...
...
Next Story

Spirit Director: స్పిరిట్ డైరెక్ట‌ర్‌కు షాక్‌.. న‌టిపై లైంగిక వేధింపుల ఆరోప‌ణ‌లు.. జైలుకు త‌ర‌లింపు.. 14 రోజలు రిమాండ్

Spirit Director: నటిపై లైంగిక వేధింపుల కేసులో స్పిరిట్ సినిమా డైరెక్టర్ కు షాక్ తగిలింది. పోలీసులు ఈ డైరెక్టర్ ను అదుపులోకి తీసుకున్నారు. మేజిస్ట్రేట్ ఆదేశాలతో 14 రోజుల రిమాండ్ కోసం జైలుకు తరలించారు.

Published on: Apr 1, 2026, 13:07:30 IST
Advertisement

ప్రముఖ మలయాళ దర్శకుడు, నిర్మాత రంజిత్‌ కు షాక్ తగిలింది. స్పిరిట్ సినిమాతో జాతీయ అవార్డు సొంతం చేసుకున్న రంజిత్ ను పోలీసులు అరెస్టు చేశారు. రంజిత్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని నటి చేసిన ఆరోపణలే ఇందుకు కారణం. నటి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.

జైలుకు రంజిత్

స్పిరిట్ డైరెక్టర్ (X)
స్పిరిట్ డైరెక్టర్ (X)

నటిపై లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో మలయాళ డైరెక్టర్ రంజిత్ కు రిమాండ్ విధించారు. రంజిత్ ను అరెస్టు చేసిన పోలీసులు మేజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు. మేజిస్ట్రేట్ అతనికి 14 రోజుల జ్యూడీషియల్ రిమాండ్ విధించింది. దీంతో అతణ్ని ఎర్నాకులం సబ్ జైలుకు తరలించారు.

కారవాన్ లో

షూటింగ్ సమయంలో కారవాన్‌లోకి ఆహ్వానించి తనపై లైంగిక దాడికి యత్నించారని బాధితురాలు ఆరోపించింది. ఈ కేసులో బుధవారం ఉదయం రంజిత్‌ను మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా, కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది.

తప్పించుకునే ప్రయత్నం?

అరెస్ట్ తర్వాత రంజిత్ ఆరోగ్యం క్షీణించినట్లు మలయాళ వార్తా సంస్థ మాతృభూమి వెల్లడించింది. పోలీసుల నుంచి తప్పించుకోవడానికి అతను ప్రయత్నించగా, ప్రత్యేక దర్యాప్తు బృందం తోడుపుజ సమీపంలో రంజిత్ కారును అడ్డగించి అదుపులోకి తీసుకుంది. వైద్య పరీక్షల కోసం ఎర్నాకులం జనరల్ ఆసుపత్రికి తరలించిన సమయంలో అతను అసౌకర్యంగా ఫీలైనట్లు సమాచారం.

బెయిల్ కోసం

ప్రస్తుతం రంజిత్‌ను ఎర్నాకులం సబ్ జైలుకు తరలించారు. అతని తరపు న్యాయవాదులు బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నారు. బాధిత నటి ఫస్ట్ అంతర్గత ఫిర్యాదుల కమిటీని (ICC) సంప్రదించగా, వారు నివేదికను కేరళ పోలీసులకు అప్పగించారు. అధికారులు ఈ కేసును అత్యంత గోప్యంగా విచారించి, తగిన ఆధారాలతో ఎఫ్ఐఆర్ (FIR) నమోదు చేసినట్లు తెలుస్తోంది.

జస్టిస్ హేమ కమిటీ నివేదిక బయటకు వచ్చిన తర్వాత మలయాళ చిత్ర పరిశ్రమలోని చీకటి కోణాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. రంజిత్ లాంటి పెద్ద పేరున్న దర్శకుడు ఇలాంటి కేసులో ఇరుక్కోవడం పరిశ్రమలో పెద్ద చర్చకు దారితీసింది.

పాత వివాదాలు

రంజిత్‌పై లైంగిక ఆరోపణలు రావడం ఇది రెండోసారి కావడం గమనార్హం. 2024లో బెంగాలీ నటి శ్రీలేఖ మిత్ర చేసిన ఆరోపణల కారణంగా అతను కేరళ చలనచిత్ర అకాడమీ ఛైర్మన్ పదవికి రాజీనామా చేశాడు. 2009లో 'పలెరి మణిక్యం' సినిమా చర్చల సమయంలో రంజిత్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని ఆమె గతంలో ఫిర్యాదు చేసింది.

స్పిరిట్ సినిమా

రంజిత్ కెరీర్ లో స్పిరిట్ సినిమాకు స్పెషల్ ప్లేస్ ఉంది. మోహన్ లాల్ హీరోగా రంజిత్ తెరకెక్కించిన ఈ సినిమా 2012లో రిలీజైంది. ఈ మూవీకి జాతీయ అవార్డు దక్కింది. మలయాళంలో డైరెక్టర్ గా రంజిత్ కు గొప్ప పేరుంది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks