నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అయ్యే అవకాశం ఉందనే టాక్ నడుస్తోంది.
అయితే ఇండియాలో మొత్తం ఎంసియు (MCU) క్యాటలాగ్తో పాటు 'స్పైడర్ మ్యాన్: నో వే హోమ్' చిత్రం ప్రస్తుతం జియోహాట్‌స్టార్ (JioHotstar) లో అందుబాటులో ఉంది. అందువల్ల ఇండియన్ ఆడియన్స్ కోసం ఈ స్పైడర్ మ్యాన్ 4 మూవీ జియోహాట్‌స్టార్‌లో అందుబాటులోకి వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
పీటర్ పార్కర్ సరికొత్త పోరాటం
{{/usCountry}}అయితే ఇండియాలో మొత్తం ఎంసియు (MCU) క్యాటలాగ్తో పాటు 'స్పైడర్ మ్యాన్: నో వే హోమ్' చిత్రం ప్రస్తుతం జియోహాట్‌స్టార్ (JioHotstar) లో అందుబాటులో ఉంది. అందువల్ల ఇండియన్ ఆడియన్స్ కోసం ఈ స్పైడర్ మ్యాన్ 4 మూవీ జియోహాట్‌స్టార్‌లో అందుబాటులోకి వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
పీటర్ పార్కర్ సరికొత్త పోరాటం
{{/usCountry}}'స్పైడర్ మ్యాన్: నో వే హోమ్' ముగింపులో డాక్టర్ స్ట్రేంజ్ వేసిన స్పెల్ వల్ల పీటర్ పార్కర్ (టామ్ హాలండ్) ఉనికిని లోకమంతా మరిచిపోతుంది. 'బ్రాండ్ న్యూ డే' కథలో పీటర్ ఆ ఏకాంతాన్ని, బాధను దిగమింగుకుంటూ పూర్తిస్థాయి స్పైడర్ మ్యాన్ గా మారి నేరాలను అరికడుతుంటాడు.
అయితే, పీటర్ గతం నుంచి దూరమైన అతని మాజీ ప్రేమికురాలు ఎంజే (జెండయా), ప్రాణస్నేహితుడు నెడ్ (జాకబ్ బాటలోన్) లకు విలన్ మ్యూటెంట్ జీన్ గ్రే (సేడీ సింక్) రూపంలో పెద్ద ముప్పు ఎదురవుతుంది. వారిని కాపాడుకోవడానికి పీటర్ తన వ్యక్తిగత జీవితాన్ని, స్పైడర్ మ్యాన్ క్యారెక్టర్‌ను ఎలా ఒకటిగా మార్చాడనేదే ఈ చిత్ర ప్రధాన కథాంశం. ఈ చిత్రంలో జాన్ బెర్న్థాల్ (పునిషర్), ఫ్లోరెన్స్ పగ్, మార్క్ రుఫాలో (హల్క్), మరీసా టోమే, ట్రానెల్ టిల్మాన్ ముఖ్యాంశ పాత్రల్లో మెరిసారు.
డిజిటల్ రైట్స్ పోరు
సాధారణంగా సోనీ పిక్చర్స్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్‌తో గ్లోబల్ స్ట్రీమింగ్ ఒప్పందం ఉన్నప్పటికీ, భారతదేశంలో మార్వెల్ ఫ్రాంచైజ్ ఆడియన్స్ జియోహాట్‌స్టార్ వైపే ఎక్కువగా ఉన్నారు. థియేటర్లలో $2 బిలియన్ల మార్కును అందుకోవడానికి మేకర్స్ ప్రయత్నిస్తున్నందున ఈ స్పైడర్ మ్యాన్ 4 సినిమా ఓటీటీ విండో కాలపరిమితిని మరో రెండు వారాలు పొడిగించే అవకాశం లేకపోలేదు.